Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
డ్రై అండ్ రఫ్ హెయిర్ నివారణకు ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
మీ అందమైన లుక్ కొరకు ప్రకాశించే చర్మం,సుందరమైన కళ్ళు మరియు పెదవులు ఉన్నాయి. కానీ జుట్టు విషయానికి వస్తే మీ జుట్టు పొడిగా మరియు నిస్తేజంగా ఉందని భావిస్తుంటారు. నిజంగానే మీ జుట్టు చెడుగా ఉందని భావిస్తున్నారా? మీ అబిప్రాయం పూర్తిగా తప్పు. కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించి నిజంగా మీ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. మీ పొడి జుట్టు, నిర్జీవమైన జుట్టు మరియు పెళుసు జుట్టు చికిత్సకు ఉపయోగించటానికి అనేక హోం రెమెడీస్ ఉన్నాయి.
మనకుపొడి,నిస్తేజం మరియు పెళుసైన జుట్టు నుంచి బయటపడటానికి ప్రకృతి అనేక మూలికలను ఇచ్చింది. ఈ సహజ ఉత్పత్తలు వల్ల జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టును ప్రకాశవంతం మరియు మృదువుగా తయారుచేస్తుంది. మీలో ఉండే జుట్టు సమస్యల ఆందోళన తగ్గిస్తుంది. మీ జుట్టు కొరకు మీకు క్రమశిక్షణ అవసరం. మీరు ఒక క్రమ పద్ధతిలో ఈ సహజ మూలికలను రాస్తే ఖచ్చితంగా కొద్దికాలంలోనే తేడాను చూడగలరు. వీటిలో భ్రింగ్రాజ్,హెన్నా,ఉసిరికాయ,బ్లాక్ టీ, శీకాయి,కలబంద మరియు కుంకుడు వంటి అనేక సహజ మూలికలు ఉన్నాయి.
ఈ మూలికలను ఉపయోగించినప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఉత్తమ ఫలితాలను పొందడానికి (కనీసం వారానికి ఒకసారి) క్రమం తప్పకుండా ఉపయోగించాలి. అన్ని మూలికల ఔషధములను ఉపయోగించడంతో పాటు మీరు ఆమ్ల,కలబంద రసము,అక్రోట్లు,బాదం, గుడ్లు,కాయధాన్యాలు మరియు పెరుగులను కూడా చేర్చాలి. మీరు ఒక సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా కింది మూలికలను ఉపయోగిస్తే ఖచ్చితంగా పొడి మరియు నిస్తేజంగా ఉండే జుట్టు నుంచి బయటపడవచ్చు.
మీరు పొడి మరియు నిస్తేజమైన జుట్టు సమస్యను అనుభవిస్తుంటే మరియు వదిలించుకోవటం కొరకు బ్రాహ్మి బాగా ఉపయోగపడుతుంది. ఇది పొడి,నిస్తేజంగా మరియు పెళుసైన జుట్టు కొరకు ఒక గొప్ప నివారణ మార్గంగా చెప్పవచ్చు.ఇది మీ జుట్టులో రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాక మీ జుట్టు నల్లగా మరియు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.

హెన్నా
జుట్టుకు హెన్నా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పొడి జుట్టు చికిత్సకు సహాయపడుతుంది. జుట్టు పోగులు బలంగా మరియు మృదువుగా ఉండటానికి మరియు చుండ్రు తగ్గటానికి సహాయపడుతుంది. హెన్నాలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మీ జుట్టుకు పోషణ మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆలివ్ ఆయిల్ తేనె ప్యాక్:
4 చెంచాల తేనె, 6 చెంచాల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

ఎగ్ హెయిర్ ప్యాక్:
ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్ .ఒక గుడ్డు పచ్చసొన,ఒక టేబుల్ స్పూన్ ఆముదము,ఒక టేబుల్ స్పూన్ తేనే మూడింటిని కలపాలి. దీనిని జుట్టు మూలాల నుండి బాగా పట్టించాలి. ఒక ప్లాస్టిక్ షవర్ టోపీ లేదా ఒక టవల్ తో మీ తలను కప్పి ఉంచాలి. అరగంట తర్వాత శుభ్రం చేయాలి. చివరిగా ఆపిల్ పళ్లరసం వెనీగర్ తో శుభ్రం చేయాలి. ఒక వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ ను ఉపయోగించాలి.

తేనె పాలు:
తేనెలో నేచురల్ పదర్థాలుంటాయి, ఇది జుట్టుకు కావల్సిన తేమను అందిస్తుంది. మీ పొడిబారిన మరియు చిట్లిన జుట్టుకు అద్బుతమైన మాయిశ్చరైజ్ ను అంధిస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని పాలలోలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి, తలారా పోసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

బనానా మాస్క్
రెండు పండిన అరటి పండ్లను మాష్ చేసి దానిలో రెండు స్పూన్ల మయొనైజ్ మరియు ఒక స్పూన్ ఆలివ్ నూనె కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టు వాష్ చేయాలి. అరటి పండ్లు మృదువైన జుట్టుకు ప్రసిద్ది చెందింది. ఈ మాస్క్ నిస్తేజంగా మరియు కఠినమైన జుట్టు కలిగిన మహిళలకు అద్భుతంగా ఉంటుంది.

అవోకాడో మాస్క్
అవెకాడో పండు గుజ్జు మరియు మయొనైజ్ లను 1:2 నిష్పత్తిలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది మందపాటి మరియు భారీ నిర్మాణంతో ఉంటుంది. అవెకాడో పండు అనేది పొడి మరియు నిస్తేజంగా ఉన్న జుట్టుకు ఉత్తమ చల్లని సహజ నివారణలలో ఒకటిగా ఉన్నది. మీ జుట్టుకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి అరగంట తర్వాత కొళాయి నీటితో శుభ్రం చేయాలి.

పొటాటో హెయిర్ మాస్క్
ఒక పెద్ద బంగాళాదుంప తీసుకోని పై తొక్క తీసి మిక్సి చేసి దాని నుండి రసం తీయాలి. ఈ రసంలో ఒక స్పూన్ కలబంద జెల్ కలపాలి. ఈ మిశ్రమం బాగా మృదువుగా అయ్యేవరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పదిహేను నిమిషాల పాటు జుట్టు మీద బాగా రుద్ది రెండు గంటల తర్వాత వాష్ చేయాలి. ఈ మాస్క్ జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. అంతేకాక హెయిర్ ఫాల్ మీద పోరాటం చేస్తుంది.

మందార హెయిర్ ప్యాక్
ఒక కప్పు ఎరుపు మందార రేకులను తీసుకోని రాత్రంతా నానబెట్టాలి. దానిని పేస్ట్ చేసి ఆలివ్ నూనెను జోడించండి. మీ జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే నునుపైన జుట్టు మీకు సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications