Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
జుట్టు అందంగా..ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ జ్యూస్ హెయిర్ మాస్క్..
సహజంగా ఆరోగ్యానికి కానీ, అందానికీ కానీ హోం రెమెడీస్ అంటే మన వంటగదిలోనే పదార్థాలే.. చాలా సులభంగా మనకు అందుబాటులో ఉంటూ మన సమస్యలను తీర్చే ది బెస్ట్ హోం రెమెడీస్ ఇవి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు. అటువంటి హోం రెమెడీస్ లో ఉల్లిపాయ ఒకటి . ఉల్లిపాయలు వంటలకు మంచి రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి , అందానికి కూడా బహు విధాలుగా సహాయపడుతుంది.
ఉల్లిపాయలో అంతటి అద్భుత గుణాలేమున్నాయన్న ఆలోచన మీకు రావచ్చు? ఉల్లిపాయలలో యాంటీబయోటిక్స్, యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబయల్ మరియు కార్మినేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . జుట్టు సమస్యలను తీర్చడంలో ఉల్లిపాయ ఒక గ్రేట్ హోం రెమెడీ.
ఉల్లిపాయ రసం మరియు తేనె మిశ్రం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి వ్యాధులు నివారించబడుతాయన్న విషయం మీకు తెలుసు. అంతే కాదు, అందం విషయంలో చుండ్రును నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయలో సల్ఫర్ అత్యధికంగా ఉంది . ఉల్లిపాయ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయలో అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా జుట్టు సంరక్షణలో కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉల్లిపాయలలోని గుణాల వల్ల జుట్టు రాలడం వేగంగా అరికడుతుంది మరియు తెల్ల జుట్టును నివారిస్తుంది. కాబట్టి, ఉల్లిపాయను జుట్టుకు ఉపయోగించడంలో ఉత్తమ మార్గం ఏంటి?
నేరుగా ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం లేదా ఇతర పదార్థాలతో మిక్స్ చేసి అప్లై చేయడం? వేటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? వీటన్నింటి సమాధానం కావాలంటే ఈ క్రింది హెయిర్ మాస్క్ ను సింపుల్ గా ఫాలో అవ్వాల్సిందే...

ఉల్లిపాయ మరియు నిమ్మరసం పీల్ తో చుండ్రు మాయం:
ఈ హోంమేడ్ హెయిర్ మాస్క్ తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు.
కావల్సినవి:
నిమ్మతొక్క: 1(డ్రైగా ఉన్నది)
ఉల్లిపయా జ్యూస్: 1(రసం తీయ్యాలి)
పెరుగు: 1 టీస్పూన్:
తయారుచేయు విధానం:
1. ముందుగా నిమ్మతొక్క తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో నిమ్మరసం , పెరుగు మిక్స్ చేసి బాగా కలియబెట్టాలి.
2. ఈ మిశ్రమాన్ని తలకు , కేశాల పొడవునా పట్టించాలి. .
3. తర్వాత కాటన్ టవల్ ను వేడి నీటిలో డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ పిండేసి, టవల్ ను తలకు చుట్టాలి.
4. ఒకటి లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి. నార్మల్ షాంపు, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

డ్యామేజ్ హెయిర్ కు ఉల్లిపాయ మరియు అలమ్:
డ్యామేజ్ మరియు డల్ హెయిర్ ను నివారించడంలో ఈ కాంబినేషన్ చక్కగా పనిచేస్తుంది.
కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు : 3
అలమ్ : 1 టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం:
ఉల్లిపాయను ముక్కలు చేసి, జ్యూసర్ లో వేసి రసాన్నీ తీసుకోవాలి . ఈ రసానికి అలమ్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ లా తయారైన తర్వాత ఈ మాస్క్ ను తడిజుట్టుకు అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసుకోవాలి. రెగ్యులర్ షాంపు ఉపయోగించి స్నానం చేస్తే వాసన ఉండదు.

జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ జ్యూస్:
సడెన్ గా మీ జుట్టు రాలిపోతూ, పల్చగా మారుతుంటే ఆనియన్ జ్యూస్ ను నేరుగా అప్లై చేస్తే మంచిది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కావల్సినవి:
రెండు ఉల్లిపాయలు
తయారుచేయు విధానం: ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి, జార్ లో వేసి పేస్ట్ చేసి రసం తియ్యాలి . వడగట్టి, రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ుంటుంది. ఈ ట్రీట్మెంట్ ను వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల జుట్టు నివారణకు ఉల్లిపాయ మరియు మెంతి మాస్క్
:యాంటీఆక్సిడెంట్స్ లోపం మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ తెల్లజుట్టుకు కారణమవుతుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రంగును రీస్టోర్ చేస్తుంది. మెంతి, జుట్టును సాప్ట్ గా మిరయు షైనీగా మార్చుతుంది .
కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు : 2
మెంతులు: 1/2కప్పు (రాత్రిలో నానబెట్టుకోవాలి)
తయారుచేయు విధానం:
మరుసటి రోజు ఉదయం మెంతులను మెత్తగా గ్రైండ్ చేసి అందులోనే ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

ఉల్లిపాయ మరియు రమ్:
ఈ రెండింటి మిశ్రమం జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది . హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది,
కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు: 2
రమ్: 60 ఎమ్ ఎల్
తయారుచేయు విధానం:
ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రమ్ జార్ లో వేయాలి. రాత్రంతా అలాగే ుంచి తర్వాత వడగట్టి , కాటన్ బాల్ తో తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ను వారానికొకసారి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications