Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
సాధువుల హెయిర్ స్టైల్ వెనుక ఉన్న అసలు రహస్యం..!!
సాధువుల హెయిర్ స్టైల్ వెనుక ఉన్న అసలు రహస్యం..!!
హిందూ ధర్మంలో ఆధ్యాత్మికం, ధ్యానంకు చాలా ప్రత్యేక ఉంది. పూర్వం నుంచి సాధువులు, మత గురువులు ఆధ్యాత్మికం, ధ్యానంకు ఎంతో ప్రధాన్యత ఇచ్చే వారు. సాధువులు ఇల్లు, వాకిలి, సంసారం త్యాగం చేసి ఏదో ఒక దేవాలయంలో లేదా హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటున్నారు. సాధువులు అనేక మందికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సాధువులు అందరూ రకరకాల ఆచారాలు పాటిస్తారు.
అయితే సాధువులు అందరిలో ఉండే సామాన్య లక్షణాలు వారి తల వెంట్రుకల్లో కనపడుతాయి. చాల పొడువగా ఉన్న తల వెంట్రుకలను సాధువులు రకరకాలు అలంకరించుకుంటారు. సాధువుల తల వెంట్రుకల వెనుక చాల రహస్యాలు ఉన్నాయని చరిత్ర చెబుతుతోంది.

1. ఎందుకు
సాధువులు అంటే ఎవరు ?
హిందూ ధర్మంలో సాధువులు అంటే ధార్మిక తపస్వి, పవిత్రమైన వ్యక్తి. మోక్షం కోసం పాధువులు ధ్యానం చేస్తుంటారు. సాధువులు ఎప్పుడూ మాసిన దుస్తులు ధరిస్తుంటారు. సన్యాసులకు సంకేతం మానిసన దస్తులతో పాటు బూడిద రంగు దస్తులు వేసుకోవడమే అని పెద్దలు చెబుతుంటారు.

సాధువుల రూపం ఓ ప్రత్యేకత
సాధువుల వేషం వేసుకోవాలని మీరు ఎవరికైన చెప్పారా అంటే చాల మంది చెప్పే సమాధానం లేదు అనే మాట. సాధువులు రూపం మనుసులో పెట్టుకునే వాళ్లు చాల మంది ఉంటారు. బూడిద రంగు బట్టలు, మెడలో రుద్రాక్షలు, నుదిటి మీద విభూది లేదా కుంకుమ, గంధంతో పెట్టుకున్న తిలకం, చేతిలో కమండలం, తల మీద పోడువుగా, గుబురుగా ఉన్న వెంట్రుకలతో సాధువులు సామాన్య ప్రజలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంటారు.

సాధువుల తల వెంట్రుకుల ప్రత్యేకత
ప్రతి ఒక్క సాధువు తల వెంట్రుకలు చూస్తే అశ్చర్యం కలుగుతుంది. సాధువులు తల వెంట్రుకల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. మహాకుంబ మేళలో అనేక మంది సాధువులు వారి తల వెంట్రుల విషయంలో తీసుకునే జాగ్రత్తలపై చాలా మంది ఆసక్తిగా వివరాలు సేకరించిన సందర్బాలు ఉన్నాయి.

సాధువుల తల వెంట్రుకల ప్రత్యేకత
సాధువులు తల వెంట్రుకల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరని, వాటిని శుభ్రంగా పెట్టుకోరని, తల వెంట్రుకల గురించి అసలు పట్టించుకోరని చాల మంది భావిస్తుంటారు. అయితే వారి ఆలోచనలు చాత తప్పు అనే విషయం మహాకుంభ మేళలో అనేక మంది సాధువులు చెప్పారు. నిజానికి సామాన్య ప్రజలు తల వెంట్రుకుల విషయంలో తీసుకునే జాగ్రతల కంటే సాధువులు ఇంకా ఎక్కవ జాగ్రతలు తీసుకుంటారని వెలుగు చూసింది.

