Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
ఈ వేసవి సీజన్ లో హెయిర్ డ్యామేజ్ కాకుండా 7 ట్రిక్స్ అండ్ టిప్స్
వేసవి సీజన్ లో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో..అందానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది,. వేసవి సీజన్ లో యూవీ రేస్ వల్ల జుట్టు యొక్క సహజ మెరుపును మరియు అందాన్ని కోల్పోయేలా చేస్తుంది. అదే సమయంలో ఆరోగ్యం కూడా క్రమంగా తగ్గుముకం పడుతుంది . కాబట్టి, సమ్మర్ సీజన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలను మరియు ఫ్లూయిడ్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు, అందమైన చర్మం సౌందర్యాన్ని సొంతం చేసుకుంటారు.
వేడి వాతావరణంలో ఆరోగ్యాన్ని కానీ, అందాన్ని కానీ కాపాడుకోవడానికి కాస్త ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం . ఎండ వేడి వల్ల మీ జుట్టు డ్రైగా మారుతుంటే హోం మేడ్ హెయిర్ మాస్క్ మరియు కండీషన్ ను అప్లై చేయాలి. అదే మీ జుట్టు జిడ్డుగా ఉన్నట్లైతే మరియు చెమట వల్ల జుట్టు జిడ్డుగా మారుతున్నట్లైతే వెంటనే తలకు తగిన జాగ్రత్తలు తీసుకొని వారంలో రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి . అంతే కాదు వేసవి సీజన్ లో తలకు కనీసం వారానికొక సారి నూనె రాయడం చాలా అవసరం . ఇలా చేయడం వల్ల సమ్మర్లో హీట్ స్టోక్ నుండి రక్షించుకోవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం ...ఈ సమ్మర్ సీజన్లో మీరు పాటించాల్సిన 7హెయిర్ కేర్ ట్రిక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి ఫాలో అవ్వండి,...జుట్టును కాపాడుకోండి...

ఆయిల్ అప్లై చేయాలి:
ఆలివ్ ఆయిల్, కోకనట్ ఆయిల్ మరియు బాదం ఆియల్ ఈ మూడు ఆయిల్స్ ను తలకు పట్టించి మసాజ్ చేయాలి . ఈ మూడు ఆయిల్స్ సమ్మర్లో జుట్టు డ్యామేజ్ అవ్వకుండా , షైనింగ్ తగ్గిపోకుండా మరియు డ్రై అవ్వకుండా రక్షణ కల్పిస్తాయి.

జుట్టు రక్షణకు వెనిగర్:
జుట్టుకు వెనిగర్ అప్లై చేయడం వల్ల మొత్తం శరీరం కూల్ గా ఉంటుంది. అదే విధంగా వెనిగర్ ను జుట్టుకు అప్లై చేయడం వల్లజుట్టు డ్రైగా మారకుండా మరియు దురద లేకుండా ఉంటుంది.

కండీషనర్ ను అప్లై చేయాలి:
మీ జుట్టు చూడటానికి మరీ డ్రై గా మరియు రఫ్ గా మారినట్లైతే హోం మేడ్ కండీషనర్ ను అప్లై చేయడం చాలా మేలు చేస్తుంది. కండీషనర్ అప్లై చేయడానికి ముందు హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది.

జుట్టును, తలను చల్లగా ఉంచుకోవాలి:
వేసవి సీజన్ లో ఎక్కువ సమయం జుట్టును ముడి వేసి ఉంచకుండా లూజ్ గా ఫ్రీగా వదిలేసుకోవాలి. జుట్టు టైట్ గా బిగించడం వల్ల తలలో చెమట పెరుగుతుంది మరియు దాంతో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది . కాబట్టి, ఎప్పుడూ మీ జుట్టును లూజ్ గా ఫ్రీగా వదులుకోవాలి.

హ్యాట్ పెట్టుకోవాలి:
వేసవిలో సూర్యుని నుండి వెలువడే యూవీ రేస్ జుట్టును త్వరగా డ్యామేజ్ చేస్తాయి . కాబట్టి, వేసవి సీజన్ లో బయట అడుగు పెట్టాలంటే జుట్టుకు తగినంత రక్షణ అందివ్వాలి.

కీరదోస:
కీరదోసకాయ చర్మనాకి మరియు ఆరోగ్యానికి మాత్రమే కాదు...జుట్టుకు కూడా మేలు చేస్తుంది. మీ జుట్టును, తలను కూల్ గా ఉంచుకోవాలంటే, కుకుంబర్ జ్యూస్ ను వారంలో ఒక సారి తలకు అప్లై చేయాలి. కీరదోసకాయ హెయిర్ ప్యాక్ ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు డ్రైగా లేకుండా మరియు చిక్కుబడకుండా ఉంటుంది.

తలస్నానం:
వారంలో రెండు సార్లు తలస్నానం చేయడం వల్ల మీ జుట్టు తల శుభ్రపడుతుంది దాంతో తలలో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇతర జుట్టు సమస్యలు తలలెత్తకుండా జుట్టును కాపాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications