Latest Updates
-
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?.
ఒత్తైన కురులను సొంతం చేసుకోవడానికి కొబ్బరి నూనె హెయిర్ మాస్క్...!
చాలా వరకూ కేశ సంరక్షణలో కొబ్బరి నూనె(కోకోనట్ ఆయిల్) గురించి అందరికీ తెలిసిందే.. కొబ్బరి నూనెలో యాబై శాతం లారిక్ ఆసిడ్ ఉంటుంది ...దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమముగా జరుగుతుంది. కొవ్వు శాతము పెరగదు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనే లో విటమిన్ 'ఇ ' అధికము... ఇది చర్మాన్ని కొమలముగా తాయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్తకు మంచిది. థైరాయిడ్ సమస్యలూ ఉండవు.
అందానికి: పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది, కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకనాలు, మురికి తొలగిపోతాయి. మేని ప్రకాశవంతముగా మెరుస్తుంది... ఇది జుట్టుకు మేలు చేస్తుంది ... కొబ్బరి పాలు తలకు పట్టిస్తే ... కేశాలు కాంతి వంతముగా తాయారు చేస్తుంది. అంతే కాదు కొబ్బరి నూనె కేశాలకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చాలా మంది కొబ్బరినూనెతో హెయిర్ మసాజ్ చేసిన తర్వాతే మంచి షాంపూతో తలస్నానం చేస్తుంటారు.
కొబ్బరి నూనెను వేడి చేసి తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిన్నింటితో పాటు కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల కేశాలు ఆరోగ్యంగా సిల్కీగా మెరుస్తుంటాయి. అందుకు కొబ్బరి నూనెతో కొన్ని రకాల కాంబినేషన్లతో హెయిర్ మాస్క్ లు మీ కోసం..

కొబ్బరి నూనె మరియు తేనె హెయిర్ మాస్క్:
కొబ్బరి నూనె మరియు తేనె కురుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండూ కూడా కేశాలకు మంచి మాయిశ్చరైజర్స్, వీటితో కేశాలు మంచి మెరుపును అందిస్తుంది. రెండు చెంచాల కొబ్బరినూనెలో ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. ఇరవై నిముషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.

కొబ్బరి నూనె - హెన్నా:
హెన్నా తలకు పట్టించడం వల్ల హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. అయితే అదే సమయంలో కురులను పొడిబారేలా చేస్తుంది. కాబట్టి కేశాల పొడిబారకుండా ఉండాలంటే ఒక చెంచా కొబ్బరి నూనెలో హెన్నామిక్స్ చేసి కొద్దిగా కొబ్బరి నీళ్ళు కూడా మిక్స్ చేసి తలకు మాస్క్ లా వేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె, పెరుగు మరియు నిమ్మరసం:
ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక గుడ్డును పగలగొట్టి తెల్ల సొన తీసుకొని, అందులో రెండు చెంచాలా పెరుగు, ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మరింత షైనింగ్ తో నునుపుగా మారుతాయి. ఇది ఒక నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె మరియు రీతా:
ఇది ఒక అద్భుతమైన నేచురల్ హెయిర్ మాస్క్. రెండు చెంచాల కొబ్బరి నూనె మరియు మూడు లేదా నాలుగు చెంచాల రీతా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అంతే కాదు కురుల చివర్లు చిట్లకుండా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:
కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని అందులో అర చెంచా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. ఇరవై నిముషాల తర్వాత తల శుభ్రం చేసుకోవడంతో కురులకు తగినంత తేమను అందించి, చుండ్రు రాకుండా, లేకుండా చేస్తుంది.

కొబ్బరినూనె నూనె -గుడ్డు:
రెండు చెంచాల కొబ్బరి నూనెలో, గుడ్డు సొన మిక్స్ చేసి తలకు మాస్క్ వేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల గుడ్డు వాసన లేకుండా ఉంటుంది. ఇది ఇక నేచురల్ హెయిర్ మాస్క్. దీన్ని వేసుకోవడం వల్ల కేశాలు సున్నితంగా.. నునుపు, షైనింగ్ తో మెరుస్తుంటాయి.



Click it and Unblock the Notifications