Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
ఉసిరితో జుట్టుని 2రెట్లు ఒత్తుగా మార్చుకునే అమేజింగ్ సొల్యూషన్స్..!!
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. స్కాల్ప్ లో ఏర్పడిన చుండ్రుని నివారించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే కొత్త హెయిర్ ఫోలిసిల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఉసిరికాయ కేవలం జుట్టు రాలడాన్ని మాత్రమే కాదు.. మీ జుట్టుకి మంచి షైనింగ్ ని, స్మూత్ నెస్ ని, ఒత్తైన జుట్టుని అందిస్తాయి. ఉసిరిలో ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఉసిరిలో లభించినంత విటమిన్ సి ఏ ఫ్రూట్ లేదా వెజిటబుల్ లో పొందలేరు.

విటమిన్ సి.. జుట్టులోని కొల్లాజెన్ లెవెల్, ఎలాస్టిసిటీ పెంచుతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడాన్ని అడ్డుకుంటాయి. అంతేకాదు.. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. స్కాల్ప్ లో ఏర్పడిన చుండ్రుని నివారించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే కొత్త హెయిర్ ఫోలిసిల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే.. జుట్టు పెరుగుదలను కూడా.. గమనించవచ్చని, ఉసిరిని కాస్త ఉడికించి డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ స్ట్రీమ్ ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరి జుట్టు రాలడాన్ని అరికట్టి.. జుట్టు పెరుగుదలను మెరుగుపరిచి.. 2రెట్లు ఒత్తుగా కనిపించేలా మార్చే.. ఉసిరి హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

హెయిర్ ఆయిల్
ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 మందారం ఆకులను కట్ చేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరినూనె తీసుకుని సన్నని మంటపై వేడి చేయాలి. అందులో ఉసిరి, మందారం ఆకులు కలపాలి. మరో 20 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు.. ఒక టైట్ కంటెయినర్ లో వడకట్టుకుని.. రెగ్యులర్ హెయిర్ ఆయిల్ లా ఉపయోగించాలి.

జుట్టుని బలంగా మార్చే ప్యాక్
1 టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పౌడర్, పెరుగు మిక్స్ చేసి.. మెత్తటి పేస్ట్ చేసుకుని జుట్టు అప్లై చేయాలి. ఇది జుట్టుని పొడవుగా, బలంగా మారుస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేశాక.. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

చుండ్రు నివారణకు
ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, 1టీస్పూన్ ఉసిరిపొడి, 1 టీస్పూన్ బ్రాహ్మి పౌడర్, 10 చుక్కల రోజ్ మేరీ ఆయిల్ తీసుకోవాలి. అన్నింటినీ.. నీళ్లు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. జుట్టుని తడిచేసుకుని.. ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

షైనీ హెయిర్
1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, 10 చుక్కల ఉసిరి ఆయిల్, ఒక టీస్పూన్ తేనె, ఒక కప్పు నీళ్లు తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. షాంపూ చేసుకున్న తర్వాత.. ఈ మిశ్రమంతో.. 5నిమిషాలు మసాజ్ చేసుకుని.. తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.

తెల్ల జుట్టు
ఒక కప్పు ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, గుప్పెడు కరివేపాకు తీసుకుని అన్నింటిని కలిపి.. వేడి చేయాలి. సన్నని మంటపై 15 నిమిషాలు వేడి చేసిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. కాసేపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు.. ఆయిల్ ని స్కాల్ప్ కి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయం షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు తెల్లబడటాన్ని నివారించవచ్చు.

కండిషనర్
ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, ఒక టీస్పూన్ తేనె కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత.. జుట్టుకి పట్టిస్తే.. జుట్టు వేగంగా పెరుగుతుంది. బాగా ఆరిన తర్వాత.. మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

జుట్టు చిట్లిపోవడాన్ని అరికట్టడానికి
ఒక టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి కలపాలి. పెరుగు ఉపయోగించి.. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ మాస్క్ ని అప్లై చేశాక షవర్ క్యాప్ వేసుకోవాలి. గంట తర్వాత.. షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











