Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
హెల్తీ అండ్ బౌన్సీ హెయిర్ కోసం నేచురల్ హోం రెమెడీస్
జుట్టు మెరుస్తూ.. అందంగా కనబడాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మహిళల కంటే పురుషులే ఎక్కువ కేర్ తీసుకొంటుంటారు. ఎందుకంటే స్త్రీల కంటే పురుషుల్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం, ఆహారం, హార్మోన్లు, వాతావరణం, కాలుష్యం, జీన్స్ కారణంగా హెయిర్ ఫాల్ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంటుంది. వాటికోసం చాలా రకాల కండీషనర్స్ ను, షాంపూలను తరచూ మార్చుతుంటారు కూడా.. అయితే వాటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు.
జుట్టు ఆరోగ్యం కోసం ఎటువంటి హెయిర్ స్పాలు చేయించుకోకుండా , ఎటువంటి ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకోకుండానే, మరియు ఎటువంటి ఖరీదైన కండీషనర్లు మరియు షాంపులను ఉపయోగించకుండానే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? ఇవేవీ ఉపయోగించకుండానే మన వంటగదిలోని కొన్ని ఉత్తమైన పదార్థాలను ఉపయోగించి అందమైన జుట్టును పొందవచ్చు. బీర్ నుండి అరటిపండ్ల వరకూ జుట్టు మంచి షైనింగ్ మరియు ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి ఈ వెరైటీ హోం రెమెడీస్ చాలా అద్భుతంగా సహాయపడుతాయి. మరి అవేంటో ఒకసారి చూసేద్దాం:

ఆయిల్ మసాజ్
ఆయిల్ మసాజ్ చాలా పాతపద్దతై అయినా చాలా ఎఫెక్టివ్ గా రిజల్ట్ అందిస్తుంది . దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా మరియు షైనీగా మెరుస్తుంటుంది. ఆయిల్ మసాజ్ కు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ ఉపయోగించవచ్చు. ఏ నూనెను ఉపయోగించినా కొద్దిగా వేడి చేయడం మంచిది. . ఇది హెయిర్ రూట్స్ బలోపేతం చేస్తుంది మరియు హెయిర్ బ్రేకేజ్ ను అరికడుతుంది . ఆలివ్ ఆయిల్ మసాజ్ వల్ల కండీషనర్ బాగా పడుతుంది.

అరటి పండ్లు:
జుట్టుకు చాలా గ్రేట్. అరటిపండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అరటిపండ్లలోని అధిక పొటాషియం వల్ల దీన్ని జుట్టుకు వినిగించుకోవచ్చు . ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నేచురల్ గా ఎలాసిటిని అందిస్తుంది . * అరటిపండును మొత్తగా గుజ్జులా చేసి తల మాడునుండి కేశాల పొడవునా అరపండి గుజ్జును పట్టించాలి. దీన్ని 15నిముషాలు అలాగే ఉంచి, తర్వాత షాంపుత తలస్నానం చేసుకోవాలి. ఇది డ్రై హెయిర్ ను మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది.

గుడ్డు పచ్చసొనతో చికిత్స:
గుడ్డులోన పచ్చసొనను తలకు బాగా పట్టించాలి. లేదా మూడు గుడ్ల పచ్చసొనలో, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు మూడు చుక్కల విటమిన్ ఇ ఆయిల్ ను మిక్స్ చేసి అప్లై చేస్తే ఇది ఒక అద్భుతమైన రెమెడీ. ఇలా పట్టించిన తర్వాత 10నిముషాలు అలాగే ఉంచి తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేసుకోవాలి. ఈ పద్దతిని వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చికిత్సవల్ల మీ కేశాలను నునుపు చేస్తుంది మరియు కాండీషనర్ గా పనిచేస్తుంది.

మోయొనైజ్ :
తడిగా ఉన్న మీ జుట్టుకు మోయొనైజ్ ను అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి . మోయొనైజ్ ఒక అద్భుతమైన కండీషనర్ గా జుట్టుకు పనిచేస్తుంది.

తేనె:
తేనె చర్మ సంరక్షణకు మాత్రమే కాదు, ఇది కేశ సంరక్షణకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . డ్యామేజ్ హెయిర్ కు ఎక్సలెంట్ హోం రెమెడీ. మరియు ఇది హెయిర్ ఫాల్ నివారిస్తుంది. షాంపుకు రెండు మూడు డ్రాప్స్ తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేసి, తలస్నానం చేయడం వల్ల కండీషనర్ గా పనిచేస్తుంది.

మెంతులు:
రెండు చెంచాలా మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం వాటని మెత్తగా పేస్ట్ చేసి, తల మొత్తానికి పట్టించాలి. పట్టించిన తర్వాత 30నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి. చుండ్రును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బీర్ తో చికిత్స
ఇది ఒక ప్రసిద్ది చెందిన హెయిర్ ట్రీట్మెంట్. స్ర్పే బాటిల్లో కొద్దిగా బీర్ వేసి, షాంపు చేసిన తర్వాత కేశాలకు స్ర్పే చేసుకొని లైట్ గా టవల్ తో తడి ఆర్పుకోవాలి. బీర్ లో ఉన్న లక్షణాలు వల్ల ఇది జుట్టు అవసరం అయ్యే షైనింగ్ ను అంధిస్తుంది.

ఉసిరి పొడి మరియు నిమ్మరసం:
మందమైన పొడవాటి జుట్టు పొందడానికి ఉసిరి పొడి , నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తారు. అందుకు ఒక చెంచా ఉసిరి పొడికి ఒక నిమ్మపండు యొక్క రసాన్ని మిక్స్ చేసి, ఈ మిశ్రామన్ని తలకు మొత్తానికి పట్టించి 30నిముషాలు అలాగే ఉంచేయాలి తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్
ఇది ఎఫెక్టివ్ హోం రెమెడి. ఇది ఆపిల్ సైడర్ వెనిగర్ ను వార్మ్ వాటర్ తో మిక్స్ చేసి తలకు బాగా పట్టించి, తలస్నానం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

కాంతివంతమైన జుట్టుకోసం స్ట్రాబెర్రీలు:
ఒక 8స్ట్రాబెర్రీ పండ్లను మెత్తగా గుజ్జులా తయారుచేసి, దానికి ఒక చెంచా మోయొనైజ్ మిక్స్ చేసి పక్కన పెట్టుకొని, తలను నీటితో తడి చేసుకొని, తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత షవర్ క్యాప్ ను పట్టుకొని, తర్వాత డినీళ్ళలో ముంచిన టవల్ నుతలకు చుట్టుకోవాలి . ఒక గంట తర్వాత మంచి కండీషనర్ మరియు షాంపుతో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications
