Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హెయిర్ ఫాల్, బట్టతలకు గుడ్ బై చెప్పే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్...
జుట్టు రాలే సమస్యలు ఒక పీడకల వంటిది. జుట్టు రాలడం మొదలైతే చాలు చాలా మంది ఎక్కువ ఆందోళన చెందుతూ , ఒత్తిడికి గురై దాంతో ఇంకొద్దిగా ఎక్కువగా జుట్టు రాలుతుంది. హెయిర్ ఫాల్ అనే సమస్య ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయస్సులో అనుభవ పూర్వకంగా ఎదుర్కొనే సమస్య . అయితే మొత్తం జుట్టు ఊడిపోయి బట్టతలకు దారి తీస్తే మాత్రం ప్రమాదకర స్థితిగా గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది . బట్టతల వ్యక్తుల యొక్క మనో భావాన్ని కూడా దెబ్బతీస్తుంది. దాంతో వారు నలుగురిలోకి చేరకుండా బాధపడుతుంటారు. బట్టతల అనేది వయస్సైన వారిలో కనిపించే సమస్య . కానీ ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో యంగ్ స్టర్స్ లో ఈ సమస్య మొదలవుతుంది,.
అందుకు ముఖ్యకారణం చెడు జీవనవైలి, పోషకాహార లోపం మరియు ఒత్తిడి, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా పురుషుల్లో బట్టతలకు కారణం అవుతున్నది . అంతే కాదు కొంత మంది మహిళలు కూడా ఇటువంటి ఇబ్బందికరమైన సమస్యను ఎదుర్కొంటున్నారు . బట్టతలకు జీన్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. వంశపారంపర్యంగా కూడా బట్టతలకు కారణం కావచ్చు. అయితే అందుకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ ఉంది?
అయితే నేచురల్ గా హెయిర్ ఫాల్ జరిగి, బట్టతలకు దారితీస్తున్న పరిస్థితుల్లో వెంటనే గుర్తించి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉపయోగించినట్లైతే బట్టతల నుండి విముక్తి పొందవచ్చు . ఇది నిజమైతే చాలా మంచిది అనుకునేవారు లేకపోలేదు? మరి అలాంటి వారిలో మీరు ఒకరైతే వెంటనే ఈ క్రింది లిస్ట్ లో అందించిన కొన్ని హోం రెమెడీస్ ను ఫాలో అయ్యి బట్టతలకు బైబై చెప్పేయండి...హ్యాపి, హ్యాండ్సమ్ గా నలుగురిలో కలుస్తూ...సంతోషంగా గడపండి...

1. మెంతులు:
మెంతులు లేదా మెంతి ఆకులు లేదా మెంతి పౌడర్ ను మజ్జిగ లేదా పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల అద్భుతమైన మార్పు కనిపిస్తుంది . మెంతిఆకుల పేస్ట్ ను హెయిర్ మాస్క్ గా వేసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే హెయిర్ ఫాల్ తగ్గి, హెయిర్ ఫాలిసెల్స్ పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

2. తేనె మరియు ఉల్లిరసం మిక్స్:
హెయిర్ రూట్స్ కు తగిన పోషణ అందివ్వడంలో ఈ రెండు పదార్థాలు గ్రేట్ గా సహాయపడతాయి. తేనె హెయిర్ ఫాల్ తగ్గించడంలో హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని బట్టతల ఏర్పడ్డ ప్రదేశంలో లేదా జుట్టు పల్చగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల జుట్టు తిరిగి పెరగడం ప్రారంభం అవుతుంది . కానీ ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత జుట్టును సరిగా శుభ్రం చేసుకోవాలి .

3. ఆయిల్ మసాజ్:
ఫ్రీక్వెంట్ గా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది. హెయిర్ ఫాలీసెల్స్ కు రక్తప్రసరణను అందిస్తుంది. ఆయిల్ మసాజ్ వల్ల చుండ్రు నివారించబడుతుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది .

4. ఏజ్ ఓల్ద్ హెన్నా ట్రీట్మెంట్:
బట్టతలను నివారించడంలో హెన్నా ఒక ఉపయోగకరమైన రెమెడీ అని చెప్పవచ్చు . పురాతన కాలం నుండి దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. హెన్నా .జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. హెన్నా నేచురల్ డైగా పనిచేస్తుంది . గ్రే, వైట్ హెయిర్ ను హైడ్ చేస్తుంది . జుట్టుకు మంచి షైనింగ్, సాప్ట్ నెస్ వస్తుంది. బట్టతల నివారించబడుతుంది.

5. ఆమ్లా, శీకాకాయ్ మరియు కుంకుడు కాయ:
ఆమ్లా, శీకాకాయ, కుంకుడు కాయలను రెండు మూడు గంటలు వేడి నీటిలో నానబెట్టి, ఈ నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బట్టతలను నివారిస్తుంది. బట్టతల నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం మేడ్ రెమెడీ.

6. గుడ్డు:
ప్రోటీన్ కు గొప్ప మూలం గుడ్డు. హెయిర్ గ్రోత్ కు ప్రోటీనులు ఎక్కువ అవసరం అవుతాయి మరియు హెయిర్ ఫాల్ ను తగ్గించడంలో కూడా ఇవి ఎక్కువ అవసరం అవుతాయి . గుడ్డు బాగా మిక్స్ చేసి హెయిర్ రూట్స్ నుండి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది . జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మాత్రమే కాదు, జుట్టు సిల్కీగా , షైనీగా మరియు ఒత్తుగా మారుతుంది.

7. బ్లాక్ పెప్పర్ మరియు నిమ్మ:
బ్లాక్ పెప్పర్ ను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం పిండి , పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి . బట్టతల ఉన్నప్రదేశంలో అప్లై చేస్తే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

8. ఓవర్ గా తలదువ్వకూడదు మరియు హాట్ వాటర్ బాత్:
ఓవర్ గా తరచూ తలదువ్వుడం వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ బలహీనంగా మారుతాయి . దాంతో జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. అదే విధంగా హాట్ వాటర్ కూడా . మరీ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ బలహీనపడుతాయి దాంతో జుట్టు పల్చబడుతుంది.

9. అలోవెర:
హెయిర్ ఫాల్ తగ్గించడంలో అలోవెర జెల్ గ్రేట్ అని చెప్పవచ్చు . అలోవెర పేస్ట్ ను తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ డ్రైగా మారకుండా మాయిశ్చరైజర్ అందిస్తుంది . మరియు తలలో పిహెచ్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది.

10. పోషకాహారం తీసుకోవాలి.
అనారోగ్యకరమైన ఆహారాలకు మరియు జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఇవి హెయిర్ గ్రోత్ అవ్వకుండా అడ్డుకుంటాయి . ముఖ్యంగా రోజకు సరిపడా నీరు, ద్రవాలను ఎక్కువగా తీసుకుంటూ శరీరంను ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవాలి . జుట్టు రాలడం నివారించుకోవడం కోసం ఇది ఒక ఎఫెక్టివ్ పద్దతి.



Click it and Unblock the Notifications