Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
శీతాకాలంలో చర్మం పగుళ్ళు నుండి కాపాడే 5 ఫేస్ మాస్కులు
చర్మ సౌందర్యానికి మిగిలిన కాలాల్లో తీసుకొనే జాగ్రత్తల కంటే శీతాకాలంలో మరికొంత ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాతవరణలో మార్పుల వల్ల చర్మ పగుళ్ళు ఏర్పడి, తడి ఆరిపోయి, గీతలు ఏర్పడి అందవిహీనంగా కనబడుతారు కాబట్టి. కొన్ని రకాల ఫేస్ మాస్క్ లను ఉపయోగించడ వల్ల సున్నితమైన... నునుపైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది. పూర్వం మహిళలు తమ సౌందర్యం కోసం సహజ పద్దతులతో తమ సౌందర్యాన్ని కాపాడుకొనే వారు. ప్రస్తుత కాలంలో కూడా అలాంటి నేచురల్ పద్దతులను ఉపయోగించడం వల్ల టాక్సిన్, క్లెన్సింగ్, పొడిబారడం, డ్రై స్కిన్ కలవారు ఈ శీతాకాల ఫేస్ మాస్క్ లను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి...

అవకాడో ఫేస్ మాస్క్
అవకాడో ఫేస్ మాస్క్ పొడిబారిన చర్మానకి చాలా ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తుంది. ముఖంగా శీతాకాలంలో చర్మం పొడిబారి దురదగా ఉండటం వంటి లక్షణాలను అవకాడో ఫేస్ మాస్క్ పోగొడుతుంది. తాజాగా ఉన్న అవాకోడోను బాగా మెత్తగా చేసి దానికి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేషియల్ మాస్క్ చర్మానికి కావాలసిన మినరల్స్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్స్ అందించి చర్మాన్ని నునుపుగా మార్చుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారనీయకుండా చేస్తుంది.

కల్చర్డ్ మిల్క్ మాస్క్
కల్చర్డ్ మిల్క్ మాస్క్ చాలా సులభమైనటువంటి చర్మ సంరక్షణ పద్దతి. దీంతో చర్మం అలసిన చర్మం తేజోవంతంగా మారుతుంది. అందుకు ఒక మిక్సింగ్ బౌల్ ల్లో కొద్దిగా పెరుగు, మజ్జిగ, సోర్ క్రీమ్ ను వేసి బాగా మిక్స్ చేసి కళ్ళు మాత్రం వదిలి మిగిలిన ముఖ భాగం అంతా అఫ్లై చేయాలి. పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల చలికాలంలో చల్లగాలి, మంచు వల్ల చర్మ పొడి బారీ, పగుళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.

ఎగ్ వైట్ ఫేస్ మాస్క్
గుడ్డులోని తెల్ల సొన ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్ వైట్ తీసుకొని దాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మీ చర్మం మునపటి కంటే చాలా ఆరోగ్యంగా కనబడుటయే కాకుండా జిడ్డును వదిలించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాదు ముఖ చర్మం వదులుగా లేకుండా టైట్ చేస్తుంది. చలికాలంలో దీన్ని వేసుకోవడం వల్ల చలినుండి, మంచు నుండి చర్మాన్ని కాపాడుతుంది.

ఓట్ మీల్ ఫేస్ మాస్క్
శీతాకాలంలో చర్మాన్ని రక్షించడంలో ‘ఓట్ మీల్' చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఓట్ మీల్ కు గుడ్డులోని తెల్లసొన మరియు తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంలో తడి ఆరిన తర్వాత గమనించినట్లైతే ముఖం తాజాగా..నునుపు మారడాన్ని గమనిస్తారు.

బనానా ఫేస్ మాస్క్
చలికాలం, శీతాకాలం, వర్షాకాలంలో చర్మాన్ని రక్షించుకోవడం కొంచెం ఇబ్బదికరమైన విషయమే. సున్నితమైన చర్మ తత్వం కలవారు శీతాకాలంలో సున్నితమైనటువంటి బనానా ఫేషియల్ మాస్క్ వేసుకోవడం చాలా మంచిది. బాగా పండిన అరటిపండును బాగా మెత్తగా చేసి అందులో తాజాగా ఉన్నటువంటి స్వీట్ క్రీమ్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట పాటు అలా ఉండాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా.. మృదువుగా ప్రకాశంతంగా మారుతుంది. శీతాకాలంలో చలిగా ఉందనో, చర్మ పొడిబారి గీతలు పడుతుందనే అనుకోవాల్సిన పనిలేదు ఎప్పుడైనా ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications