Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఇలా చేస్తే తెల్లగా మారిన జుట్టు కూడా నల్లగా మారుతుంది, ట్రై చేసి చూడండి
చాలా మందికి చిన్నతనంలోనే జుట్టు తెల్లపడిపోతుంది. దీంతో బయట ఎవరోనైనా మాట్లాడేటప్పుడు వారి చూపు ఎక్కడ తమ తెల్లజుట్టు పైకి వెళ్తుందోనని దాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. తెల్ల జుట్టు.
చాలా మందికి చిన్నతనంలోనే జుట్టు తెల్లపడిపోతుంది. దీంతో బయట ఎవరోనైనా మాట్లాడేటప్పుడు వారి చూపు ఎక్కడ తమ తెల్లజుట్టు పైకి వెళ్తుందోనని దాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

అంతేకాదు తెల్ల జుట్టు వల్ల యువకులు ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పొతారు. నలుగురు తమని చూసి నవ్వుకుంటారని బాధపడతారు.

జుట్టు మరింత తెల్లపడకుండా
కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా జుట్టు మరింత తెల్లపడకుండా ఉంటుంది. సాధారణంగా జుట్టు తెల్లబడడం అనేది వంశపారపర్య సమస్యగా ఉంటుంది. ఒక్కోసారి థైరాయిడ్ సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది.

సహజపద్దతుల్లో
అయితే తెల్లబడిన జుట్టును తిరిగి సహజపద్దతుల్లో నల్లగా మార్చుకోవొచ్చు. అలాగే జుట్టు ఎక్కువగా తెల్లపడకుండా ఉండేందుకు కూడా ఈ సూచనలు పాటిస్తే సరిపోతుంది.

ఉసిరి పొడి తీసుకోండి
కాస్త ఉసిరి పొడి తీసుకోండి. అందులో కాస్త నిమ్మరసం కలుపుకోండి. దాన్ని మీరు పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్ని రోజూ తలకు పూసుకుని రెండు గంటలు ఆగి తలస్నానం చేయండి.

తెల్ల జుట్టు నల్లగా మారడం
ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడం అలాగే జుట్టు త్వరగా తెల్లగా కావడం ఆగిపోతాయి. ఉల్లిపాయతో కూడా జుట్టును నల్లబరుచుకోవొచ్చు. ఉల్లిగడ్డను మిక్సీ లో వేసి మెత్తగా చేసుకోండి.

తెల్ల వెంట్రుకులు ఉండే చోట
ఆ పేస్టును తెల్ల వెంట్రుకులు ఉండే చోట పూసుకోండి. రెండు గంటలు ఆగి తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి.

కాస్త నిమ్మరసం కలుపుకుని
అలాగే కొబ్బరినూనెలో కాస్త నిమ్మరసం కలుపుకుని దాన్ని రోజూ తలకు పూసుకుంటూ ఉండండి. దీనివల్ల కూడా మీ జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్లజుట్టు రాకుండా ఉంటుంది. రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే కూడా మీ జుట్టు నల్లబడుతుంది.

దాన్ని పేస్ట్ గా మార్చుకోండి
నువ్వులను మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ గా మార్చుకోండి. అందులో బాదం ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఈ పేస్టును కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

ఆహారంలో మార్పులు చేసుకోండి
రోజూ మీరూ తినే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోండి. ఫుడ్ లో ప్రోటీన్స్, విటమిన్ బీ12 ఎక్కువగా ఉండాలి. రోజూ పాలతో పాటు గుడ్లు తీసుకోవాలి. అలాగే కందులతో, శనగలతో తయారు చేసిన పదార్థాలుండాలి. పెసర్లతో చేసిన ఆహారాలు తీసుకోవాలి.

త్వరగా జుట్టు తెల్లపడుతుంది
అలాగే బాదంపప్పు, వాల్నట్ వంటివి రోజూ కొన్ని తినాలి. అలాగే పిస్తా కూడా రోజూ తినాలి. మానసిక ఎలాంటి ఒత్తిళ్లు ఉండకూడదు. ఎక్కువగా ఆలోచించేవారికి త్వరగా జుట్టు తెల్లపడుతుంది. అందువల్ల ఒత్తిళ్లను తగ్గించుకోండి. రోజూ ఎక్సర్ సైజ్ లు చేయండి.



Click it and Unblock the Notifications
