Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
ఆడవాళ్లకు మాత్రమే కాదు...మగ మహరాజులకు కూడా...

ఓ క్యారెట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది.. ప్రతి రోజూ నాలుగు క్యారెట్లు తింటే రెండంటే రెండు నెలల్లో మీ శరీరం ఆకర్షణీయంగా తయారవుతుందని పరిశోధనలు చేసి మరీ నిరూపించారు బ్రిటీష్ శాస్త్ర వేత్తలు. గుండెజబ్బుల్ని ఆమడ దూరంలో ఉంచవచ్చనీ చెబుతున్నారు. చూడ గానే తినాలని పించే క్యారెట్ లో అందాన్ని ఆకర్షణను పెంచే గుణాలున్నాయట. క్యారట్ తో పాటు సీజనల్ ఫ్రూట్స్, ప్లమ్స్ తింటే ఇంకా మంచిది. బ్రిటన్ లోని బ్రిస్టల్ యూని వర్శిటీకి చెందిన సెయింట్ ఆండ్రూస్ నేతృత్వంలో ఓ బృందం పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ప్రకటించింది. అందం కోసం తపించే ఆడవాళ్లు మాత్రమే కాదు... అందంగా, ఆనందంగా ఉండాలనుకునే మగ మహరాజులు దర్జాగా ఈ చిట్కా ఫాలో కావచ్చు.
కొద్దినీటిలో క్యాబేజీని ఉడకబెట్టి ఆ నీరు చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మచ్చలు, నల్లబడటం పోయి చర్మం నునుపుగా ఉంటుంది.
కేరట్ ను తురిమి కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తగా రుబ్బి ఈ ముద్దని మెడ, చేతులకి నాలుగైదుసార్లు చొప్పున రాయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి సమృద్ధిగా విటమిన్లు చేకూరుతాయి.
చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు క్యారెట్‌కు తొక్క తీయకుండా తురిమి ఎండబెట్టాలి. 50 గ్రాము క్యారెట్ ఎండు తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది.
కొన్ని బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. ఒక క్యారెట్ కు తొక్క తీయకుండా ముక్కలు చేసి, వాటికి బాదంపప్పును కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పూసి అరగంట తరువాత స్నానం చేయాలి. ఈ పదిహేను రోజులకు ఒకసారి చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది.
మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనంపొడి చేర్చి ముఖానికి బాగా అప్లై చేయాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటలతరబడీ మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.
ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం తోడ్పడుతుంది. వేసవిలో జుట్టు చివర్లు పగిలిపోయినట్లయితే.. క్యారెట్ ఆకులకు కాస్తంత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు పూసుకుని పెసరపిండిని తలకు మర్దిస్తూ స్నానం చేసినట్లయితే.. జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.
ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించేందుకు.. క్యారెట్, క్యాబేజీ, టమోటో ముక్కలను సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి పేస్టులా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగిన తరువాత నూరిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఐదు నిమిషాల తరువాత మునివేళ్లతో వలయాకారంలో మర్దనా చేయాలి. ఆరిన తరువాత చన్నీటితో ముఖం కడిగేయాలి. ఆ తరువాత ముల్తానీ మట్టితో ముఖం, మెడకు ప్యాక్ వేసుకుని, కాసేపాగి శుభ్రం చేసుకోవాలి. చివరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకుంటే, చర్మం తాజాదనంతో మిలమిలా మెరిసిపోతుంది.



Click it and Unblock the Notifications
