Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
జుట్టుకి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఏది బెటర్..?
పురాతన కాలం నుండి అందుబాటులో ఉండే నూనె కొబ్బరి నూనె . అయితే ఆలివ్ ఆయిల్ కూడా థెరఫీలలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ రెండు నూనెల్లో ఏది ఉత్తమైనదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్ ముఖ్యం. జుట్టు పెరగాలన్నా, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా తలకు ఆయిల్ అప్లై చేయాలి. అయితే జుట్టుకు పెట్టుకునే నూనెలో మార్కెట్లో వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో ఏవి ఎంపిక చేసుకోవాలా అని చాలా మంది సతమత పడుతుంటుంటారు. !
అయితే పురాతన కాలం నుండి అందుబాటులో ఉండే నూనె కొబ్బరి నూనె . అయితే ఆలివ్ ఆయిల్ కూడా థెరఫీలలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ రెండు నూనెల్లో ఏది ఉత్తమైనదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే ..

రెండు ఆయిల్స్ ను కంపేర్ చేస్తే కొబ్బరి నూనె జుట్టు అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి నూనెలో మాలుక్యులర్ వెయిట్ తక్కువగా ఉంటుంది. ఇది జుట్టును సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది.
కొబ్బరి నూనెలో జుట్టులో మాయిశ్చరైజర్ ను ఏమాత్రం తగ్గించకుండా గ్రేట్ గా సహాయపడుతుంది. నేచురల్ మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది. ఇంకా, కొబ్బరి నూనె కూల్ నేచర్ కలిగి ఉండటం వల్ల తలను కూల్ గా ఉంచుతుంది. స్మూత్ గా చేస్తుంది.
కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది చుండ్రును నివారిస్తుంది. మరియు పేలను దూరం చేస్తుంది.

ఇక ఆలివ్ ఆయిల్ ఎలా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. డిటిహెచ్ హార్మోన్ హెయిర్ ఫోలిసెల్స్ ను వీక్ గా మార్చి, జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి, ఆలివ్ ఆయిల్ హార్మోన్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది తలను, జుట్టును శుభ్రం చేస్తుంది. తలలో పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది.హెయిర్ ఫోలిసెల్స్ కు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. . కొత్తగా హెయిర్ ఫోలిసెల్స్ ను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఈ రెండు నూనెల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ప్రశ్నార్థకంగా మారింది?
ఖచ్చితంగా కొబ్బరి నూనె బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే కొబ్బరి నూనెలో అదనంగా శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టును ఒత్తుగా స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఇవే కాకుండా కొబ్బరి నూనెలో మాలిక్యులర్ వెయిట్ ఆలివ్ ఆయిల్లో కంటే తేలికగా ఉండటం వల్ల కొబ్బరి నూనె తజుట్టుకు త్వరగా గ్రహిస్తుంది. జుట్టును సాప్ట్ గా మార్చుతుంది. ఆలివ్ ఆియల్ జుట్టును మరింత జిడ్డుగా మార్చుతుంది. ఎక్కువ రోజులు జుట్టును ఆయిలీగా మార్చుతుంది. కాబట్టి, ఖచ్చితంగా కొబ్బరి నూనె ను ఉపయోగించడం ఉత్తమం!

స్టెప్ 1:
ఒక కప్పు తీసుకుని, అందులో కొబ్బరి నూనెవేసి తక్కువ మంటలో వేడి చేయాలి. ఒక నిముషం వేడి చేసిన తర్వాత గోరువెచ్చగా చల్లారిన తర్వాత చేతి వేళ్ళతో తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

స్టెప్ 2:
వేడిగా ఉన్న కొబ్బరి నూనెలో రోజ్మెర్రీ ఆయిల్ ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల , ఇది తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. హెయిర్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది. జుట్టు మరీ జిడ్డుగా కనబడకుండా చేస్తుంది.

స్టెప్ 3:
తలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే, చుండ్రు పెరుగుతుంది. అందుకోసం కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి ఉండటం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరగకుండా చేస్తుంది. చుండ్రును నివారిస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది.

స్టెప్ 4:
తలలో చిక్కు, ముడులను తొలగిస్తుంది. జుట్టు డ్యామేజ్, బ్రేక్ కాకుండా కొబ్బరి నూనె సహాయపడుతుంది.

స్టెప్ 5:
ఇన్ని చేసిన తర్వాత కాటన్ బాల్ ను ఆయిల్లో డిప్ చేసిన తర్వాత ఈ నూనెను తలకు అప్లై చేయాలి. తలకు నూనెను బాగా అప్లై చేయాలి. జుట్టు పొడవునా నూనెను అప్లై చేయాలి.

స్టెప్ 6:
తలకు నూనె అప్లై చేసి సున్నితంగా మాసాజ్ చేయాలి. పింగర్ టిప్స్ తో బాగా మసాజ్ చేయాలి. తర్వాత ముడి వేసుకోవాలి. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఈ కోకనట్ ఆయిల్ ను హెయిర్ మాస్క్ గా అప్లై చేసి రెండు గంటలు ఉంచాలి.

స్టెప్ 7:
రెండు గంటల తర్వాత షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి . ఎక్సెస్ వాటర్ ను టవల్ తో తలను ఆర్పుకోవాలి. హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకుండా నేచురల్ గా తలను ఆర్పుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి కొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.!



Click it and Unblock the Notifications