Latest Updates
-
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.!
జుట్టు ఆరోగ్యానికి కొబ్బరినూనె ? ఆల్మండ్ ఆయిల్ ? ఏది మంచిది ?
జుట్టు సంరక్షణ విషయంలో అందరికీ రకరకాల డౌట్స్ ఉంటాయి. మార్కెట్ లో రకరకాల బ్రాండ్స్, ఫ్లేవర్స్, ఫీచర్స్ ఉండటం వల్ల ఏది జుట్టు ఆరోగ్యానికి పర్ఫెక్ట్ గా పనిచేస్తాయో అర్థం కాని పరిస్థితి. ఏది ఉపయోగిస్తే.. జుట్టు రంగు మారకుండా, న్యాచురల్ షైనింగ్ కలిగి ఉంటుంది అనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. అయితే ఆయిల్ విషయంలో ప్రతి ఒక్కరికీ అనుమానమే.. !
జుట్టు హెల్తీగా, షైనీగా ఉండటానికి ఏ ఆయిల్ సరైనది, ఎలా ఎంచుకోవాలి అనే దానిపై క్లారిటీ ఉండదు. దీంతో కొన్ని రోజులు ఒక ఆయిల్ ఉపయోగించి.. వెంటనే ఆయిల్ మార్చేస్తారు. ఇలా రకరకాల బ్రాండ్స్, ఫ్లేవర్స్ వాడి విసిగిపోతారు. అయితే జుట్టు సంరక్షణకు కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్ కి చాలామంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
అయితే ఈ రెండింటిలో ఏది మెరుగైన ఫలితాలు ఇస్తుంది అనేదానిపై చాలామందికి అవగాహన ఉండదు. వాస్తవానికి ఈ రెండు ఆయిల్స్ హెయిర్ కేర్ లో అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఈ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల జుట్టు స్మూత్ గా, సిల్కీగా మారుతుంది. ఇవి చాలా పలుచగా ఉండటం, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం, అందుబాటులో ఉంటాయి. అయితే మీ జుట్టుని బట్టి ఏ ఆయిల్ అయితే.. మెరుగైన ఫలితాలు ఇస్తుందనేది గుర్తించడం చాలా అవసరం. కాబట్టి.. ఇక్కడ ఇచ్చిన విషయాలు చదివి.. సరైన ఆయిల్ ని ఎంచుకోండి..

పొడిజుట్టుకి
పొడిబారిన జుట్టుకి కొబ్బరినూనె చక్కటి పరిష్కారం. ఇందులో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల.. ఇవి జుట్టుకి పోషణను అందిస్తాయి. గోరువెచ్చటి కొబ్బరినూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టుకి షైనింగ్, సాఫ్ట్ నెస్ అందుతుంది. డ్యామేజ్, డ్రై అయిన జుట్టుకి చక్కటి పరిష్కారం.

జుట్టు రాలడాన్ని నివారించడానికి
జుట్టు ఎక్కువగా రాలడాన్ని గమనించినట్లైతే.. రెగ్యులర్ గా కొబ్బరినూనె ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల అది స్కాల్ప్ కి మాయిశ్చరైజ్ చేస్తుంది. జుట్టు రీగ్రోత్ అవడానికి ఇది సహాయపడుతుంది. పలుచటి జుట్టు కలిగిన వాళ్లు కొబ్బరినూనె ఎంచుకోవడం మంచిది.

ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్
కొబ్బరినూనె కేవలం జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ గా మార్చడానికే కాదు.. ఇది యుక్తవయసులోని జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. కాబట్టి.. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే.. ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. 100ఎమ్ఎల్ కొబ్బరినూనెకి, ఉసిరికాయపొడి పేస్ట్, మెంతులు, కరివేపాకు మిక్స్ చేయాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మసాజ్ కి
మీ జుట్టుకి కావాల్సినంత ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా చేసుకోవాలి. ఈ ఆయిల్ ని హెయిర్ కి కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. షవర్ క్యాప్ తో జుట్టుని కవర్ చేసుకోవాలి. గంట తర్వాత హెర్బల్ షాంపూతో స్నానం చేసి.. కండిషనర్ అప్లై చేయాలి.

జుట్టు రాలడం
ఆల్మండ్ ఆయిల్ యే బాదాం నూనె. జుట్టు పెరుగుదలకు ఆల్మండ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ డి, ఈ, ఇతర మినరల్స్, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకి మాయిశ్చరైజ్ చేసి.. హెయిర్ ఫాల్ ని అరికడతాయి.

పొడవాటి, షైనీ హెయిర్
మీ జుట్టు పెరుగుదల కోసం ట్రై చేస్తుంది. రెగ్యులర్ గా ఆల్మండ్ ఆయిల్ ఉపయోగించండి. ఇందులో ఉన్న పోషకాలు జుట్టుకి అంది.. మీ జుట్టు హెల్తీగా, స్ట్రాంగ్ గా, వేగంగా పెరగడానికి సహాయపడతాయి. ఆల్మండ్ ఆయిల్ ద్వారా అందే మెగ్నీషియం జుట్టు చిట్లకుండా అరికట్టి.. హెయిర్ గ్రోత్ కి సహాయపడుతుంది.

చుండ్రుకి
చుండ్రు నివారించడానికి ఆల్మండ్ ఆయిల్ చక్కటి పరిష్కారం. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గునాలు.. స్కాల్ప్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, బీ6, బీ12, విటమిన్ ఈ ఉండటం వల్ల.. డాండ్రఫ్ నివారిస్తుంది.

ఆల్మండ్ ఆయిల్ మసాజ్
కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ తీసుకుని నిమిషాలు వేడిచేయాలి. ఇప్పుడు ఆయిల్ తో జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచి.. ఉదయాన్నే మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications