Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందా ?
బైక్ రయ్ రయ్ మంటూ రోడ్డుపై షికారుకి వెళ్లాలంటే.. హెల్మెట్ కంపల్సరీ అని రూల్స్ చెబుతుంటే... హెల్మెట్ పెట్టుకుంటే.. జుట్టు రాలిపోయి బట్టతల వస్తుందని.. అబ్బాయిల హైరానా పడుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని ఈ రూల్ ని కాస్త స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. అయితే.. హెల్మెట్ పెట్టుకుంటుంటే.. తమ జుట్టు పూర్తీగా పోతోందని, బట్టతలకు హెల్మెటే ప్రధాన కారణమని.. యూత్ అంతా బాధపడుతోంది. మరి ఇది ఎంతవరకు నిజం ?
బట్టతల నివారించడానికి సింపుల్ సొల్యూషన్..! ఆముదం.. !!
హెల్మెట్ పెట్టుకుంటే.. బట్టతల వస్తుందా ? అనేది చాలా మందిని వేధించే ప్రశ్న. ట్రాఫిక్ సమస్య కారణంగా ఎక్కువ సమయం హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల తలకు గాలి సరిగా అందక.. జుట్టు నిర్జీవంగా మారి, జిడ్డుగా మారిపోయి.. జుట్టు రాలిపోవడానికి కారణమవుతుందని వాపోతుంటారు. కానీ బట్టతలకు, హెల్మెట్ పెట్టుకోవడానికి సంబంధం లేదని స్టడీస్ చెబుతున్నాయి. అదెలాగో మీరే తెలుసుకోండి....

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోయి.. క్రమక్రమంగా బట్టతలకు దారితీస్తోందని చాలా మంది అబ్బాయిల టెన్షన్. కానీ ఇది అపోహ మాత్రమే.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
హెల్మెట్స్, క్యాప్స్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలడం, బట్టతల రావడం వంటివి జరగవని.. స్టడీస్ క్లియర్ గా చెబుతున్నాయి.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టుకి ఆక్సిజన్ అందక.. జుట్టు రాలుతోందనే అపోహ ఉంది.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
అయితే హెయిర్.. గాలి ద్వారా వచ్చే ఆక్సిజన్ పై ఆధారపడదు. వాటికి కావాల్సిన ఆక్సిజన్ ను.. రక్త ప్రసరణ ద్వారా పొందుతాయి.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
గట్టిగా జుట్టుని బిగదీసినట్టు ఉండే హెయిర్ స్టైల్స్, కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ వల్ల మహిళల్లో రక్త ప్రసరణ సరిగా అందక జుట్టు రాలిపోతుంది.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
మగవాళ్లు టైట్ గా ఉండే హెల్మెట్స్ ధరించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక, జుట్టుకి ఆక్సిజన్ సరిగా సరఫరా అవకపోవడం వల్ల.. జుట్టు రాలుతుంది.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
అలాగే దుమ్ముతో, చెమటతో నిండిన హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల కూడా.. స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ కి లోనవుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
కాబట్టి శుభ్రంగా ఉన్న హెల్మెట్స్, టోపీలు పెట్టుకోవడం వల్ల మగవాళ్లలో.. బట్టతలను నివారించవచ్చు.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
అలాగే హెల్మెట్ ను గంటల తరబడి పెట్టుకోకుండా.. ఎక్కువ సమయం పెట్టుకోవాల్సి వస్తే..తరచుగా తీసేసి.. మళ్లీ పెట్టుకుంటూ ఉండాలి. అలాగే హెల్మెట్ తీసేసేటప్పుడు నెమ్మదిగా తీయాలి. మీ జుట్టు పలుచగా ఉంటే.. హెల్మెట్ ను గట్టిగా తలపై నుంచి లాగడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.

హెల్మెట్ బట్టతలకు కారణమా ?
హెల్మెట్ పెట్టుకునే ముందు క్లీన్ గా ఉండే హ్యాండ్ కర్చీఫ్ లేదా క్లాత్ ని కట్టుకుని ఆ తర్వాత పెట్టుకుంటే.. హెల్మెట్ లో ఉండే దుమ్ము, ధూళి మీ జుట్టుకి తాకకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications