Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
Shraddha Kapoor:మీ కురులు కూడా శ్రద్ధా కపూర్ లా మెరిసిపోవాలంటే... ఇలా ట్రై చేయండి...
సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన కురులను మెరుగుపరచుకునేందుకు కలబందను ఎలా వాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ అందాల భామ, ప్రభాస్ హీరోయిన్ సాహో ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను చర్మంతో పాటు కురులపై చాలా శ్రద్ధ వహిస్తుందట.

ముఖ్యంగా తన కురులు ఒత్తుగా.. బలంగా ఉండేందుకు.. నిత్యం మెరిసేలా కనిపించేందుకు కొన్ని రకాల హెయిర్ ప్యాక్స్ ను కచ్చితంగా ఉపయోగిస్తుందట.

ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ తన సున్నితమైన చర్మం మరియు కురులను బలంగా మార్చుకునేందుకు ఎలాంటి సహజమైన పద్ధతులను ఫాలో అవుతుందో మీరు చూసెయ్యండి... తన వాడు సహజమైన హెయిర్ మాస్క్ ను వాడేయ్యండి.. మీరు కూడా శ్రద్ధాకపూర్ మాదిరిగా మరింత అందంగా కనిపించండి...

శ్రద్ధా కపూర్ హెయిర్ మాస్క్..
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన కురులను బలంగా ఉంచుకునేందుకు కొన్ని రకాల హెయిర్ ఆయిల్ ను కచ్చితంగా రెగ్యులర్ గా వాడుతుందట. ముఖ్యంగా ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ ని ఎక్కువగా ఉపయోగిస్తుందట. తన జట్టుకు నూనె రాసుకున్న తర్వాత, తన కురులను షాంపూతో శుభ్రం చేసుకుంటుందట. జుట్టును శుభ్రం చేసుకున్న తర్వాత.. కురులపై సీరంను వాడుతుందట.

ఇంట్లోని వస్తువులతో..
బాలీవుడ్ అందాల భామ మన ఇళ్లలో లభించే కొన్ని రకాల వస్తువులతోనే హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకుంటుందట. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రెండు కలబంద కొమ్మలు తీసుకుని.. వాటిలో కలబంద గుజ్జును తీసుకోవాలి. దీన్ని పక్కనపెట్టేసి, చేతులు నిండేంత మందార పూలను తీసుకోవాలి. వీటిలో రెండు స్పూన్ల పెరుగును కలపాలి.

20 నిమిషాల పాటు..
పై పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో బాగా కలపాలి. ఆ తర్వాత మన కురుకులకు బాగా రాసుకోవాలి. అలా కురులన్నింటినీ ఆ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత మంచి నీటితో కురులను క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం జుట్టును నీటితో కడుక్కోవాలి.

అందమైన జుట్టు..
మీరు కూడా ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల శ్రద్ధా కపూర్ వంటి అందమైన జుట్టు మీ సొంతం కావడం ఖాయం. ఎందుకంటే కలబందలో కురుల కుదుళ్లను బలపరిచే గుణం ఉంటుంది. మందారపూలు కూడా కురులను స్మూత్ మార్చేందుకు సహాయం చేస్తుంది. కాబట్టి.. తరచుగా ఈ హెయిర్ ప్యాక్ ను వాడటం వల్ల మీ కురులు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడటం మీకు కుదరకపోతే.. కనీసం వారానికోసారైనా దీన్ని కచ్చితంగా ఉపయోగించాలి.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన కురులను బలంగా ఉంచుకునేందుకు కొన్ని రకాల హెయిర్ ఆయిల్ ను కచ్చితంగా రెగ్యులర్ గా వాడుతుందట. ముఖ్యంగా ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ ని ఎక్కువగా ఉపయోగిస్తుందట. తన జట్టుకు నూనె రాసుకున్న తర్వాత, తన కురులను షాంపూతో శుభ్రం చేసుకుంటుందట. జుట్టును శుభ్రం చేసుకున్న తర్వాత.. కురులపై సీరంను వాడుతుందట. వీటితో కలబంద హెయిర్ ప్యాక్ ను కూడా వాడుతుందట.



Click it and Unblock the Notifications