సాధువుల హెయిర్ స్టైల్ సాధ్యం కాదు
ఒక సాధువు సాటి సాధువు తల వెంట్రుకలను ప్రత్యేకంగా అలంకరిస్తారు అనే విషయం నేరుగా చూస్తే చాల మంది ఆశ్చర్యం కలుగుతోంది. సాధువు సాటి సాధువు తల వెంట్రుకలను పెద్ద సూదితో విడదీసి దారంతో ముడివేస్తుంటారు. తరువాత సూదితోనే తల వెంట్రుకల ఒక ప్రత్యేక ఆకారం వచ్చేలా చూస్తారు. చివరికి తల వెంట్రుకల చివరిలో ఆ పెద్ద సూదిని అడ్డంగా గుచ్చుతారు. సాధువు తల మీద ఉన్న వెంట్రుకలను బన్ను ఆకారంలో గుండ్రంగా ఉండేలా చేసి తరువాత వాటిని పోడవుగా వదిలి పెట్టేస్తారు. సాధువుల హెయిర్ స్టైల్ ను పాటించడం మనకు మాత్రం సాధ్యం కాదు.

సాధువుల హెయిర్ స్టైల్ కు ఎన్ని గంటలు !
సాధువులు తల వెంట్రుకలు శుభ్రం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. తల వెంట్రుకలు శుభ్రం చేసుకోవడం సాధువులకు చాల కష్టంతో కూడుకున్న పని చెబుతుంటారు. తల వెంట్రుకలు అలంకరించుకోవడానికి సాధువులు చాల సమయం కేటాయిస్తుంటారు.

సాధువుల సొంత షాంపో
తల వెంట్రుకలను పెద్ద సూదితో విడదీసి దారంతో అల్లుకోవడం సాధువుల ప్రత్యేకత. తల వెంట్రుకలను సాధువులు విడివిడిగా ముడి వేస్తుంటారు. తల వెంట్రుకలు అందంగా ఉండే వరకూ సాధువులు వాటిని చక్కగా అలకంరించుకుంటారు. సాధువులు ప్రత్యేకంగా వారు సొంతంగా తయారు చేసుకున్న షాంపోతోనే తల వెంట్రుకలు శుభ్రం చేసుకుంటారు. సొంతంగా తయారు చేసుకున్న నాటు రకం షాంపోతో తల వెంట్రులు శుభ్రం చేసుకుంటే అందంగా, ఆకర్షనీయంగా, పొడవుగా ఉంటాయని సాధువులు చెబుతుంటారు.

నెల రోజులు అలాగే ఉంటాయి
సాధువులు ఒక్కసారి తల వెంట్రుకలు శభ్రం చేసుకుని వాటిని చక్కగా జడ వేసుకుంటే సుమారు నెల రోజుల పాటు అలాగే ఉంటాయి. ఒక సారి తల వెంట్రుకలు శుభ్రం చేసుకుంటే మరో నెల రోజుల పాటు తల వెంట్రుకల గురించి సాధువులు పెద్దగా ఆలోచించరని సమాచారం. తల వెంట్రుకలు కాపాడుకోవడం కోసం ప్రత్యేకంగా నూనెను వాడరని తెలిసింది.

సాధువుల హెయిర్ స్టైల్ ఓ ట్రెండ్
సాధువుల హెయిర్ స్టైల్ ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. ఇటీవల కాలంలో యువకులు, విదేశీయులు సాధువులు లాగా తల వెంట్రుకలను ప్రత్యేకంగా అలంకరించుకుంటున్నారు. సాధువుల హెయిర్ స్టైల్ ను యువకులు, విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారు. 21వ దశాభ్దంలో విదేశీయులు ఎక్కువగా భారతదేశ సంసృతికి అలవాటు పడ్డారు. ముఖ్యంగా సాధువుల హెయిర్ స్టైల్ ఓ ట్రెండ్ గా మారిపోయింది. మీరు ఎప్పుడైనా సాధువులను ప్రత్యక్షంగా చూస్తే వారి తల వెంట్రుకల విషయంలో తీసుకునే జాగ్రత్తలు, ప్రత్యేక ఆకర్షణ గురించి మీకే స్వయంగా అర్థం అవుతోంది.



Click it and Unblock the Notifications