Latest Updates
-
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే..
జుట్టుని సిల్కీగా, షైనీగా మార్చే అమేజింగ్ హనీ మాస్క్స్..!
తేనె జుట్టుకి సహజ మాయిశ్చరైజర్ ని అందించి.. జుట్టు మెరుస్తూ, స్మూత్ గా ఉండటానికి సహాయపడుతుంది. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉండటం వల్ల ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. దీనివల్ల జుట్టు బ్రేక్ అవకు
మీ జుట్టు నిర్జీవంగా, డ్రైగా కనిపిస్తోందా ? ముట్టుకుంటే చాలా రఫ్ గా అనిపిస్తోందా ? మీ జుట్టు చాలా తేలికగా బ్రేక్ అవుతోందా ? ఒకవేళ ఈ సమస్యలన్నింటినీ మీరు ఫేస్ చేస్తుంటే.. మీ జుట్టు చాలా పొడిబారిపోయిందని గ్రహించాలి. డ్రై హెయిర్ ని ట్రీట్ చేయాలంటే.. హోం రెమిడీస్ ప్రయత్నించడం మంచిది.

తేనె జుట్టుకి సహజ మాయిశ్చరైజర్ ని అందించి.. జుట్టు మెరుస్తూ, స్మూత్ గా ఉండటానికి సహాయపడుతుంది. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉండటం వల్ల ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. దీనివల్ల జుట్టు బ్రేక్ అవకుండా అడ్డుకోవచ్చు.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. స్కాల్ప్ లో పేరుకున్న మురికిని, చుండ్రుని తొలగించి.. పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. అయితే తేనెను డైరెక్ట్ గా స్కాల్ప్ కి పట్టించరాదు. అలాగే తేనెను అప్లై చేసి.. ఎక్కువగా రుద్దకూడదు. ఇలా చేస్తే.. జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది.

జుట్టుని స్మూత్ గా మారడానికి
2టేబుల్ స్పూన్ల తేనె, ఒక కప్పు నీళ్లలో కలపాలి. షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకి ఈ మిశ్రమాన్ని పట్టించాలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే మీ జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.

కండిషనర్
ఒక కప్పు కొబ్బరినూనెను సన్నని మంటపై వేడి చేయాలి. 2 టేబుల్ స్పూన్ల తేనె, పావు కప్పు మజ్జిగ కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. చల్లారనివ్వాలి. జుట్టుని చిన్న పాయలుగా విడదీసి ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ అప్లై చేయాలి.

డ్యామేజ్ అయిన జుట్టుకి
1 టేబుల్ స్పూన్ అవకాడో గుజ్జు తీసుకుని ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఫోర్క్ ఉపయోగించి.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టుకి మాయిశ్చరైజర్ అందిస్తుంది.

డాండ్రఫ్ నివారించడానికి
ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అరకప్పు పెరుగు, కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుకి పట్టించి గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేయాలి. అంతే.. డాండ్రఫ్ తగ్గడం మీరే గమనిస్తారు.

జుట్టుకి షైనింగ్
10 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల తేనె, 10 చుక్కల ఆల్మండ్ ఆయిల్ తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. స్కాల్ప్, జుట్టుకి పట్టించి.. షాంపూతో శుభ్రం చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు ఒకసారి అప్లై చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.

డ్రై హెయిర్
ఒక అరటిపండు గుజ్జు తీసి.. అందులో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీస్పూన్ కరివేపాకు, 2టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఫోర్క్ ఉపయోగించి.. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుకి అప్లై చేయాలి. గంట తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అంతే జుట్టు డ్రై గా మారకుండా అడ్డుకుంటుంది.



Click it and Unblock the Notifications