Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
చుండ్రుకి కారణమయ్యే మొటిమలు నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్
తల మీద చర్మం మీద వచ్చే మొటిమలు ఎర్రటి బొడిపెలతో ఉంటాయి. ఈ రకమైన ఎర్రటి చిన్న గడ్డలు చాలా బాధాకరంగా, దురదతో ఉండి చుండ్రుకు కారణం అవుతాయి. చర్మ రంద్రాలకు అడ్డంకులు ఏర్పడటం వలన ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యకు హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, ఆర్ద్ర పరిస్థితులు, కాలుష్యం, కొన్ని రసాయనాలు, నూనెలు షాంపూలు కారణమవుతాయి.
జుట్టును శుభ్రం చేయకపోవటం లేదా ఎక్కువ వేడి నీటిని ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకున్నప్పుడు కూడా సమస్య రావచ్చు. కాబట్టి వారానికి రెండు సార్లు గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ మొటిమలు చాలా సమస్యాత్మకంగాను, అసౌకర్యంగా ఉండి దురదకు కారణం అవుతాయి. కొన్ని న్యాచురల్ టిప్స్ ఉపయోగించి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ చిన్న మొటిమలు, పొక్కులు నివారించడంలో హోం రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి అమేజింగ్ టిప్స్ ఇప్పుడు చూద్దాం..

మెంతులు
మెంతులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన మొటిమలు రాకుండా, తలలోని చర్మం పొడిబారకుండా చేయటానికి సహాయపడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ని తగ్గించటంలో కూడా గొప్పగా పనిచేస్తుంది. దీనిలో ఉండే సహజ ప్రోటీన్, అమైనో ఆమ్లాలు జుట్టు బలంగా ఉండటానికి, సిల్కీ గా ఉంచటానికి సహాయపడుతుంది.

వెనిగర్
వెనిగర్ మొటిమల చికిత్సకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే మాలిక్ ఆమ్లం అనవసర ఆయిల్ ని, మలినాలను తొలగించటానికి సహాయపడుతుంది.

కలబంద
కలబందలో ఉండే ఉపశమన లక్షణాలు జుట్టు మీద అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాక మొటిమల చికిత్సలో చాలా పవర్ ఫుల్. దీనిలో ఉండే శీతలీకరణ లక్షణాలు బొబ్బల వంటి మొటిమలు, దురద తగ్గించడానికి సహాయపడి మొటిమలు నయం చేస్తాయి.

పుదీనా ఆకులు
పుదీనా ఆకులలో శోథ నిరోధక, క్రిమినాశక, ఆస్ట్రిజెంట్ గుణాలు ఉండుట వల్ల తల మీద చర్మం, జుట్టుకు తాజా ఫీలింగ్ కలుగుతుంది.

నిమ్మకాయ
నిమ్మ లో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ లు తల చర్మం మీద మొటిమల చికిత్సకు ఉత్తమమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది ఒక ఎక్స్ ఫ్లోట్ గా పనిచేసి చర్మ రంద్రాలు తెరుచుకొని ఉండేలా చేస్తుంది. అంతేకాక pH సంతులనానికి సహాయపడుతుంది.

బొప్పాయి
బొప్పాయి కూడా తల మీద మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే ఆమ్లాలు తలలో జిడ్డు పదార్దాలను విచ్చిన్నం చేయటం, డెడ్ స్కిన్ సెల్స్ ని నివారిస్తుంది.

టమోటో జ్యూస్
టమోటా రసం కూడా తల మీద మొటిమలను వదిలించుకోవటానికి సహాయపడుతుంది. తల మీద చర్మం మీద టమోటా గుజ్జుని రాసి కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications
