Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
ఈ చిట్కాలు మరియు సూచనలతో మీ జుట్టును సుగంధభరితంగా మలుచుకోండి.
ఈ చిట్కాలు మరియు సూచనలతో మీ జుట్టును సుగంధభరితంగా మలుచుకోండి.
చాలామంది మహిళలు తమ జుట్టు ఎల్లప్పుడూ అందంగా సువాసనాలీనుతూ ఉండాలని కోరుకుంటారు. కానీ జుట్టు ఎప్పుడు తాజా సువాసనలతో ఆకర్షణీయంగా ఉంచుకోవడం ఒక సవాలే! ఎందుకంటే వివిధ రకాల కారణాల వలన జుట్టు మరియు మాడుల నుండి దుర్వాసన మొదలవుతుంది. అపరిశుభ్రత, అధికంగా చెమట పట్టడం, జిడ్డుతో కూడిన మాడు, హార్మోన్ల అసమతుల్యత, మాడుకు ఇన్ఫెక్షన్లు సోకటం మొదలైన కారణాల వలన సాధారణంగా కేశ సమస్యలు మొదలవుతాయి.
మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్న వారైతే , మీ జుట్టు సుగంధభరితంగా మారాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు మీకు తెలుపబోతున్నాం. మీ కొరకై వివిధ చిట్కాలు మరియు సూచనలు క్రోడీకరించి అందించబోతున్నాం.

అనేకసార్లు ప్రయత్నించి పరీక్ష చేసిన ఈ సూచనలు మరియు చిట్కాలు సులువైనవి మరియు ప్రభావవంతమైనవి. వీటిని పాటించిన ఎంతోమంది మహిళలు సువాసనలతో కూడిన జుట్టును సొంతం చేసుకున్నారు.
ఆ సూచనలు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!

1. మీ షాంపూకు సువాసన తైలాలను జోడించండి:
లావెండర్ తైలం, జాస్మిన్ తైలం వంటి సువాసన తైలాలను మీరు ఎల్లప్పుడూ వాడే షాంపూతో కలిపి వినియోగించండి. ఇలా చేస్తే సుగంధతైలాల సువాసన మీ జుట్టుకు పడుతుంది. దుర్వాసన దూరమవుతుంది. షాంపు చేసుకునేటప్పుడు 3-4 చుక్కల సుగంధతైలాన్ని షాంపూలో కలపి వాడితే కావలసిన ఫలితం లభిస్తుంది.

2. మీ దువ్వెనపై పెర్ఫ్యూమ్ చల్లండి:
ఇది బహుశా అన్నిటికంటే సులభమైన పద్దతి. కేవలం మీ దువ్వెనపై పెర్ఫ్యూమ్ చల్లుకుని తదనంతరం దువ్వుకోండి. ఈ పద్ధతి ద్వారా నిమిషాల్లో మీ జుట్టుకు సువాసన చేకూరుతుంది.

3. టీ బాగ్స్ ను ఉపయోగించండి:
జుట్టు తెల్లబడటాన్ని మరియు దుర్వాసనను తగ్గించడం మొదలైన జుట్టు సంబంధించిన అనేక సమస్యల కొరకు టీ ఆకులను వాడటమనేది మీ జట్టుపై అద్భుతాలు సాధించడానికి వినియోగించే అతిపాత పద్ధతి. ఒక మగ్ లో కొన్ని వేడి నీళ్లను తీసుకుని అందులో రెండు టీ బ్యాగ్లను వేసి నానబెట్టండి. 10-15 నిమిషాల అనంతరం ఈ టీ బ్యాగ్లను ఫ్యాన్ కింద చల్లారనివ్వండి. ఈ ద్రావణంతో మీ జుట్టును బాగా కడగండి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాక సువాసనాపూరితమవుతుంది.

4. మీ మాడును టొమాటోలతో మర్దన చేసుకోండి:
జుట్టు దుర్వాసన రాకుండా ఉండటానికి టొమాటో ఒక ప్రభావవంతమైన గృహవైద్య పరిష్కారం. టొమాటో రసాన్ని పిండండి. దీంతో మాడును బాగా మర్దన చేసుకుని మిగిలింది జుట్టు చివర్ల వరకు రాసుకోండి. ఇలా 20-25 నిమిషాల పాటు వదిలేసి గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఈ చిట్కాతో మీ జుట్టు నుండి దుర్వాసన పరుగులుపెట్టి పారిపోతుంది.

5. నిమ్మరసాన్ని రాసుకోండి:
నిమ్మరసంలోని యాంటీ బాక్టీరియల్ తత్వాలు మీ జుట్టుకు దుర్వాసన కలుగజేసే బాక్టీరియాను నాశనం చేసి మీ జుట్టు తాజా సువాసనలతో నిగారింపజేస్తుంది. నిమ్మరసాన్ని పిండి మాడును బాగా మర్దన చేసుకుని మిగిలింది జుట్టు చివర్ల వరకు రాసుకోండి.

6. వేడితో కూడుకున్న స్టయిలియంగ్ పరికరాలను వాడకండి:
జుట్టును స్ట్రెయిట్ గా చేసుకోవడానికి, వంకీలు తిప్పడానికి, ఆరబెట్టుకునేందుకు వాడే పరికరాలు వేడితో కూడుకుని కొన్ని సార్లు జుట్టును కాలిన వాసనలు చేకూరుస్తాయి. కనుక ఇటువంటి పరికరాలకు దూరంగా ఉండి దూర్వాసనను దూరంగా పెట్టడం తెలివైన పని.



Click it and Unblock the Notifications
