Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
ముఖ సౌందర్యానికి ఖరీదైన క్రీములు వద్దు కలబందే ముద్దు

ముఖ సౌందర్యానికి మహిళలు ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేనందుకు దిగాలు పడుతుంటారు. కానీ ఎలాంటి ఖర్చులేకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సాధనంగా కలబంద పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణం ఉంది. కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా తయారవుతుంది. శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలిన గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతా యంటున్నారు ఆరోగ్య నిపుణలు.
కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమా న్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చ లు తగ్గుతాయి. ఉదయం పరగడుపున కలబంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. రోజ్ వాటర్ లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమ వుతాయి. రేగు చెట్టు ఆకులు కానీ, పండ్లుకానీ, బెరడుకానీ కలబందతో కలపి సబ్బులు, మాయిశ్చరైజర్ క్రీములను తయారు చేస్తారు. ఈ క్రీము ముఖానికి రాసుకోవడం వల్ల ముడతలను మాయం కావడంతో పాటు సన్ స్క్రీన్ గానూ పనిచేస్తుంది. అలాగే ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications
