Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి
ఈ జుట్టు సంబంధించిన సమస్యల నుండి బయటపడే క్రమంలో భాగంగా, మనం తరచుగా సెలూన్లకు వెళ్ళడం, అనేక చికిత్సలకు ఉపక్రమించడం మరియు అనేక సూపర్ మార్కెట్లు, బ్యూటీ స్టోర్స్ తిరిగి ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు.
సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, మీ జుట్టు యొక్క సహజసిద్ద ప్రకాశక తత్వాలు రోజురోజుకీ తరిగిపోతాయి అనడం జగమెరిగిన సత్యం. క్రమంగా, మీ జుట్టు మందకొడిగా, జీవం లేనిదిగా మరియు గడ్డి వలె తయారవుతుంది.
మరియు ఈ జుట్టు సంబంధించిన సమస్యల నుండి బయటపడే క్రమంలో భాగంగా, మనం తరచుగా సెలూన్లకు వెళ్ళడం, అనేక చికిత్సలకు ఉపక్రమించడం మరియు అనేక సూపర్ మార్కెట్లు, బ్యూటీ స్టోర్స్ తిరిగి ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటివి చేస్తుంటాము. కానీ కోల్పోయిన జుట్టును తిరిగి పొందడానికి ఇటువంటి రసాయనాల వాడకాన్ని అనుసరించడం, ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, దుష్ప్రభావాలను కలుగజేస్తూ ఆర్ధికంగా కూడా నష్టాన్ని కలుగజేస్తుంది.
కావున ముందుగా గృహ చిట్కాల మీద శ్రద్ద వహించడం ద్వారా, ఇటువంటి దుష్ప్రభావాల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయినా మీ ఇంటిలోనే అద్భుతమైన సౌందర్య సాధనాలు ఉన్నప్పుడు, వేలకు వేలు రసాయనిక ఉత్పత్తులకు వినియోగించడం వృధానే అవుతుంది. అవునా కాదా ?
కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే వైద్యుని సూచనలను అనుసరించి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. అవి జన్యు సంబంధిత, లేదా ఇతర అనారోగ్య కారణాల వలన కలిగే సమస్యలుగా ఉంటాయి. కానీ అధిక శాతం సమస్యలను ఇంటి చిట్కాలతోనే తొలగించుకోవచ్చు. ఇతర రసాయనిక ఉత్పత్తుల కన్నా, ఇవే అద్భుతంగా పనిచేస్తాయి కూడా.

ఈ వ్యాసంలో, డై పపయా హెయిర్ మాస్క్ గురించి చెప్పడం జరిగింది. అది మీ జుట్టు యొక్క ప్రకాశక తత్వాలను పునరుద్ధరిస్తుంది మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడి, పునరుజ్జీవనం గావిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
ఆరోగ్యకరమైన జుట్టును పొందడం కోసం ఈ డై-పపయా (బొప్పాయి) హెయిర్-మాస్క్ ప్రయత్నించండి :

