Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హెయిర్ ఫాల్ ను తగ్గించే ఆనియన్ జ్యూస్ రెమెడీస్ ..!!
జుట్టు సమస్యల్లో హెయిర్ ఫాల్ ఒకటి. హెయిర్ ఫాల్ అని ఎలా గుర్తిస్తారు? పడుకున్నప్పుడు, పిల్లో, బెడ్ షీట్ మీద ఎక్కువగా జుట్టు రాలి ఉండటాన్ని గమనించడం ? తల దువ్విన ప్రతి సారి దువ్వెనకు జుట్టు ఊడిరావడం జరుగుతుంది? ఇలాంటి పరిస్థితికి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. జుట్టు ఒక్క సారి రాలడం మొదలైతే ఒక వారంలో లేదా నెలలోపు జుట్టు బాగా పల్చబడిపోతుంది!
ఒక రోజుకు 50 నుండి 50 to 100 వెంట్రుకలు రాలిపోతుంటే అది నార్మల్ హెయిర్ ఫాల్ గా గుర్గిస్తారు. అయితే ఇంత కంటే ఎక్కువ జుట్టు రాలుతున్నట్లైతే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. జుట్టు రాలడానికి కారణమేదైనా... ఎప్పటికప్పడు జుట్టు రాలడం గుర్తించిన వెంటనే తగిన నివారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకు వివిధ రకాలు హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఉల్లిపాయ.
జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఉల్లిపాయ రసం గ్రేట్ గా సమాయపడుతుంది. అంతే కాదు ఉల్లి పాయ రసంతో వేసుకునే హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగపడుతుందనేగా మీ సందేహం..? ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ కంటెంట్ , తలలో కెరోటిన్ ని ఉత్పత్తి కాకుండా బ్లాక్ చేస్తుంది. కెరోటినిన్ అనే ప్రోటీన్ మన జుట్టు పెరుగుదలకు 80శాతం వరకూ ఉపయోగడపడుతుంది. కాబట్టి, ఉల్లిపాయ రసాన్ని హెయిర్ మాస్క్ గా వేసుకోవడం వల్ల కెరోటినిన్ ను ప్రిజర్వ్ చేస్తుంది. దాంతో జుట్టు రాలకుండా అరికడుతుంది .
మొక్కలకు నీరు ఎలా అవసరమవుతుందో, అదే విధంగా జుట్టుకు పెరుగుదలకు బ్లడ్ సర్క్యులేషన్ అవసరమవుతుంది. ఉల్లిపాయ రసంను తలకు మాస్క్ లా వేసుకున్నప్పుడు బ్లడ్ పల్చగా మారి, తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఉల్లిపాయ రసాన్నితలకు అప్లై చేసినప్పుడు లైట్ గా మంటగా లేదా వెచ్చని అనుభూతి కలుగుతుంది. ఇది హెయిర్ ఫోలిసెల్ మీద పనిచేయడం వల్ల అలా జరుగుతుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ బ్యాక్టీరియల్, యంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం ఏవిధంగా ఉపయోగించాలిని, ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..
జుట్టు రాలడం తగ్గించుకోవడానికి ఉల్లిపాయ రసంను 6 పద్దతుల్లో ఉపయోగించుకోవచ్చు..

ఉల్లిపాయ రసం + తేనె
ఉల్లిపాయ రసం + తేనె
తేనె నేచురల్ రెమెడీ. ఇది జుట్టుకు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఉల్లిపాయ రసంతో జోడించినప్పుడు, ఆనియన్ మాస్క్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలను డబుల్ అవుతుంది.!
ఎలా పనిచేస్తుంది
1/3rd కప్పు ఉల్లిపాయ రసంలో 1 టేబుల్ స్పూనె తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయొచ్చు. ఇలావారంలో రెండు మూడు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ రసం + కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి తలను శుభ్రం చేయడంతో పాటు, జుట్టు ఎలాసిటిని పెంచుతుంది. అలాగే హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది.
ఎలా పనిచేస్తుంది :
ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి, అందులో నిమ్మరసం మిక్స్ చేసి 5 నిముషాల తర్వాత గోరువెచ్చగా తలకు అప్లై చేయాలి. చేతి వేళ్ళతో సున్నితంగా మాసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన అరగంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

తలస్నానం చేసిన తర్వాత ఉల్లి రసం అప్లై చేయాలి:
జుట్టు రాలడం తగ్గించుకోవడానికి తలస్నానం చేసిన తర్వాత ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, అందునుండి రసం తియ్యాలి. ఈ రసానికి 1 కప్పు డిస్టిల్డ్ వాటర్ మిక్స్ చేసి, బాగా మిక్స్ చేసి, వడగట్టుకోవాలి. తలకు షాంపు చేసిన తర్వాత ఆనియన్ వాటర్ ను తలారా పోసుకోవాలి. 5 నిముషాల తర్వాత తిరిగి షాంపుతో తలస్నానం చేయాలి.

ఉల్లిపాయ రసం + రమ్
యాంటీఆక్సిడెంట్స్ కు ఉల్లిపాయ పవర్ఫుల్ హౌస్ . వీటిలో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి, ఇది హెయిర్ ఎలాసిటి పెంచడంలో గ్రేట్ గా పనిచేస్తుంది, హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది .
ఎలా పనిచేస్తుంది
ఉల్లిపాయకు పొట్టు తీసి, సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిలో ఒక కప్పు రమ్ ను పోయాలి. రాత్రంతా రమ్ లో ఉల్లిపాయ ముక్కలు నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం రమ్ ను వడట్టి, 20 తలకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి. ఈ ఆనియన్ రమ్ హెయిర్ మాస్క్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆనియన్ జ్యూస్ + బాదం ఆయిల్ :
జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటే ఉల్లిపాయ రసం మరియు బాదం ఆయిల్ బెస్ట్ ఆప్షన్. బాదం ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. బాదంలో ఆయిల్లో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. ఎలా పనిచేస్తుంది: ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్లో, అదే క్వాంటిటీలో ఉల్లిపాయ రసంను మిక్స్ చేయాలి. తలను తేమ చేసి, ఆయన్, బాదం ఆయిల్ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ + గుడ్డు
ఇది ఫర్ఫెక్ట్ కాంబినేషన్ కాదు, అయితే వాసన పరంగా, ఇది పనిచేస్తుంది. గుడ్డులో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇది డల్ అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ను నివారిస్తుంది. ఎలా పనిచేస్తుంది: ఒక ఎగ్ వైట్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉల్లపాయ రసం మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టుకు పోషకాలు పూర్గిగా గ్రహిస్తాయి. 30 గంట తర్వాత రెగ్యులర్ గా షాంపుతో తలస్నానం చేయాలి. ఆనియన్ జ్యూస్ తో తయారుచేసే ఈ హెయిర్ మాస్క్ లను తరచూ ఫాలోఅవుతుంటే జుట్టు రాలడం నివారించబడి, జుట్టు పెరడగానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











