Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
కురుల పెరుగుదలకు ఔషదగుణాలు కలిగిన నేచురల్ రెమెడీస్
ఒక అందమైన కేశ సౌందర్యం కలిగి ఉండటం ప్రతి ఒక్క అమ్మాయి కల. కొన్ని నేచురల్ రెమెడీస్ ఆ కలను నెరవేర్చడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . బ్యూటీ ఎక్స్ పర్ట్స్ ప్రకారం, మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల కేశాలు బలంగా పెరగడంతో పాటు, కేశాలకు కానీ, తలకు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగించవు.
పురుషులతో పోల్చిన మహిళల్లో హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంటుంది . ముఖ్యంగా అందుకు కారణం కూడా లేకపోలేదు, హార్మోనుల్లో మార్పులు వల్ల రాపిడ్ హెయిర్ లాస్ జరుగుతుంది . జుట్టు పెరుగుదలను మెరుగుపరచుకోవడానికి హెయిర్ రూట్స్ కు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . హెయిర్ రూట్స్ ను బలపరచడానికి కొన్ని హోం రెమెడీస్ ను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వీటిలో అలోవెరలో అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి .
గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్
ఈ అలోవెర జెల్ ను నెలలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల అన్ని రకాల హెయిర్ సమస్యలు నివారించబడుతాయి. అదే విధంగా . పురాతన కాలం నాటి నేచురల్ రెమెడీస్ ను నేచురల్ మెడిసినల్ వాల్యూస్ కలిగిన రెమెడీస్ అయినటువంటి ఆమ్లా మరియు వేప పేస్ట్ వంటివి మీ జీవితాన్ని అందంగా మార్చేస్తుంది. మరికెందుకు ఆలస్యం మీ కేశ సౌందర్యాన్ని మెరుగుపరచేందుకు , కేశాలు అందంగా పెంచుకొనేందుకు కొన్ని హోం రెమెడీస్ ను ఫాలో అయిపోండి..

అలోవెర:
అలోవెర జెల్ ను తలకు పట్టించి మసాజ్ చేయాలి . ఇది డ్రై అయిన తర్వాత , బాగా శుభ్రం చేసుకోవాలి . షాంపు మరియు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ నేచురల్ రెమెడీని వారంలో రెండు సార్లు ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది.

వేప:
తాజాగా ఉండే వేపాకు పేస్ట్ ను జుట్టు కుదుళ్లకు, కేశాలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కురులు తళతళలాడతాయి. పేలు, చుండ్రు వంటి సమస్యలకు కూడా వేపాకు రసం బాగా పని చేస్తుంది. వేపాకు రసాన్ని ప్రతి వారం రాస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా వుంటాయి.

మందారం :
మందారం ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకొని కురులకు పట్టిస్తే మంచి నిగారింపు వస్తుంది. ఆకులను, లేదా మందరా పువ్వులను బాగా ఎండబెట్టి కొబ్బరినూనెలో వేయాలి. ఆ తర్వాత నూనెను తలకు రాసుకుంటే శిరోజాలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి. జట్టు రాలడం కూడా తగ్గుతుంది.

కరివేపాకు:
కురులు వొత్తుగా పెరిగేందుకు, తళతళలాడేందుకు ఈ ఆకులతో ‘హెయిర్ ప్యాక్' వేసుకోవాలి. కేశాలు గట్టిపడతాయి.అదే సమయంలో కరివేపాకు రసాన్ని తలకు అప్లై చేసినప్పుడు, ఇందులో ఉండే లక్షణాలు హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి . పొడి జుట్టు మరియు దురద తగ్గించుకోవచ్చు.

ఉల్లిపాయ రసం:
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు బెస్ట్ రెమెడీ ఇది . వారానికొకసారి ఆనియన్ జ్యూస్ తో తలస్నానం చేయాలి. ఉల్లిపాయ రసం ఘాటైన వాసన కలిగి ఉంటుంది కాబట్టి, రెండవ సారి షాంపును ఉపయోగించడం ఉత్తమం.

మెంతులు:
మెంతులు జుట్టుకు చాలా పవర్ ఫుల్ గా సహాయపడుతాయి . జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా చాలా వేగంగా నివారిస్తుంది. అందుకు మీరు చేయాల్సింది మెంతులను నీటిల వేసి బాయిల్ చేయాలి . ఇప్పుడు ఈ ఆకులను నూనెలో బాయిల్ చేసి , ఈ పేస్ట్ ను నేరుగా జుట్టుకు అప్లై చేయాలి . ఈ హెయిర్ ప్యాక్ డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి . ఈ ట్రీట్మెంట్ వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

ఆమ్లా:
ఉసిరి కేశాలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎండు ఉసిరిని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి తలస్నానం చేయడానికి ఉపయోగించాలి.ఆమ్లా అన్ని రకాల హెయిర్ సమస్యలను నివారిస్తుంది . అలాగే ఈ ఫ్రూట్ యొక్క పేస్ట్ ను కూడా తలకు ఉపయోగించడం వల్ల హెయిర్ రాలడాన్ని అరికట్టవచ్చు

రోస్మెర్రీ:
స్వీట్ స్మెల్లింగ్ రోజ్ మెరీ హెల్తీ హెయిర్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ హెర్బ్ ను పౌడర్ లా చేసుకొని రోజ్ వాటర్ తో మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి . ఈ మెడిసిన్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలకు బెటర్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications