Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
హెయిర్ డ్యామేజ్ మరియు బ్రేకేజ్ అవ్వకుండా వింటర్ హెయిర్ కేర్ టిప్స్
వాతావరణంలో సెడెన్ గా మార్పులు వస్తే ఆటోమాటిక్ గా మన శరీరంలో కూడా మార్పులు వస్తాయి. అందుకే సీజన్ బట్టి, కొన్ని జబ్బులు మనల్ని వేధిస్తుంటాకి. వేసవిలో వడదెబ్బ, డయోరియా, చర్మ సమస్యలు వంటివి వ్యాధులను బారినపడుతుంటారు. అదే వింటర్ సీజన్ లో వైరల్ ఫీవర్, డ్రైస్కిన్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు . ఆరోగ్య పరంగానే కాదు, అందం మీద కూడా ప్రభావం చూపుతాయి. వింటర్ లో ఎక్కువ స్కిన్ అండ్ హెయిర్ సమస్యల కూడా ఎక్కువగా ఉంటాయి.
చర్మం మీద, హెయిర్ మాయిశ్చరైజర్ కోల్పోతుంది. జుట్టు బలహీనంగా మారుతుంది , దాంతో జుట్టు డ్రైగా మరియు చిట్లడం జరుగుతుంది. హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. దాంతో జుట్టు చూడటానికి నిర్జీవంగా మరియు డల్ గా కనబడుతుంది. ఈ వింటర్ సీజన్ లో తరచూ తలస్నానం చేస్తున్నా, జుట్టు జిడ్డుగా మరియు చిక్కుగా మారుతుంది. దాంతో జుట్టు చూడటానికి చిందరవందరగా ఉంటుంది. మ్యానేజ్ చేయడానికి డిఫికల్ట్ గా ఉంటుంది.
అందువల్ల , వింటర్ సీజన్ లో కొన్ని హెయిర్ కేర్ టిప్స్ ను అనుసరించడం చాలా అవసరం. ఈ హెయిర్ కేర్ టిప్స్ ను రెగ్యులర్ గా పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల , వివిధ రకాలా జుట్టు సమస్యలను నివారిస్తుంది . చల్లని వాతావరణంలో ఈ చిట్కాలు గ్రేట్ గా సహాయపడుతాయి. . అటువంటి హెయిర్ కేర్ టిప్స్ , వింటర్లో మీజుట్టు రక్షించడానికి కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా..

హాట్ షవర్ ను స్కిప్ చేయాలి:
వింటర్లో హాట్ షవర్ చేయడం వల్ల జుట్టు మరింత బలహీనంగా మారుతుంది. హాట్ వాటర్ వల్ల హెయిర్ డ్యామేజ్అవుతుంది, కాబట్టి, హాట్ షవర్ కంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

హెయిర్ ఫాల్ జరగకుండా కండీషనర్ అప్లై చేయాలి:
వింటర్ సీజన్ లో , జుట్టుకు తప్పనిసరిగా హెయిర్ కండీషనర్ అప్లై చేయాలి. కండీషనర్ అప్లై చేయడం వల్ల జుట్టును మ్యానేజ్ చేయడానికి వీలవుతుంది.

హీటింగ్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి:
జుట్టు స్టైలింగ్ కోసం ఉపయోగించే హీటింగ్ ప్రొడక్ట్స్ బ్రొ డ్రయ్యర్స్, స్ట్రెయిటనర్స్, కర్లింగ్ ఐరన్ మొదలగు వాటిని ఉపయోగించకూడదు. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు మరింత డ్రై గా , చిట్లిపోయినట్లు కనిపిస్తాయి. హీటింగ్ వస్తువులు జుట్టును మరింత డ్యామేజ్ చేస్తుంది.

బ్రష్ చేయడం నివారించాలి:
వింటర్ సీజన్లో ఎక్కువగా హెయిర్ బ్రెష్ చేయడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది మరియు డ్యామేజ్ అవుతుంది. హెయిర్ దువ్వే బ్రష్ పళ్లు దూరంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల ముడులు పడకుండా బ్రేక్ అవ్వకుండా నివారిస్తుంది.

వింటర్లో తలను పూర్తిగా కవర్ చేసి ఉంచాలి:
చల్లని వాతావరణంలో జుట్టు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. చల్లని గాలుల, హుముడిటి వల్ల జుట్టుకు మరింత హానికలిగిస్తుంది, అందువల్ల చల్లని వాతావరణంలో బయటకు వెళ్ళే అన్ని సమయంలో జుట్టును కవర్ చేసి ఉంచాలి.

డ్రై షాంపును ఉపయోగించాలి:
కోల్డ్ వెదర్ లో , కెమికల్స్ ఉండే షాంపును ఉపయోగించడం కంటే డ్రై నేచురల్ షాంపును ఉపయోగించడం వల్ల హెయిర్ క్లీన్ అవుతుంది. జుట్టు అందంగా పెరుగుతుంది.

జుట్టుకు రెగ్యులర్ గా ఆయిల్ అప్లై చేయాలి:
వింటర్ సీజన్ లో గోరువెచ్చని నూనెతో తలకు మర్ధన చేయాలి. రెగ్యులర్ గా ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టుకు నేచురల్ మాయిశ్చరైజర్ అప్లై అవుతుంది.



Click it and Unblock the Notifications