Latest Updates
-
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం!
జుట్టు వేగంగా,ఒత్తుగా పెరగాలంటే చాలా సింపుల్ బేసిక్ టిప్స్ ఫాలో అవ్వండి...
అందం విషయంలో మీరు కాంప్రమైజ్ కాలేకపోతున్నారా? అందమైన జుట్టును కోరుకుంటున్నారా . మరి అయితే మీ జుట్టు అందంగా పెంచుకోవడానికి మంచి కండీషనర్ ను తయారుచేసుకోవాలి . అప్పుడే జుట్టు ఫాస్ట్ గా ఒత్తుగా ..వేగంగా పెరుగుతుంది. ఆవరేజ్ హెయిర్ కూడా వేగంగా పెరుగుతుంది . రోజుకు 0.3 ఇంచ్ నుండి 0.5 ఇంచుల వరకూ 30 రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుంది. అంత కంటే మరింత వేగంగా పెరుగుతుంది.
మరి మీరు కూడా వేగంగా జుట్టు పెంచుకోవాలనుకుంటే, మీరు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించాలి . అందుకు మీరు ఏం చేయాలంటే ...
మొదట, అరటిపండును కొన్ని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ లా చేయాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, ఎగ్ యోక్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నింటిని మిక్స్ చేసిన తర్వాత జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని వారానికొకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం:
ఆముదం నూనెలో ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి . ఆముదం నూనెను రెగ్యులర్ గా జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

న్యూట్రీషియన్స్ :
జుట్టు పెరుగుదలకు ప్రోటీన్స్, మినిరల్స్ మరియు విటమిన్స్ చాలా అవసరం. గుడ్లు, పాలు, పెరుగు , చీజ్ , ఆకులకూరలు, సాల్మన్, క్యాబేజ్ ఓట్, అవొకాడో, బ్రౌన్ బ్రెడ్ వంటివి రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా చేర్చుకోవాలి.

స్ట్రెస్ తగ్గించుకోవాలి:
జుట్టు పెరుగుదలను అడ్డుకోవడంలో స్ట్రెస్ ప్రధానపాత్రపోషిస్తుంది. కాబట్టి, స్ట్రెస్ ను దూరం చేసుకొని , జుట్టును వేగంగా పెంచుకోండి.

చుండ్రు నివారించుకోవాలి:
చుండ్రు మరియు ఇతర స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవాలి. వీటి వల్ల జుట్టు పెరగదు మరియు ఉన్న జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి, చుండ్రు లేకుండా చేసుకోవాలి.

కండీషనర్:
రెగ్యులర్ గా కండీషనర్ ఉపయోగించడం మర్చిపోకూడదు. రెగ్యులర్ కండీషనర్ వల్ల జుట్టు స్మూత్ గా మరియు హెల్తీగా పెరుగుతుంది.

మసాజ్:
మీ హెయిర్ ఫాలీ సెల్స్ కు సరైన రక్తప్రసరణ చాలా అవసరం . అలాగే న్యూట్రీషియన్స్ కూడా హెయిర్ గ్రోత్ కు చాలా అవసరం. హెడ్ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది . అందువల్ల తలకు రెగ్యులర్ గా మసాజ్ చేయాలి.

చిట్లిన జుట్టును కట్ చేయాలి:
రెగ్యులర్ గా చిట్లిన జుట్టును కట్ చేస్తుండాలి . ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ మెరుగుపడుతుంది.



Click it and Unblock the Notifications
