Latest Updates
-
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.!
జుట్టు పెరగుదలను ప్రోత్సహించే హై ప్రోటీన్ ఫుడ్స్..!
పట్టుకుచ్చులా ఉండే కేశాలతో పొడవాటి జడతో మురిసిపోవాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే ఎంతకీ పెరగని జుట్టుతో మదిలో మదనపడుతుంటారు. కొత్తకొత్త ప్రయోగాలు చేయాలని ఉన్నా శిరోజాలు ఒత్తుగా లేక వెనకుడుగు వేస్తుంటారు. వీటితోపాటు జుట్టు పొడిబారిపోవడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు మహిళలని కలవరపరిచేలా చేస్తుంది.
వీటన్నింటికీ కారణం ఒత్తిడి, అనారోగ్యాలు, జీవనశైలిలో మార్పులు. అయితే సరైన పోషకాహారం తీసుకొన్నట్టైతే వీటన్నింటికి అడ్డు కట్ట వేయవచ్చు. శరీరంలో జింక్ లోపం ఉన్నట్లైతే జుట్టు పెరుగుదల సరిగా ఉండదు. అలాగే జుట్టు పెరుగుదలకి విటమిన్ బి1, విటమిన్ సి, లైసీన్, నయాసిన్ లు ముఖ్యంగా అవసరం. బీటా కెరటిన్ ఫ్యాటీ ఆమ్లాలు సరిగా అందకపోతే చుండ్రు సమస్య తీవ్రం అవుతుంది.

జుత్తు పొడిబారకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉండాలి. కొందరిలో జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహారలోపం ప్రధాన కారణం అంటున్నారు కొందరు సౌందర్య నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు.
జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...


ఖర్జూరం: ఖర్జూరంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఈ ఇనుము అందకే చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. రోజుకో ఖర్జూరం తింటే ఎంతో మేలు. డ్రైఫ్రూట్స్, నల్లటి ఎండు ద్రాక్ష, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు ఉసిరి వంటివి ఇనుమును అందించే ఇతర పదార్థాలు.

జుట్టు చివర్లు చిట్ల ఇబ్బంది పడుతుంటే జామకాయలు తింటే మంచిది. జామలోని విటమిన్ సి చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. ఇనుము గ్రహిస్తుంది. జామతో పాటు ఉసిరి, టమాటా, బత్తాయి ఇందుకు సహకరిస్తాయి. నయాసిన్ విటమిన్ మాంసం, మొలకెత్తిన గింజలు, పచ్చిబఠాణి, ఆకుపచ్చ బఠాణి, వేరుశెనగ, మొలకెత్తిన గోధుమ గింజల నుంచి ఎక్కువగా దొరుకుతుంది. ఈ విటమిన్ జుట్టు తెల్లబడకుండా రాలిపోకుండా కాపాడుతుంది.

మాంసకృత్తులు: కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచడానికి దోహదపడుతుంది. చేపలలో ఎక్కువగా లభిస్తాయి. అయితే గుడ్లు, చేపలు తినలేని వారు సోయాను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. సోయాలోని లైసిన్ అమినో ఆమ్లం జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచుతుంది.

సోయాపాలు లేదా సోయా చిక్కుడులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. జుట్టురాలడాన్ని సోయా సమర్థంగా అరికడుతుంది. ఠీజుట్టు పెరిగేందుకు జింక్ చాలా అవసరం. అది జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది.

ఆల్ఫాలినోలెటిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ యాసిడ్ బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో అధికంగా ఉంటుంది.

పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కాల్షియం చాలా అవసరం. అందుకే ఎదిగే పిల్లలకు రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎముకలు పెరగడంతో పాటు నిగనిగలాడే జుట్టు వస్తుంది



Click it and Unblock the Notifications