Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
పొడవాటి జుట్టు కావాలా ? అయితే ఇవాళే ఈ హోంరెమిడీస్ ఫాలో అవ్వండి.. !
మీకు పొడవాటి జుట్టు అంటే ఇష్టమా ? లాంగ్ హెయిర్ ఇష్టపడని వాళ్లు ఉండరు. ఎందుకంటే.. పొడవు జుట్టు ఉన్నవాళ్లు ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా ఎలా అయినా.. రెడీ అయిపోవచ్చు. కానీ.. పొట్టి జుట్టు ఉంటే.. కేవలం మోడ్రన్ గా మాత్రమే కనిపించవచ్చు. మీకు పొడవు జుట్టు కావాలంటే.. సింపుల్ చిట్కాలు మీ చెంత ఉన్నాయి.
అయితే ప్రస్తుత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కారణంగా.. పొడవు జుట్టు పొందడం అంత ఈజీ కాదు. కాబట్టి.. కొద్దిగా ఓపిక తీసుకుని, కెమికల్స్ లేని హోం రెమిడీస్ ప్రయత్నిస్తే.. న్యాచురల్ గా పొడవాటి జుట్టు పొందవచ్చు. పొల్యూషన్, అన్ హెల్తీ హ్యాబిట్స్ కారణంగా.. చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోంది.
పొడవు జుట్టు పొందాలనే డ్రీమ్ మీకు ఉంటే.. ఇప్పుడు సూచించే రెమిడీస్ ని క్రమం తప్పకుండా ఫాలో అయితే.. చాలా గ్రేట్ గా పొందవచ్చు. టెస్ట్ చేసి, నిరూపించబడిన హోం రెమిడీస్ నే మీకు సూచించబోతున్నాం. వీటిని ఖచ్చితంగా ఫాలో అయి చూడండి.. మీ జుట్టు పొడవుగా మారిపోతుంది.

నిమ్మరసం, కొబ్బరినూనె
ఒక టీస్పూన్ నిమ్మరసం, 2 టీస్పూన్ల కొబ్బరినూనె కలపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని స్కాల్ప్ కి రాసి.. 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత 2 నుంచి 3 గంటలు అలానే వదిలేయాలి. ఇప్పుడు దాన్ని మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి.. శుభ్రం చేసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్, తేనె
ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీస్పూన్ ఆర్గానిక్ తేనె తీసుకుని అన్నింటినీ కలపాలి. దీన్ని స్కాల్ప్ కి, జుట్టుకి బాగా పట్టించాలి. 35 నుంచి 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

హెన్నా పౌడర్, పెరుగు, నిమ్మరసం
3 నుంచి 4 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, 2 టీస్పూన్ల పెరుగు, 2 నుంచి 3 టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట తర్వాత మైల్డ్ షాంపూ, కండిషన్ తో శుభ్రం చేసుకోవాలి.

ఉసిరి రసం, నిమ్మరసం
ఉసిరి రసం, నిమ్మరసం రెండింటినీ సమానంగా తీసుకుని కలపాలి. దీన్ని జుట్టుకి పట్టించాలి. ఈ మాస్క్ ని 2 నుంచి 3 గంటలు అలానే ఉంచి.. తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనె, అవకాడో
2 టేబుల్ స్పూన్ల అవకాడో పేస్ట్, 2 టీస్పూన్ల కొబ్బరినూనెలో కలపాలి. ఈ మాస్క్ ని తల, జుట్టుకి పట్టించాలి. 35 నిమిషాల తర్వాత.. మైల్డ్ షాంపూ, కండిషనర్ తో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్, ఆల్మండ్ ఆయిల్
అరకప్పు ఓట్స్, 2 నుంచి 3 టీస్పూన్ల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్, కుదుళ్లకు పట్టించాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

కొబ్బరినూనె, తేనె
కొబ్బరినూనె రెండు భాగాలు, తేనె అందులో సగం తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి బాగా మసాజ్ చేయాలి. 35 నిమిషాల తర్వాత.. మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