1. డై పపయా హెయిర్ – మాస్క్ :
కావలసిన పదార్ధాలు :
- ½ కప్పు పండిన బొప్పాయి
- ¼ కప్పు కొబ్బరి పాలు
- 1 టీస్పూన్ తేనె
తయారుచేయు విధానం :
1. బాగా పండిన బొప్పాయిని తీసుకుని, దాని తొక్కను తొలగించండి.
2. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బ్లెండర్లో ఉంచండి.
3. తరువాత, బ్లెండర్లోకి తాజా కొబ్బరి పాలను జోడించండి.
4. చివరగా, బ్లెండర్లో కొన్ని చుక్కల ముడి తేనెను జోడించండి.
5. మృదువుగా పేస్ట్ వలె తయారయ్యే వరకు కలుపుతూ ఉండండి.
6. తర్వాత ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గిన్నెలోకి తీసుకోండి.
ఎలా అప్లై చేసుకోవాలి :
1. మీ జుట్టును విభాగాలుగా విభజించండి.
2. ఒక సున్నితమైన బ్రష్ సహాయంతో మీ జుట్టు విభాగాల్లో బొప్పాయి మాస్క్ వర్తించడం ప్రారంభించండి.
3. మీరు మీ జుట్టు యొక్క మూలాల నుండి జుట్టు కొనల వరకు మాస్క్ వర్తించారని నిర్ధారించుకోండి.
4. 30 నుండి 45 నిముషాల పాటు పొడిబారే వరకు అలాగే వదిలివేయండి. వీలయితే మీ జుట్టును కవర్ చేయడానికి షవర్ టోపీని ఉపయోగించండి.
5. 45 నిమిషాల తరువాత సల్ఫేట్ రహిత షాంపూతో, సాధారణ నీటిలో మీ జుట్టును శుభ్రపరచండి. లేదా సీకాయ వంటి సహజసిద్ద పదార్ధాలతో తలస్నానం చేయండి.
6. వారంలో కనీసం ఒకరోజు ఈ పద్దతిని అవలంభించడం ద్వారా ఉత్తమమైన ప్రయోజనాలను పొందగలరని సూచించబడినది.

2. బొప్పాయి యొక్క ప్రయోజనాలు :
బొప్పాయి జుట్టు పెరుగుదలను ఆరోగ్యకర రీతిలో జరిగేలా ప్రోత్సహిస్తుంది. మరియు జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో ప్రభావాలను కలిగి ఉంటుంది. బొప్పాయి, మెగ్నీషియం, రాగి, పొటాషియం మరియు A, C విటమిన్లు వంటి పోషకాలను సైతం కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చుండ్రు నివారణకు కూడా గొప్ప పరిష్కారంగా ఉంటుంది. బొప్పాయి, తలపై కాలుష్యం వంటి అంశాల కారణంగా తలెత్తే చర్మ వ్యాదులని నిరోధించడానికి సహాయపడే ఎంజైమ్స్ కలిగి ఉంటుంది.
చిన్న మొత్తంలో ఉపయోగించినప్పుడు నిర్జీవమైన జుట్టుకు జీవాన్నిచ్చే కండిషనర్ వలె పనిచేస్తుంది కూడా.

3. కొబ్బరిపాల ప్రయోజనాలు :
సౌందర్య సాధనాలలో కొబ్బరి నూనె ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ముఖ్యంగా జుట్టు సంబంధిత సమస్యలను రూపుమాపేందుకు ఉత్తమమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయని చెప్పబడింది. కొబ్బరి పాలు విటమిన్ E మరియు ఆరోగ్యకర HDL కొవ్వులను కలిగి ఉంటాయి. కొబ్బరి పాలు జుట్టు మెరుపును పునరుద్ధరించేలా, జుట్టు కుదుళ్ళలోనికి చొచ్చుకుపోతాయి. మీ జుట్టును మసాజ్ చేయడానికి కొబ్బరి పాలను ఉపయోగించడం ద్వారా, స్కాల్ప్ మరియు చుండ్రు వంటి సమస్యల నుండి సానుకూల ఫలితాలను పొందవచ్చు.

4. తేనెతో కూడిన ప్రయోజనాలు :
తేనే మీ జుట్టుకు ఒక సహజ సిద్ద మాయిశ్చరైజర్ వలె పరిగణించబడుతుంది. క్రమంగా మృదువైన మరియు పోషకమయమైన జుట్టును పొందడంలో ఉత్తమంగా పని చేస్తుంది. దీనిలోని అనామ్లజనకాలు ఈ ఫలితాలకు కారణం. మీ రెగ్యులర్ షాంపూలో కొన్ని చుక్కల తేనెను జత చేయడం ద్వారా కూడా జుట్టుకు పోషకాలను అందివ్వవచ్చు. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications











