Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
సమ్మర్ ఎఫెక్ట్ కారణంగా తలలో చెమట, దురద చికాకు పెడుతున్నాయా ?
సమ్మర్ వచ్చేసింది.. ఎండ, చెమట, ఉక్కపోతకి శరీరమంతా అల్లాడిపోతోంది. సూర్యకిరణాలు జుట్టు, చర్మానికి చాలా హానికలిగిస్తాయి. జుట్టు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే.. సూర్య రశ్మి కారణంగా.. జుట్టు షైనింగ్ ని కోల్పోయి.. నిర్జీవంగా మారుతుంది.
సమ్మర్లో కేశ సంరక్షణకు హోంమేడ్ హెయిర్ ప్యాక్స్..
ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి పోషణ అందుతుంది. సమ్మర్ లో చర్మం, జుట్టు విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే.. వేడి కారణంగా.. సున్నితమైన ఈ రెండింటిపైనా.. దుష్ర్పభావం పడుతుంది.
టెంపరేచర్ పెరిగినప్పుడు జుట్టు చాలా బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. కాబట్టి హోంమేడ్ టిప్స్ ఫాలో అవడం వల్ల ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఒక వేళ మీ స్కాల్ప్ ఆయిలీగా, చెమటగా ఉంటే.. నీటితో మీ తలమాడుని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి జుట్టుకి ఆయిల్ పెట్టడం కూడా చాలా అవసరం. ఇలాంటి ఇంకా కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవడం వల్ల శరీరంతోపాటు, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. సమ్మర్ లో ఉండే చికాకు నుంచి దూరంగా ఉండవచ్చు.

ఆయిల్
ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్.. ఈ మూడు ఆయిల్స్ చాలా మంచివి. కాబట్టి సమ్మర్ ఈ ఆయిల్స్ తో తలకు బాగా మసాజ్ చేయడం వల్ల జుట్టు డ్రై అవకుండా, రాలకుండా కాపాడుతుంది.

వెనిగర్
స్కాల్ప్ కి వెనిగర్ అప్లై చేయడం వల్ల శరీరమంతా చల్లటి అనుభూతి కలుగుతుంది. వెనిగర్ ను జుట్టుకి మసాజ్ చేయడం వల్ల.. పొడిబారడం, దురద వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

కండిషనర్
మీ జుట్టు చాలా డ్రైగా, రఫ్ గా మారింది అంటే.. హోంమేడ్ కండిషర్ లతో స్కాల్ఫ్, రూట్స్ బలంగా తయారవుతుంది. కాబట్టి.. ఇంట్లోనే ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచిది. రాత్రి మెంతులు నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి.. పెరుగు కలిపి పట్టించుకోవడం వల్ల చల్లటి అనుభూతి కలుగుతుంది.

లూజుగా వదిలేయడం
సమ్మర్ లో జుట్టుని ఎక్కువసేపు టైట్ గా ముడివేసుకోకూడదు. జుట్టుని కట్టుకోవడం వల్ల తలలో చెమట ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టుని వదిలేసి.. ఎంజాయ్ చేయండి.

తలకు రక్షణ
సూర్యకిరణాలు డైరెక్ట్ గా తలపై పడటం వల్ల జుట్టు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి జుట్టుని ప్రొటెక్ట్ చేయడం చాలా అవసరం. బయటకు వెళ్లినప్పుడల్లా.. ఖచ్చితంగా.. జుట్టుని కవర్ చేసుకోవాలి.

దోసకాయ
దోసకాయ చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. మీ స్కాల్ఫ్ చల్లగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా.. అయితే.. కుకుంబర్ జ్యూస్ తో.. మీ జుట్టుని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోండి. లేదా దోసకాయ హెయిర్ ప్యాక్ వేసుకున్నా.. జుట్టు షైనింగ్ గా, అందంగా కనిపిస్తుంది.

నీళ్లు
జుట్టుకి నీళ్లు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. వారానికి రెండుసార్లు నీటితో తలను శుభ్రం చేసుకోవడం వల్ల సమ్మర్ లో మీకు చల్లటి అనుభూతి కలుగుతుంది. ఇన్ఫెక్షన్స్, జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.



Click it and Unblock the Notifications
