Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
RRR హీరోయిన్ ఆలియా భట్ పోనీటైల్ హెయిర్ స్టైల్ ను చూసెయ్యండి...
RRR హీరోయిన్ ఆలియా భట్ పోనీటైల్ హెయిర్ స్టైల్ లో మరింత బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ భాషాకు సంబంధించిన సినిమా తారలైనా మన కళ్లకు ఎప్పుడూ అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే వారు కేవలం మేకప్ కారణంగానే అందంగా కనబడతారనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే.

ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది అందమైన భామలు మేకప్ లేకుండా కూడా తమ ఫొటోలను నిత్యం సోషల్ మీడియాలో పంచుకుని.. తాము రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా అందగత్తెలమని నిరూపించుకుంటున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే... RRR హీరోయిన్ ఆలియా భట్ తాజాగా పోనీటైల్ హెయిర్ స్టైల్ లో కొంచెం కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించింది.

ఇలాంటి హెయిర్ స్టైల్ సాధారణంగా కాసుయెల్స్ లో తయారవుతుంది. మీకు కూడా ఇలాంటి స్టైల్ కావాలంటే.. పార్టీ లేదా ఫంక్షన్లకు ఇలాంటి హెయిర్ స్టైల్ ను ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనలో చాలా మంది ఏదైనా ఒక పార్టీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా డ్రస్సులపై ఎక్కువ ఫోకస్ పెడతుంటాం. అయితే హెయిర్ స్టైల్స్ గురించి చాలా సార్లు గందరగోళ పడుతూ ఉంటాం.

అయితే మీరు కొంచెం కొత్త హెయిర్ స్టైల్ కావాలని కోరుకుంటున్నారా? నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే పోనీటైల్ హెయిర్ స్టైల్ ద్వారా అందరిలో మీరే అందంగా కనిపిస్తారు. బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్ కూడా ఈ పోనీటైల్ హెయిర్ స్టైల్ లో చాలాసార్లే కనిపించింది. ఇది కేవలం పార్టీలకు, ఫంక్షన్లకు మాత్రమే కాదు.. సాధారణ సమయంలో సులభంగా వేసుకోవచ్చు. ఈ సందర్భంగా RRR అందాల భామ ఆలియా భట్ పోనీటైల్ హెయిర్ స్టైల్స్ పై ఓ లుక్కేద్దాం రండి...

వెడ్డింగ్ ఫంక్షన్లో..
బాలీవుడ్ ముద్దుగుమ్మ RRR హీరోయిన్ ఆలియా భట్ ఈ పోనీటైల్ లుక్ తో ఓ వెడ్డింగ్ ఫంక్షన్లో ఇలా కనిపించి అందరి కంటే అందంగా కనిపించింది. ఇందులో ఆలియా బ్లూ కలర్ లెహెంగాతో గజిబిజిగా ఉండే పోనీటైల్ హెయిర్ స్టైల్ తో మరింత అందంగా కనిపించింది. ఇందుకోసం ఆమె లైట్ వేవ్ లుక్ ఇచ్చింది. తను రోటీన్ కు బదులుగా.. ఈసారి పోనీటైల్ హెయిర్ స్టైల్ ఎంచుకుంది. మాంగ్టిక్ సహాయంతో ఆమె ఈ హెయిర్ స్టైల్ ను సొంతం చేసుకుంది.

పోనీటైల్ లుక్..
మీరు ఆఫీసులో జరిగే ఏదైనా ఫంక్షన్ కు వెళ్లే టైమ్ లో కూడా ఈ హెయిర్ స్టైల్ ను ఫాలో అవ్వొచ్చు. ఆలియా భట్ హెయిర్ స్టైల్ మాదిరిగా మీరు వేవ్స్ పోనీటైల్ రూపాన్ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ముందుగా జుట్టు మధ్యలో దువ్వెనను ఉంచండి. తర్వాత మీ జుట్టుకు కర్లీ హెయిర్ రూపాన్ని ఇవ్వండి. ఇలా చేస్తే మీరు చాలా సులభంగా పోనీటైల్ చేయొచ్చు. ఇది చాలా సొగసైన మరియు స్టైలీష్ హెయిర్ స్టైల్.

పార్టీ లుక్ పోనీటైల్..
పోనీటైల్ హెయిర్ స్టైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే.. మీరు దీన్ని అనేక రకాలుగా ప్రయత్నించవచ్చు. మీరు హెయిర్ పార్టింగ్ చేయాలనుకున్నా లేదా వద్దనుకున్నా అది మీ ఇష్టం. ఈ లుక్ లో బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్ కూడా హెయిర్ పార్టింగ్ చేయకుండా పోనీటైల్ లుక్ లో కనిపించింది. ఈ స్టైల్ లో ఆమె తన అందాన్ని మరింత పెంచుకుంది.
ఆలియా భట్ పోనీటైల్ కేశాలంకరణ మీకు ఎలా అనిపించింది.. నచ్చిందా.. నచ్చలేదా అన్న విషయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయగలరు.
ఈ సందర్భంగా తన కొత్త లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసెయ్యండి...



Click it and Unblock the Notifications
