Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
కవ్వించే కళ్ళ కోసం...పాటించాల్సిన చిట్కాలు...!
మన దగ్గర మేకప్ కిట్ ఉంటే చాలు చాలా రకాలుగా ఉపయోగపడుతుంటుంది. మేకప్ కిట్ లో ఉదాహరణకు లిప్స్ స్టిక్ ఇది మీ పెదాలను అందంగా... ఆకర్షణీయంగా కవ్వించడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఐలైనర్ తో అంత కంటే ఆకర్షణీయంగా కళ్ళు కట్టిపడేస్తాయి. ఐలైనర్ తో కళ్ళకు మంచి ఆహారాన్ని (షేప్) ఇవ్వొచ్చు. అయితే అందుకు మంచి క్వాలిటీ ఐలైనర్ నే వినియోగించుకోవాలి. కాబట్టి ప్రతి మహిళా మేకప్ కిట్ లో ఐలైనర్ అనేది కూడా అందాన్ని బహిర్గతం చేసేదే. కాబట్టి మేకప్ ఫైనల్ టచ్ ఇవ్వడానికి మేకప్ కిట్ లో అన్నింటికి అన్ని ప్రాధన్యతలు ఉన్నాయి. సాధారణంగా మహిళలు ఎక్కువగా మేకప్ వేసుకోవడం ఎందుకంటే ...? అందంగా కనిపించడం కోసమే. ఐతే ఆ కనిపించడంలో మరింత ఆకర్షణయంగా మరికాస్త గ్లామరస్ గా కనపించాలంటే కొన్ని మేకప్ మెళకువులు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మేకప్ వేసుకొనే వారు వారి మేకప్ షైనింగ్ లుక్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. అందుకు కొన్ని చిట్కాలు....మీకోసం...

డార్కెనింగ్ ఐబ్రోస్(కనుబొమ్మలు నలుపు): నల్లటి లేదా బాగా ముదురు రంగు ఐలైనర్‌ని వాడకండి. ఇవి మీ కళ్లని ఫొటోల్లో చిన్నవిగా కనిపించేలా చేస్తాయి. ఐబ్రో హేయిర్ పలుచగా ఉన్నప్పుడు మేకప్ వేసుకోవాడనికి సులభంగా ఉంటుంది. అదే ఐబ్రో హెయిర్ మందంగా ఉన్పప్పుడు మేకప్ వేసుకోవడం కష్టమవుతుంది. ఐ లైనర్ వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా సమయంలేనప్పుడు ఐ లైనర్ ఉపయోగించకపోవటమే మంచిది. హడావుడిగా ఐ లైనర్ ఉపయోగిస్తే రెండూ కళ్లు రెండు రాకాలుగా కన్పించే అవకాశం ఉంది. లేత ఛాయలో ఉండే ఐ లైనర్ వేసుకోండి. ఎక్కడైన ముద్దగా వచ్చినట్లు కనిపిస్తే స్పాంజితో తుడిచేయండి. ఐలైనర్ వాడేటప్పుడు కళ్ల నుండీ కొంచెం యబటి వరకూ పెట్టుకోవాలి. దీని కోసం డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యే బ్లూ, బ్లాక్, బెజ్ గ్రాన్ కలర్లను తీసుకోవచ్చు. కళ్లను హైలైట్ చేయడానికి షీగ్రీన్ షాడోను పెట్టుకోవచ్చు.
మస్కార అలంకరణ: నయనాల అందాలను మరింత వన్నేతెచ్చే మస్కారాను అవసానికి మించి వాడితే ఎబ్బేట్టుగా ఉంటుంది. మస్కారా బాటిల్ ను ఏటవాలుగా వంచి మస్కారా స్టిక్ తో కొద్దిగా అద్దుకొని ఒకటికి మించి కోటింగులు వేస్తునట్లయితే మొదటి కోటింగ్ పూర్తిగా ఆరేవరకు రెండోది వేయకూడదు. మస్కారాని ఎల్లప్పుడు వాటర్‌ప్రూఫ్ దే వాడాలి. కింది రెప్పకి వాడకూడదు. మొహానికి సరిగ్గా సమంగా ఉందో లేదో చూసుకుని ఆపై పౌడర్‌ని వేసుకోండి. ఎందుకంటే పౌడర్ వేసుకున్నాక అప్పుడు ఫౌండేషన్‌కి సంబంధించిన మార్పులు చేయటం కుదరదు.
గ్రే కలర్ ఐలైనర్: ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళల్లో కురులు గ్రే కరల్ లో మార్చుకోవడం మీరు గమనించే ఉంటారు. అలాంటి వారు గ్రే కలర్ ఐలైనర్ వినియోగిస్తే సరిపోతుంది. గ్రేకలర్ ఐలనర్ వద్దనుకొన్న వాళ్ళ డార్క్ లిక్విడ్ కలర్ ఐలైనర్ ను వినియోగించవచ్చు.
ఐబ్రో కలర్: ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమలు దిద్దుకునేవారు అవసరానికిమించి లేదా సరిపడనంత కాకుండా చూసుకోవాలి. కనుబొమల రంగు జట్టు రంగు ఒకే విధంగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.
ఐ షాడో: మహిళలలో చాలామందికి ఐ షాడో ఎలా వేసుకోవాలనే విషయంపట్ల అవగాహన ఉండదు. ఐ షాడో వేసుకున్నా తర్వతా, ఎక్కువైంది అని మీకు అనిపిస్తే బ్రష్‌తో మృదువుగా తొలగించండి. లేదంటే మీ చర్మానకి దగ్గరగా ఉండే ఫౌండేషన్ ఓ చుక్క వేసి రాయండి. అప్పుడు ఐ షాడో రంగు తగ్గుతుంది.
బ్లషర్: చర్మం అసలు రంగులోనే మరింతగా మెరుపును సంతరించేదుకు వాడే విధానన్ని బ్లష్ అని అంటారు. దవడ ఎముకలపై మీకు నప్పే రంగు బ్లష్ అనవసరమైన మేరకే తీసుకుని ఎక్కడా ఎక్కువ తక్కువలు కాకుండా బ్రష్ సాయంతో సమంగా వేసుకోవాలి. చర్మరంగును పోలిన లూజ్ పౌడర్ లేదా కాంపాక్ట్ పౌడర్ రాసుకున్నా సరిపోతుంది.
మార్పు అనేది జీవితంలో అత్యంత సహజం. కనుక మేకప్ చేసుకునే విధానంలోనూ మార్పులు తెచ్చుకొని అందరినీ దృష్టిని మీ వైపున ఆకర్షించుకోండి మరి.



Click it and Unblock the Notifications











