Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
అందమైన ముఖం పైన ముడతలా....?

1. ముఖం, మెడ, శరీరంలో ఏర్పడే ముడతలను తొలగించాలంటే కోడిగుడ్డును సౌందర్యసాధనంలా ఉపయోగించవచ్చు. కోడిగుడ్డులోని తెల్ల సొనలో నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడ, శరీరంలో ముడతలు ఏర్పడ్డ చోట పూయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. తెల్లటి సొన చర్మంలో ఏర్పడ్డ ముడతలను పటిష్టవంతంగా తాయారు చేస్తుంది. దీంతో వదులుగానున్న చర్మం, ముడతలు పడ్డ చర్మం బిగుతుగా తయారై మరింత అందంగా కనబడుతారు.
2. రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి అప్లై చేయాలి. అది ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల పాటు రెగ్యులర్‌గా చేస్తే సరి.
3. అరటి పండును గుజ్జును ముఖానికి రాసి అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
4. క్యారెట్ జ్యూస్ లో పాలు కలపండి. దీనికి బాదం పలుకుల పొడిని జత చేసి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి.
5. ప్రతి రోజూ బాదం నూనెతో ముఖానికి మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
6. బీట్ రూట్ రసం రెగ్యుల్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు.
7. ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అపె్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
8. తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అప్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
9. ఆపిల్ ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే ముఖంపైన ముడతలు తగ్గి చర్మ నిగారింపు పెరుగుతుంది.
10. బాగా పండిన టొమాటోలో, అయిదారు టీ స్పూన్ల పచ్చిపాలు తీసుకుని రెండిటినీ కలిపి గ్రైండ్ చేసి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలపాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాక బయటకు తీసి అందులో కాటన్‌బాల్స్‌ని ముంచి ముఖమంతా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.



Click it and Unblock the Notifications
