Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డ్రై హెయిరే కానీ.. ఆయిలీ స్కాల్ప్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
డ్రై హెయిర్ లేదా ఆయిలీ హెయిర్ ఏది ఉన్నా.. స్కాల్ప్ డ్రైగా, డల్ గా మారుతుంది. స్కాల్ప్ లోని న్యాచురల్ ఆయిల్స్ జుట్టు మొత్తానికి అందనప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య సాధారణంగా పొడవాటి జుట్టు ఉన్నవాళ్లలో కనిపిస్తుంది. అదే పొట్టి జుట్టు ఉన్నవాళ్లు ఈ సమస్యను ఎప్పటికీ ఎదుర్కొనే అవకాశం ఉండదు.
ఈ సమస్య ఉన్నప్పుడు జుట్టుని మెయింటెయిన్ చేయడం చాలా కష్టమవుతుంది. ఆయిలీ స్కాల్ప్ నివారించాలంటే.. జుట్టు అప్పటికే డ్రైగా మారింది కాబట్టి.. ఈ సమస్య నుంచి బయటపడటం చాలా అయోమయంగా మారుతుంది. అందుకే.. ఈ ప్రాబ్లమ్ ని చాలా జాగ్రత్తగా క్లియర్ చేసుకోవాలి.

కుదుళ్లు ఆయిలీగా, బంకగా కనిపిస్తూ ఇబ్బందిపెడుతుంటాయి. మరోవైపు జుట్టంతా చాలా డ్రైగా మారి ఉంటుంది. అయితే.. ఈ సమస్యకు చాలా చక్కటి ఉపాయాలు ఉన్నాయి. ఈ టిప్స్ ఫాలో అయితే.. ఎఫెక్టివ్ గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. త
*పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగించి కుదుళ్ల వరకు కాకుండా.. జుట్టు వరకు దువ్వుకోవాలి. దువ్వెన స్కాల్ప్ కి తగలడం వల్ల.. మరింత ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అవడానికి కారణమవుతుంది.
*జుట్టు డ్రైగా ఉంది కాబట్టి.. శుభ్రం చేసుకోకపోవడం మంచిది. కానీ.. ఆయిలీ స్కాల్ప్ నివారించడానికి కొద్దిగా బేబీ పౌడర్ ని స్కాల్ప్ పై చల్లాలి. ఇది అదనంగా ఉన్న ఆయిల్ ని పీల్చేస్తుంది. డ్రైకాకుండా చూస్తుంది.

*కనీసం వారానికి ఒకసారి జుట్టుకి ఆయిల్ పెట్టాలి. అయితే పొడవాటి జుట్టుపై మాత్రమే ఫోకస్ పెట్టి.. ఆయిల్ రాసుకోవాలి. ఏ మాత్రం ఆయిల్ స్కాల్ప్ కి తగలకుండా జాగ్రత్తపడాలి. ఆయిల్ స్కాల్ప్ కి తగిలితే.. సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
*జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకున్నప్పుడు.. జుట్టు చివర్లకు మరీ ఎక్కువ షాంపూ ఉపయోగించరాదు. స్కాల్ప్ ని మాత్రమే షాంపూతో మసాజ్ చేయాలి.

*కండిషనర్ ని మాత్ర జుట్టు చివర్లకు అప్లై చేయాలి. జుట్టుని శుభ్రం చేసుకున్న తర్వాత.. సెరమ్ ని జుట్టు చివర్లకు అప్లై చేయాలి.0
*ఈ చిట్కాలను పాటించడం వల్ల .. మీకు డ్రై హెయిర్ , ఆయిలీ స్కాల్ప్ సమస్యను నివారించడం తేలికవుతుంది. ఈ టిప్స్ అన్నీ ప్రయత్నించి, ఫలితం పొందినవే.



Click it and Unblock the Notifications