Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హెయిర్ ఫాల్ తగ్గించి, జుట్టు పెరిగేలా చేసే మిరాకిల్ హెర్బల్ రెమెడీస్
జుట్టు సమస్య: స్త్రీ మరియు పురుషులిద్దరిలో వేధించే సమస్య . అయితే ఈ సమస్యకు వ్యక్తి మరో వ్యక్తి మద్య వివిధ కారణాలుంటాయి . ముఖ్యంగా ఎమోషనల్ గా మరియు ఫిజికల్ స్ట్రె, మెడికేషన్స్, ఆటో ఇమ్యూన్ డిసీజ్, క్రాస్ డైట్, న్యూట్రీషియన్ డిఫిషియన్సీ , హైగ్రేట్ ఫీవర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిలో ఒక్కో కారణం ఉంటుంది . జుట్టు రాలడానికి ఒకే సారి రెండు మూడు కారణాలు కూడా ఉండవచ్చు.! కానీ జుట్టు రాలడానికి అసలు కారణం కనుక్కోవడానికి కొద్దిగా కష్టమే . ఆటో ఇమ్యూన్ డిసీజ్ కారణం అయితే మరియు వ్యాధుల నివారణకు తీసుకొనే కొన్ని రకాల మందులు మనకు తెలియకుండానే జుట్టు రాలడానికి కారణం అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి.
జుట్టు రాలడానికి కారణం ఏదైనా హెల్తీ డైట్ మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాలిపోయిన జుట్టును తిరిగి పొందవచ్చు . వీటితో పాటు కొన్ని హెల్తీ హెర్బల్ రెమెడీస్ ను కూడా ఉపయోగించినట్లైతే ఫలితం చాలా త్వరగా చూపెడుతుంది . జుట్టు రాలే సమస్యకు కొరకు రసాయన మార్గం కోసం వెళ్ళవచ్చు. మార్కెట్ లో అనేక షాంపూలు మీ జుట్టు సమస్యల పరిష్కారం కొరకు హామీగా ఉన్నాయి. కానీ అందులోఉండే రసాయనాలు జుట్టుకు మరింత నష్టం కలిగిస్తాయని తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాబట్టి సులభ పరిష్కారం ఏమిటంటే సహజమైన హెర్బల్ రెమెడీస్ తో జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ హెర్బల్స్ జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి .జుట్టు యొక్క నాణ్యతను కూడా పెంచుతుంది. ఇంకా హెర్బల్ రెమెడీస్ సున్నితమైన జుట్టు ఉన్నవారికి ఒక మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు రాలడాన్ని అరికట్టే నేచురల్ హెర్బల్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. అలోవెర:
కలబంద జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది. . అలెవర మొక్క నుండి జెల్ ను పక్కకు తీసుకొని నేరుగా జుట్టుకు అప్లై చేయాలి . 2 గంటల తర్వాత తలస్నానం చేయాలి . ఇదిజుట్టు రాలడం అరికట్టడంతో పాటు, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

2. జెన్సింగ్:
జెన్సింగ్ ఇది జుట్టురాలడం అరికట్టడంలో ఒక ఎఫెక్టివ్ మూలిక. ఇది తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . హెయిర్ ఫోలి సెల్స్ కు రక్తప్రసరణ అందేలా చేస్తుంది . జెన్సింగ్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల , దీంతో పాటు విటమిన్ బి6 మరియు జింక్ సప్లిమెంట్ తీసుకోవచ్చు . జెన్సింగ్ ఆయిల్ కూడా జుట్టుకు , హెయిర్ రూట్స్ కు అప్లై చేయడం వల్ల కొన్ని అద్భుతాలు జరగుతాయి.

3. రోజ్మెరీ:
జుట్టు పెరుగుదలకు ఇది పవర్ ఫుల్ హెర్బ్ . జుట్టు రాలడం అరికట్టుట మాత్రమే కాదు ., కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. తలను శుభ్రం చేస్తుంది. హెయిర్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. ఇది మీ జుట్టు కోసం ఒక అద్భుతమైన హెర్బ్ అని చెప్పవచ్చు. రోజ్మేరీ మీ జుట్టును ప్రకాశ వంతం చేయుట,చుండ్రు మీద పోరాటం మరియు జుట్టు క్షీణతను నియంత్రిస్తుంది. రోజ్మేరీ ఆకులతో మీ జుట్టును శుభ్రం చేయవచ్చు. రోజ్మేరీ ఆకులను సాధారణ నీటిలో 10 నిమిషాలు కాచి చల్లారబెట్టాలి.ఆ తర్వాత ఆకులను తీసివేసి మీ జుట్టు మీద చల్లని రోజ్మేరీ నీటిని పోయాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

4. ఆమ్లా:
ఉసిరికాయలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మీ తల చర్మంపై వచ్చే అనేక రకాల అంటువ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇది పొడి, దెబ్బతిన్న మరియు పలుచటి జుట్టుకు చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. ఇది జుట్టు పెరుగుదల కొరకు విటమిన్ C ని అందిస్తుంది. మరియు ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు కెరోటిన్ వంటి మినిరల్స్ అందివ్వడంతో పాటు హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది . హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది. దీన్ని ఫ్రెష్ గా లేదా పొడి రూపంలో తలకు ఉపయోగించుకోవచ్చు.

5. వేప:
వేపలో స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి తలలో దురద , చుండ్రు లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. దీన్ని తలకు అప్లై చేసినప్పుడు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు నివారిస్తుంది.

6. సేజ్ :
సేజ్ హెర్బ్ మరో ఎఫెక్టివ్ హెయిర్ కేర్ హెర్బ్. ఇందులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆస్ట్రిజెంట్ జుట్టుకు బాగా ఉపయోగపడుతాయి . దీన్ని తరచూ ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా మరియు స్ట్రాంగ్ గా పెరుగుతుంది.

7. బర్డక్:
బర్డక్ రూట్ ఆయిల్లో ఫైటో స్టెరాల్ అధికంగా ఉంటాయి మరియు ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికమే . ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ హెల్తీ స్కాల్ఫ్ మెయింటైన్ చేయడానికి నేచురల్ హెయిర్ గ్రోత్ కు సహాయపడుతాయి.

8. బ్రింగ్ రాజ్:
భ్రింగ్రాజ్ పొడి జుట్టు చికిత్స కొరకు ఒక ప్రసిద్ధ మరియు పురాతన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది మీ పొడి జుట్టును పోషించుటమే కాకుండా తలపై ఇతర చర్మ రోగాలను వదిలించుకోవటం కొరకు సహాయపడుతుంది. ఇది మీ తలపై చర్మంనకు బలాన్ని మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.



Click it and Unblock the Notifications











