Latest Updates
-
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు.. -
ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్! -
వైద్య రంగంలో సంచలనం..కొత్త యూరిన్ టెస్ట్ తో బ్లడర్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింపు! -
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి..
కన్నతల్లే కాలయమురాలైన దారుణ ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, కోట్లాది రూపాయల ఆస్తిని కాజేయాలనే దురాశతో కన్నకొడుకునే కడతేర్చింది ఓ తల్లి. నవమాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే ప్రియుడితో కలిసి కొడుకు ప్రాణాలు తీయడం సమాజాన్ని నివ్వెరపరుస్తోంది.
బెంగళూరు ఆర్టీ నగర్ కు చెందిన విజయ్ నారాయణ్(24) తన తల్లి మీనా నారాయణ్ తో కలిసి నివసించేవాడు. భర్త మరణించిన తర్వాత మీనాకు 34 ఏళ్ల రాకేష్ జముని అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. రాకేష్ ను తన కారు డ్రైవర్‌గా నియమించుకున్న మీనా, కొంతకాలానికే అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తల్లి ప్రవర్తన నచ్చని విజయ్ ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇదే విషయంపై తల్లీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

తమ బంధానికి విజయ్ అడ్డుగా మారాడని భావించిన మీనా, రాకేష్ అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. ఈ దారుణానికి కేవలం వివాహేతర సంబంధమే కాకుండా, ఆస్తి తగాదాలు కూడా ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ్ తండ్రి మరణానంతరం కుటుంబానికి బెంగళూరులో మూడు విలువైన ఇళ్లు ఉన్నాయి. ఆ ఆస్తులన్నింటినీ సొంతం చేసుకోవాలనే దురాశ కూడా ఈ హత్యకు దారితీసినట్లు దర్యాప్తులో తేలింది.
పక్కా పథకం ప్రకారం నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలను చూపిస్తానని నమ్మబలికి రాకేష్.. విజయ్ ను బెళగావికి తీసుకెళ్లాడు. అక్కడ విజయ్ కు నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన విజయ్ మత్తులోకి జారుకోగానే, కారులోనే అతడి గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని హైవే పక్కన ఉన్న మురుగు కాలువలో పడేశారు.

నవంబర్ 3న కాలువలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని విజయ్ గా గుర్తించిన తల్లి మీనా, ఏమీ తెలియనట్లు నాటకమాడింది. కానీ పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. కన్నతల్లే ఈ హత్యకు సూత్రధారి అని తెలిసి పోలీసులే విస్తుపోయారు. ఈ కేసులో మీనా, రాకేష్‌తో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.



Click it and Unblock the Notifications
