Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
జుట్టు రాలడం తగ్గించి, డ్యామేజైన జుట్టును రిపేర్ చేసే హెర్బల్ హెయిర్ మాస్క్.!
అందం విషయంలో ఏఒక్కరూ రాజీ పడరు ముఖ్యంగా అమ్మాయిలైతే అస్సలు రాజీ పడరు. ముఖ్యంగా జుట్టు విషయంలో.. లైఫ్ లో ఏదో ఒక సమయంలో జుట్టు సమస్యలు ఎదుర్కుంటారు. ఎక్కువగా జుట్టు రాలడం, సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత ఎక్కువగా జుట్టు రాలుతుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటని ఆలోచిస్తుంటారు? ఈ పరిస్థితి స్త్రీల్లోనే కాదు పురుషుల్లో కూడా ఎక్కువ ? జుట్టు రాలడాన్ని అరికట్టడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ లేదా హోం మేడ్ హెయిర్ మాస్క్ లు ఉన్నాయి. ఇవి జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి.
అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు,హెయిర్ స్ట్రక్చర్ ఉండాలని కోరుకుంటారు. అయితే జుట్టు రాలడానికి కారణం జెనిటిక్ కాంపోజిషన్, ఇంకా మరికొన్నికారణాలు కూడా ఉన్నాయి. ఇన్ స్టాంట్ గా జుట్టు రాలడం నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అయితే వివిధ రకాల ప్రొడక్ట్స్ , ట్రీట్మెంట్స్, మెడికేషన్స్, స్ట్రెస్ ఇవన్నీ జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. సాధారణంగా పురుషులు తలలో వెనుక బాగంలో అలాగే ఫోర్ హెడ్(నుదటన) జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది. మహిళల్లో జుట్టు రాలడం వల్ల జుట్టు పల్చగా మారుతుంది. హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతుంది.
ఈ సమస్యలను నివారించుకోవాలంటేహోం మేడ్ హెయిర్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి రిపేర్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేసినట్లు ఫ్రూవ్ చేయబడినాయి. అలాగే హెయిర్ ఫాలీ సెల్స్ డ్యామేజ్ ను కూడా అరికడతాయి. హెర్బల్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా తక్షణ ఫలితాలను అందిస్తున్నాయి. హెర్బల్ హెయిర్ మాస్క్ వల్ల ఫలితాలు ఆలస్యం అయినా, ఎఫెక్టివ్ ఫలితాలను అందిస్తాయి. మరి అటువంటి హెయిర్ మాస్క్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం..

మెంతి:
మెంతిలో ప్రోటీన్స్ ఎక్కువ, ఇవి హెయిర్ ఎలాసిటిని పెంచుతుంది, హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. అదే కాకుండా, ఇందులో విటమిన్ సి, ఐరన్, లిసిథిన్ లు ఎక్కువగా ఉండటం వల్ల ఇది జుట్టుకు తగిన పోషణను అందివ్వడంతో పాటు, హెయిర్ ఫోలిసెల్స్ కు తగిన పోషణను అందిస్తుంది.
కావల్సిన పదార్థాలు:
మెంతులు: 2tbsp
పెరుగు: 1/2cup
కొబ్బరి నూనె: 1tbsp
తయారుచేయు విధానం:
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీరు వంపేసి మెత్తగా పేస్ట్ చేసి, కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె పేస్ట్ మిక్స్ చేసి, ఈ హెయిర్ మాస్క్ ను తలకు , జుట్టు చివర్ల వరకూ అప్లై చేయాలి. అరగంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి.

ఓట్స్:
ఓట్స్ మరో నేచురల్ హెయిర్ మాస్క్. ఇది బ్యాడ్ మెయిర్ ను నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఓట్స్ లో విటమిన్ బి అధికంగా ఉండటం వల్ల , హెయిర్ ఫోలీ సెల్స్ కు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, తలలో దురదను నివారిస్తుంది, సెబమ్ బిల్డ్ కాకుండా నివారిస్తుంది.
కావల్సిన పదార్థాలు:
ఓట్స్ : 1/2cup
కోకనట్ హెయిర్ ఆయిల్ : 2tbsp
పాలు: 1/2cup
అప్లై చేయు విధానం:
మొత్తం పదార్థాలను పేస్ట్ గా చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను పూర్తిగా జుట్టుకు, తలకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

అలోవెర జెల్:
అలోవెర జెల్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. జుట్టును కావల్సిన మాయిశ్చరైజర్ ను అందివ్వడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది.
కావల్సినవి:
అలోవెర జెల్ : 3 టేబుల్ స్పూన్స్
కొబ్బరి నూనె: 3టుబుల్ స్పూన్స్
అప్లై చేయు విధానం:
అలోవెర, కొబ్బరి నూనె ఒక బౌల్లో తీసుకుని మిక్స్ చేసుకోవాలి. రెండు బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ హెయిర్ మాస్క్ ను తలకు అప్లై చేయాలి. తర్వాత హాట్ టవల్ ను తలకు చుట్టాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు డీప్ గా కండీషనర్ అందుతుంది. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

షీకాకాయ్ పౌడర్ :
శీకాయలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తలను పూర్తిగా శుభ్రం చేస్తుంది. చుండ్రును తొలగిస్తుంది, చర్మ రంద్రాలు తెరచుకునేలా చేస్తుంది, జుట్టుకు డీప్ గా కండీషనర్ అందించి, పోషణను అందిస్తుంది.
కావల్సినవి:
శీకాయపౌడర్: 1టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె: 1కప్పు
అప్లై చేయు విధానం:
శీకాయ పౌడర్ ను కొబ్బరి నూనె బాటిల్లో వేసి బాగా షేక్ చేయాలి. రెండు మూడు వారాలో అలాగే ఉండనివ్వాలి. అప్పుడప్పుడు షేక్ చేస్తుండాలి. రెండు వారాల తర్వాత శీకాయ ఆయిల్ రెడీ. దీన్ని తలకు ఉపయోగించాలి.

గుడ్డు:
గుడ్డులో 80శాతం ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని కెరోటిన్ అని కూడా పిలుస్తారు, ఇది జుట్టు యొక్క ఎలాసిటిని పెంచుతుంది. జుట్టును బలోపేతం చేస్తుంది. హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ గా తీసుకోవడం మంచిది.
కావల్సినవి:
గుడ్డు: 1 వైట్ మాత్రమే
కొబ్బరి నూనె: 1 టేబుల్ స్పూన్
తేనె : 1 టీస్పూన్
అప్లై చేయు విధానం:
ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా తేనె, కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. 5నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి 20 నిముషాల తర్వాత తల స్నానం చేయాలి. ఈ నేచురల్ హెర్బల్ రెమెడీస్ ను కంటిన్యుగా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications