Latest Updates
-
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.!
డ్రై హెయిర్ ని చిటికెలో సాఫ్ట్ గా మార్చే తేనె ట్రీట్మెంట్స్..!
తేనె జుట్టుకి సహజ మాయిశ్చరైజర్ ని అందించి.. జుట్టు మెరుస్తూ, స్మూత్ గా ఉండటానికి సహాయపడుతుంది. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉండటం వల్ల ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.
మీ జుట్టు నిర్జీవంగా, డ్రైగా కనిపిస్తోందా ? ముట్టుకుంటే చాలా రఫ్ గా అనిపిస్తోందా ? మీ జుట్టు చాలా తేలికగా బ్రేక్ అవుతోందా ? ఒకవేళ ఈ సమస్యలన్నింటినీ మీరు ఫేస్ చేస్తుంటే.. మీ జుట్టు చాలా పొడిబారిపోయిందని గ్రహించాలి.
డ్రై హెయిర్ ని ట్రీట్ చేయాలంటే.. హోం రెమిడీస్ ప్రయత్నించడం మంచిది. కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. మీ జుట్టు మరింత పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి పొడిబారిన జుట్టుని స్మూత్ గా మార్చడానికి సింపుల్ తేనె ట్రీట్మెంట్స్ ఉన్నాయి.

తేనె జుట్టుకి సహజ మాయిశ్చరైజర్ ని అందించి.. జుట్టు మెరుస్తూ, స్మూత్ గా ఉండటానికి సహాయపడుతుంది. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉండటం వల్ల ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. దీనివల్ల జుట్టు బ్రేక్ అవకుండా అడ్డుకోవచ్చు.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. స్కాల్ప్ లో పేరుకున్న మురికిని, చుండ్రుని తొలగించి.. పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. అయితే తేనెను డైరెక్ట్ గా స్కాల్ప్ కి పట్టించరాదు. అలాగే తేనెను అప్లై చేసి.. ఎక్కువగా రుద్దకూడదు. ఇలా చేస్తే.. జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది.
కాబట్టి.. తేనెలో కొన్ని పదార్థాలు మిక్స్ చేసి.. పట్టించుకుంటే.. జుట్టు స్మూత్ గా, షైనీగా మారుతుంది. మరి డ్రై హెయిర్ నివారించే హనీ ట్రీట్మెంట్స్ చూద్దామా..

చివర్లు చిట్లిపోయిన జుట్టుకి
1టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పన్ల ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గుడ్డులోోని తెల్లసొన తీసుకోవాలి. ముందుగా తెల్లసొనను బాగా గిలకొట్టి, తేనె, ఆలివ్ ఆయిల్ కలిపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు జుట్టుని నీటితో తడి చేసి.. పాయలుగా విడదీసి.. ఈ మిశ్రమాన్ని వేళ్లతో పట్టించాలి. జుట్టుని పైకి కట్టి.. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

డ్యామేజ్ హెయిర్
1టేబుల్ స్పూన్ తేనె, 2టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్ కలపాలి. సన్నని మంటపై 2నిమిషాలు వేడి చేయాలి. చల్లారిన తర్వాత జుట్టుకి, స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

డీప్ కండిషనింగ్ మాస్క్
ఒక గిన్నె తీసుకుని 2టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, 1టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఫోర్క్ ఉపయోగించి బాగా కలపాలి. అన్నీ మిక్స్ అయిన తర్వాత స్కాల్ప్ కి, జుట్టంతటికీ మసాజ్ చేయాలి. 30నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సిల్కీ హెయిర్ మాస్క్
బాగా పండిన ఒక అరటిపండు గుజ్జుని మెత్తగా చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మీ జుట్టుని పొరలుగా విడదీసి.. బ్రష్ ఉపయోగించి.. జుట్టుకి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతా తొలగిపోయిన తర్వాత షాంపూ చేసుకోవాలి.

డ్యామేజ్ అయిన జుట్టుకి
2గుడ్లలోని తెల్లసొన, 5 చుక్కల రోజ్ మేరీ ఆయిల్, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఫోర్క్ ఉపయోగించి.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మాస్క్ ని జుట్టుకి పట్టించి.. ఆరిన తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

కర్లీ హెయిర్
బాగా పండిన ఒక అవకాడో పేస్ట్, 1 టేబుల్ స్పూన్ తేనె, 5 చుక్కల ఆల్మండ్ ఆయిఅల్, 5 చుక్కల నిమ్మరసం తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత.. షాంపూ, కండిషనర్ తో శుభ్రం చేసుకోవాలి.

హెయిర్ గ్రోత్
2 టేబుల్ స్పూన్ల తేనెను మీ రెగ్యులర్ షాంపూలో మిక్స్ చేయాలి. ఉపయోగించడానికి ముందు బాగా కలపాలి. జుట్టుని శుభ్రం చేసుకున్న ప్రతిసారీ.. మీ జుట్టుకి పోషణ అందించి.. పెరుగుదలకు సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
