Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
ఇంటి వద్ద మేకప్ తొలగించే ఉత్తమ చిట్కాలు
మగువులు ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ఆ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో చిట్కాలు, మెళుకువులు పాటిస్తుంటారు. అయితే వారు వాడే కొన్ని సౌందర్య సాధనాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవటంవల్ల, కొన్ని పొరపాట్లు జరిగి కొంత నష్టపోవాల్సి వస్తుంది. ఆ పొరపాట్లేమిటో తెలుసుకోగలిగితే, వాటిని సరిదిద్దుకోగలుగుతాము. బాహ్యసౌందర్య కోసం మేకప్ ఎలా వేసుకొంటామో..ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటామో వాటిని రిమూవ్ చేసేటప్పుడు అన్నే జాగ్రత్తలు పాటించగలిగినప్పుడు చర్మాన్ని కాపాడుకోవచ్చు.
రాత్రి పడుకునే ముందు ముఖానికి వేసుకున్న మేకప్‌ను తప్పనిసరిగా తీసేయాలి. మేకప్ తీసివేయటానికి సబ్బు వాడకుండా క్లెన్జింగ్ మిల్క్ రాసుకుని, తరువాత సున్నితంగా మేకప్ తీసేసి, ముఖాన్ని వేడినీటితో కడుక్కుని, మాయిశ్చరైజర్ క్రీమ్‌గానీ, లోషన్ గానీ రాసుకోవాలి. అలా కాకుండా సబ్బు వాడటంవల్ల మేకప్ పూర్తిగా పోదుకదా, సబ్బు ప్రభావం చర్మంమీద పూర్తిగా పడుతుంది. ముఖాన్ని సబ్బుతో అదేపనిగా రుద్దటంవల్ల ముఖ చర్మం ఎండిపోయి ర్యాషెస్ (దద్దుర్లు) రావటం, ఇంకా పిగ్మెంటేషన్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి, మేకప్ ను రిమూవ్ చేయడానికి కొన్ని సులభ చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి.

బాదం మిల్క్:
బాదం పాలను పాదం నుండి తీస్తారు . ఇవి ఇతర పాలలోలాగే వీటిలో ల్యాక్టోజ్ ఉండదు. బాదంలను నీటిలో నానబెట్టి, తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి వాటి నుండి పాలు తీస్తారు. ఈ పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కాటన్ బాల్స్ ను బాదం పాలలో డిప్ చేసి ముఖం మీద నిధానంగా తుడవాలి. తర్వాత చల్లిటి నీటితో ముఖంను శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ
కీరదోసకాయలో మాయిశ్చరైజింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది చర్మానికి చల్లదనాన్ని అందించడంతో పాటు, రిఫ్రెష్ చేస్తుంది. మేకప్ తొలగించడం వల్ల చర్మం డ్రై గా మారకుండా కాపాడుతుంది. ఇది ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. కీరదోస ముక్కలను ముఖం మీద మసాజ్ చేయవచ్చు, లేదా రసాన్ని ముఖానికి పట్టించి తొలగించవచ్చు

సోయా మిల్క్ అండ్ బనానా
సోయా మిల్క్ మరియు అరటి పండు: అరటిపండు మరియు సోయా మిల్క్ ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ దీన్ని మేకప్ తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్స్ మేకప్ ను తొలగిస్తాయి మరియు చర్మంలో దుమ్ము, మురికిని తొలగిస్తుంది. అరటిపండును ముక్కలుగా కట్ చేసి చిదిమి అందులో కొద్దిగా సోయా మిల్క్ వేసి రెండింటిని బాగా మెత్తగా గుజ్జులా చేసి ముఖానికి పట్టించి శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్, ఆరోగ్యాకిని చాలా మేలు చేస్తుంది అలాగే అలాగే మేకప్ తొలగించడానికి బెటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి ఒక నేచురల్ పదార్థం. ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా హాజెల్ మిక్స్ చేసి తర్వాత ముఖానికి పట్టించాలి. ఆలివ్ ఆయిల్ లో మాయిశ్చరైజింగ్ లక్షణాలుండుట వల్ల ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఇది చర్మ రంధ్రాల ఏర్పడకుండా మరియు డ్రై స్కిన్ నివారిస్తుంది.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో అధిక సాచురేటేడ్ కంటెంట్ ఉంటుంది. కానీ ఇది చాలా హైడ్రేషన్ కలిగి ఉంటుంది . ఇది చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తుంది. మేకప్ ను చాలా సులభంగా తొలగిస్తుంది. కళ్ళ వద్ద చాలా సులభంగా తొలగిస్తుంది. మరియు ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

క్లెన్సింగ్
ఇలా మేకప్ ను సులభంగా తొలగించడానినకి సహాయపడే ఈ వస్తువులు మన వంటగదిలో అందుబాటులో ఉంటాయి . కాబట్టి, ఇలా సహజంగా లభించే నేచురల్ పదార్థాలను ఉపయోగించి మేకప్ ను తొలగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications