For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు కెరాటిన్ చికిత్స అంటే ఏమిటి మరియు దాని దుష్ప్రభావాలు ఏమిటి?

|

స్త్రీ అందం కేవలం ఆమె ముఖం మాత్రమే కాదు,ఆమె జుట్టు కూడా ఆమె మొత్తం అందాన్ని రెట్టింపుచేసి సౌందర్యంగా కనిపించేలా చేస్తుంది. మీరు పొడవైన, ఒత్తైన మరియు అందమైన జుట్టు కలిగి ఉంటే అందం మరింత రెట్టింపు అవుతుంది. కానీ పొడవాటి జుట్టును నిర్వహించడం కూడా కష్టం ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్ట్రెయిట్ హెయిర్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది జుట్టుకు మరింత సొగసైన రూపాన్ని ఇస్తుంది. కానీ నిజమైన జుట్టుకు చాలా వత్యాసం కనబడుతుంది.

ఈ రోజుల్లో, కెరాటిన్ చికిత్సతో జుట్టును స్ట్రెయిట్ గా మార్చుతుంది. కెరోటిన్ చికిత్స కర్లీ హెయిర్ ను నుండి ఉపశమనం కలిగించడమే కాదు, వదులుగా ఉండే జుట్టును సరిచేస్తుంది, జుట్టుకు మంచి ఆకారాన్ని ఇస్తుంది మరియు దాని ప్రకాశాన్ని పెంచుతుంది. గతంలో, కొంతమంది జుట్టును నిఠారుగా చేయడానికి హెయిర్ ఐరన్ మరియు బ్లో డ్రైయర్ ఉపయోగించారు. కానీ ఇది మరింత కఠినమైనది. జుట్టుకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అంతే కాదు, కొంతమంది మహిళలకు ఈ చికిత్స సరిపోకపోవచ్చు. వారి జుట్టును దెబ్బతీస్తుంది. కానీ కెరోటిన్ చికిత్స ఇప్పుడు చాలా మంది మహిళలు మరియు హెయిర్ స్టైలిస్టుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వ్యాసంలో మనం కెరోటిన్ థెరపీ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం ...

కెరాటిన్ చికిత్స అంటే ఏమిటి?

కెరాటిన్ చికిత్స అంటే ఏమిటి?

కెరోటిన్ జుట్టులోని ప్రోటీన్. కెరాటిన్ పుష్కలంగా ఉంటే, అప్పుడు జుట్టు నిటారుగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. ఆహారం మరియు జీవనశైలి మార్పులు గత కొన్నేళ్లుగా జుట్టులో కెరాటిన్ స్థాయి తగ్గడానికి దారితీసింది. ఇది జుట్టు పొడిగా మరియు పల్చగా మారడానికి కారణం అయ్యాయి. కెరాటిన్‌తో చికిత్స చేసినప్పుడు జుట్టుకు కృత్రిమంగా కెరాటిన్ ఇస్తారు. ఇది జుట్టును మరింత మృదువుగా, ప్రకాశవంతంగా మరియు మెరిసేలా సహాయపడుతుంది. అందువల్ల దీనిని స్త్రీపురుషులు ఎంతో అభినందిస్తున్నారు.

ఇది ఎలా పని చేస్తుంది?

ఇది ఎలా పని చేస్తుంది?

హెయిర్ స్టైలిస్టులు కెరాటిన్ కలిగిన షాంపూ మరియు కండీషనర్‌తో తలస్నానం చేయాలి. ఇది పొడిగా ఉంటుంది మరియు జుట్టు నుండి తేమను తొలగిస్తుంది. దాని తరువాత, కెరాటిన్ సొల్యూషన్ ను జుట్టుకు అప్లై చేసి బ్రష్ తో దువ్వాల్సి ఉంటుంది. కెరోటిన్ ద్రవాన్ని తలకు అప్లై చేసి కొద్ది సమయం అలాగే ఉంచాలి . ఈ తేమను సహజంగా ఆరనివ్వాలి. తడి ఆరడానికి బ్లో డ్రైయర్‌ను ఉపయోగించడం వల్ల మళ్ళీ జుట్టు నుండి తేమ తొలగిపోతుంది మరియు ఈ ద్రవం తలలో ఉండటానికి ఐరనింగ్ ఉపయోగపడుతుంది. జుట్టు పొడవును బట్టి తల ఆరడానికి కనీసం రెండు గంటలు పడుతుంది. చికిత్స తర్వాత మూడు రోజులు తలస్నానం చేయకూడదు. చివరగా, మీరు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మృదువైన మరియు స్ట్రెయిట్ హెయిర్ ను పొందుతారు.

