Latest Updates
-
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.!
సూపర్ ఫాస్ట్ గా జుట్టు పెరగడానికి సహాయపడే ఫుడ్స్
జుట్టుని కట్ చేయడం క్షణాల్లో పని. కానీ.. అది ఒక ఇంచు పెరగడానికి కూడా ఎంతో సమయం వేచి చూడాలి. అలాగే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం చాలామంది చాలా రకాలుగా తాపత్రయపడుతుంటారు. నిజమే కదూ. కానీ అందరికీ జుట్టు వేగంగా పెరగదు. ఎందుకు ?
మీకు ఇప్పుడు పొడవాటి, ఆరోగ్యకరమైన కురులు కావాలనుకుంటున్నారు. వెంటనే మీ జుట్టు పొడవుగా పెరగడానికి ఏం చేయాలో, ఎలా పొందవచ్చో మాకు తెలుసు ? దీనికోసం కెమికల్ ట్రీట్మెంట్స్, కాస్మొటిక్స్ అవసరం లేదు. కేవలం హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్ ఫాలో అయితే చాలు. అవును జుట్టు పెరుగుదల బాధ్యత ఎక్కువ శాతం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి జుట్టు వేగంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ మీకోసం..

ఎగ్
కోడిగుడ్డు మీ జుట్టుకి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఎగ్ ఎల్లోలో ప్రొటీన్స్, జింక్, విటమిన్ బి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి కోడిగుడ్డు తిన్నా, జుట్టు అప్లై చేసినా.. మంచి ఫలితాలు పొందవచ్చు.

చిలకడదుంప
సాధారణంగా ఉపయోగించే బంగాళదుంపల కంటే.. స్వీట్ పొటాటోస్ మంచి పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. దీనిద్వారా విటమిన్ ఏ పొందవచ్చు. ఇది జుట్టుని హెల్తీగా పెరిగేలా చేస్తుంది.

పప్పు ధాన్యాలు
లెంటిల్స్ గా పిలిచే ధాన్యాలు లేదా గింజలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కొన్ని శనగలు నానబెట్టి.. తర్వాత ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి హెల్తీ స్నాక్స్ అవుతాయి.

ఫిష్
మీ ఫిష్ తినడానికి ఇష్టపడితే.. మరీ మంచిది. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మ సౌందర్యానికి చాలా మంచిది. సాల్మన్, ట్యూనా చేపలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

నట్స్
పనిచేసేటప్పుడు లేదా భోజనం తర్వాత లేదా స్నాక్స్ కి ముందు నట్స్ తినండి. ఎందుకంటే వేరుశనగలు, వాల్ నట్స్, ఆల్మండ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ లో బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్
సన్నగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ జుట్టు పెరుగుదలకు చాలా గ్రేట్ గా తోడ్పడతాయి. వాటిని తినడం లేదా జ్యూస్ లో మిక్స్ చేసుకోవడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. ఇందులో ఫైబర్, ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది.

అవకాడో
మీ రెగ్యులర్ డైట్ లో అవకాడో చేర్చుకుంటే.. మీ జుట్టు సూపర్ ఫాస్ట్ గా పెరిగిపోతుంది. ఇందులో ఉండే విటమిన్ బి, ఈ జుట్టుకి మంచి పోషణను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. సలాడ్స్ లో అవకాడో చేర్చుకున్నా మంచిది.

ఆకుకూరలు
లీఫీ వెజ్జీస్ లో ఫోలేట్, ఐరన్, ప్రొటీన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి బాధ్యత తీసుకుంటాయి. రాత్రి పూట రైస్ కర్రీకి బదులు, ఒక కప్పు స్పినాచ్ తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

క్యాప్సికమ్
చూడగానే ఆకట్టుకునే రంగుల్లో ఉండే క్యాప్సికమ్ జుట్టు చాలా బాగా సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications