Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ జుట్టు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్ ఉంచేవి పెరుగు మరియు గుడ్డు మాత్రమే!!..ఎందుకంటే?
మీ జుట్టు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్ ఉంచేవి పెరుగు మరియు గుడ్డు మాత్రమేై!!..ఎందుకంటే?
జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, చుండ్రు మరియు ఇతర అనేక జుట్టు సమస్యల్లో జుట్టు రాలడం చాలా ప్రధానమైనదిగా ఉంటుంది. కానీ ఈ సమస్యలను పరిష్కరించడానికి, జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటం కోసం మనం ఏ పద్ధతులను ఉపయోగించవచ్చో చూద్దాం. జుట్టు రాలడం మరియు జుట్టు ఆరోగ్యానికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. జుట్టు రాలడం నివారించి, జుట్టు స్ట్రాంగ్ గా, ఆరోగ్యంగా, మంచి షైనింగ్ తో ఉండాలంటే హై ప్రోటీన్ కలిగిన గుడ్డు ఉపయోగించాలి. ఇందులో జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి.
గుడ్డుతో పాటు, కొద్దిగా పెరుగు కలిపితే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ప్రతి ఒక్కరిలో ఉన్న చిన్న మరియు పెద్ద సమస్యలను కూడా ఈ రెండింటితో పరిష్కరించుకోవచ్చు. మరి ఈ రెండింటిని ఉపయోగించి ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా చేయాలో తెలుసుకోండి. మన జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే గుడ్డు పెరుగు మిశ్రమాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం.

అవసరమైన వస్తువులు
కావలసినవి ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు లేదా మూడు టీస్పూన్ల పెరుగు. ఈ రెండింటిని ఒక బౌల్లోతీసుకిని పేస్ట్‌లా కలపాలి. తరువాత పది నిమిషాల పాటు మీ జుట్టు మీద రాయండి. ఇది మీ జుట్టుకు మంచిది. ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది, కాబట్టి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. 15 నిమిషాల తరువాత, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం.

జుట్టుకు బలం
గుడ్డు మరియు పెరుగు మిశ్రమాన్ని తలకు హెయిర్ మాస్క్ గా వేసుకోవడం ద్వారా ప్రధానంగా జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. ఈ రెండింటి కలయిక కేవలం జుట్టు రాలడం ఆపడం మాత్రమే కాదు, బలహీనమైన వెంట్రుకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. పెరుగులో జుట్టురాలడం నివారించే గుణాలు ఉన్నాయి. అంతే కాదు ఇది చుండ్రును నివారించడంలో గొప్ప కండీషనర్ గా పనిచేస్తుంది . కాబట్టి జుట్టు బలంగా.. ఆరోగ్యంగా.. ఉండాలంటే ఉపయోగించాల్సిన మార్గాల్లో ఇది ఒకటి. ఇది మీ జుట్టును బలోపేతం చేయడమే కాదు, మరికొన్నిఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
గుడ్డు-పెరుగు మిశ్రమంతో తయారుచేసే ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టుకు మెరుపును అందిస్తుంది. జుట్టుకు మంచి మృదుత్వాన్ని అందిస్తుంది. జుట్టు, ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా మరియు మృదువుగా ఉంచడంతో పాటు జుట్టుకు చక్కని షైనింగ్ ను ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని మీరు వారానికి కనీసం మూడు సార్లు ఉపయోగించవచ్చు.

చుండ్రును తొలగించడానికి
చుండ్రును తగ్గించడానికి మీరు గుడ్డు హెయిర్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. చుండ్రుకు ఇది ఉత్తమమైన చికిత్స అనడంలో సందేహం లేదు. దీన్ని కనీసం 20 నిమిషాలు తలకు అప్లై చేసి ఉంచండి. ఈ హెయిర్ మాస్క్ చుండ్రుతో పాటు ఇతర సమస్యలను కూడా ప్రభావవంతంగా తగ్గిస్తుంది .

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి
జుట్టు పెరగడానికి వివిధ రకాల నూనెలు రాయడం చాలా మందికి అలవాటు. కానీ అలాంటి పరిస్థితులకు మీరు ఇప్పుడు వీడ్కోలు చెప్పవచ్చు. ఈ హెయిర్ మాస్క్ దేశంలో ఉత్తమ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లోకంటే ఉత్తమమైనది. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చాలా సహాయపడుతుంది.

జుట్టుకు మంచి నలుపు రంగు న్యాచురల్ గా అందిస్తుంది
ఆరోగ్యకరమైన జుట్టు యొక్క మొదటి లక్షణాలలో ఒకటి మంచి జుట్టు రంగు. కానీ చాలా మందికి ఇలా ఉండదు. కొంత మందిలో తెల్ల జుట్టు, కొంత మందికి ఎర్రగా, బ్రౌన్ గా , గ్రేకలర్లో వివిధ రకాల రంగుల్లో జుట్టు ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, మంచి జుట్టు రంగును పొందడానికి మీరు ఈ హెయిర్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ మాస్క్ వల్ల మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, ఎటువంటి సందేహం లేకుండా, ఈ హెయిర్ మాస్క్‌ను మీ తలకు మాస్క్ లా వేసుకోవచ్చు.

చిన్న వయస్సులోనే హెయిర్ ఫాల్
చాలా చిన్న వయస్సులోనే జుట్టు రాలడానికి పరిష్కారాల కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు. కానీ పెరుగు మరియు గుడ్లు మిశ్రమంలో తయారుచేసుకునే హెయిర్ మాస్క్ మీ జుట్టును బలంగా, ఆరోగ్యంగా మరియు మంచి రంగును పెంచడానికి మరియు చిన్న వయస్సులో జుట్టు రాలే సమస్యను తొలగించడానికి ఒక అద్భుతమైన ఎంపిక. ఇది చిన్న వయస్సులో జుట్టు రాలే సమస్యను పూర్తిగా తొలగిస్తుంది. ఈ మాస్క్ వారానికి కనీసం రెండు సార్లు వేసుకుంటే ఉత్తమ ఫలితం పొందవచ్చు.

జుట్టు చివర్లు చిట్లకుండా
చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటి జుట్టు చివర్లు చిట్లడం. ఈ సమస్యని పరిష్కరించడానికి ఎగ్ హెయిర్ మాస్క్ ఒకటి. గుడ్డు, పెరుగు రెండింటినీ కలపడం వల్ల మీ జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. ఇది మీ జుట్టును బలోపేతం చేయడంతో పాటు ఈ సమస్యను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది.

న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది
గుడ్డులో ఉండే విటమిన్ ఎ, ఇ మరియు ఫొల్లెట్ మీ జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. నిర్జీవంగా , పొడిబారిన జుట్టును తిరిగి పునరుత్తేజపరుస్తుంది.

న్యాచురల్ షైనింగ్ ఇస్తుంది:
గుడ్డులో ఉండే ప్రోటీన్ మీ జుట్టును నల్లగా మిళమిళ మెరిసేట్లు చేస్తుంది.



Click it and Unblock the Notifications