కెరాటిన్ చికిత్స అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు. ప్రయోజనాలు ఏమిటో మరియు దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకోండి.

మొదట పరీక్షించండి

మొదట పరీక్షించండి

మీరు సెలూన్ కు వెళ్ళే ముందు, కెరాటిన్ చికిత్స మీ జుట్టుకు సరిపోతుందో లేదో చెక్ చేయండి. మీ స్నేహితులకు ఇలాంటి జుట్టు ఉంటే అది మీకు సరిపోతుందని కాదు. చిన్న జుట్టు మరియు వదులుగా ఉండే జుట్టు ఉన్నవారికి కెరాటిన్‌తో చికిత్స చేయవచ్చని హెయిర్ స్టైలిస్ట్‌లు అంటున్నారు. మీడియం స్ట్రెయిట్ హెయిర్ ఉన్నవారు ఈ చికిత్సను విస్మరించాలని మీకు చెప్తారు.

మీరు కెరోటిన్ చికిత్స ప్రయత్నించే ముందు హెయిర్ స్టైలిస్ట్‌ను సంప్రదించండి. మీరు నమ్మకమైన మరియు అనుభవజ్ఞుడైన హెయిర్ స్టైలిస్ట్‌ను ఎంచుకోవడం మంచిది. మీరు హెయిర్ స్టైలిస్ట్‌తో మాట్లాడి, అది మీకు సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. ప్రతి కెరాటిన్ చికిత్స సమానంగా చేయబడదు. మీరు ఈ చికిత్స చేసే ముందు దీని గురించి తెలుసుకోండి. ఇది జుట్టు యొక్క పొడవును బట్టి సర్దుబాటు చేయబడుతుంది. మొదట రేటు అడగడం మర్చిపోవద్దు.

ప్రయోజనాలు లేదా వాస్తవాలు

ప్రయోజనాలు లేదా వాస్తవాలు

కెరాటిన్ చికిత్స జుట్టుకు చాలా సురక్షితం

• ఇది జుట్టును చాలా ప్రకాశవంతంగా చేస్తుంది మరియు శుభ్రపరుస్తుంది

• జుట్టు చాలా మృదువుగా మరియు సిల్కీ అవుతుంది

• ఇది స్త్రీపురుషులకు అనుకూలంగా ఉంటుంది.

•ఎటువంటి దుష్ప్రభావాలు నిరూపించబడలేదు

•జుట్టును నిటారుగా ఉంచడానికి స్ప్రే లేదా జెల్ అవసరం ఉండదు.

•సులభంగా స్టైల్ చేయవచ్చు.

అపోహలు

అపోహలు

•కెరోటిన్ ఉపయోగించిన రసాయనం చర్మాన్ని చికాకుపెడుతుంది మరియు కళ్ళలో నీరు వస్తుంది.

•కొన్ని సందర్భాల్లో ఇది అలెర్జీని కలిగిస్తుంది. దద్దుర్లు మరియు దురదలకు కారణం కావచ్చు.

• ఇది చాలా ఖరీదైన చికిత్స

• గర్భిణీ స్త్రీలు దీన్ని చేయకూడదు.

నిపుణులైన హెయిర్ స్టైలిస్ట్ మాత్రమే దీన్ని చేయాలి.

• ప్రత్యేక సల్ఫేట్ షాంపూ & కండీషనర్ దీర్ఘకాలం ఉపయోగించబడుతుంది.

•నిర్మాణ వస్తువులు మరియు గృహోపకరణాలలో ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ అనే రసాయన వాడకం చాలా విమర్శలకు గురిచేసింది.

English summary

Keratin Treatment For Hair: Pros And Cons

Keratin Treatment For Hair: Pros And Cons.Read to know more about it..
Story first published: Wednesday, January 1, 2020, 12:40 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more