Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
నవ యవ్వనంగా కనబడాలంటే చాక్లెట్ ఫేషియల్స్...!

ఇంట్లో తయారు చేసుకొనే చాక్లెట్ ఫేషియల్ కు కావాల్సిన పదార్థాలు: అత్యధిక నాణ్యత కలిగిన డార్క్ చాక్లెట్ బార్ మరియు స్వచ్చమైనటువంటి తేనె. ఈ రెండు వస్తువులు సాధారణంగా నిత్యవసర వస్తుల దుకాణాల్లోనూ లేదా ఫుడ్ షాప్స్ లో లభిస్తాయి. ఇవి కొంచెం ఖరీదే అయినప్పటికీ, ఈ రెండిటిని ఉపయోగించడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది.
ఇంట్లో తయారు చేసుకొనే చాక్లెట్ ఫేషియల్ చాలా సులభం. ఒక సాస్ పాన్ లో డార్క్ చాక్లెట్ బార్ ను చిన్న ముక్కలుగా చేసి వేసి తక్కువ మంట మీద చాక్లెట్ కరిగే వరకూ వేడి చేయాలి. చాక్లెట్ పూర్తిగా కరిగిన తర్వాత స్టౌ మీద నుండి పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులో స్వచ్చమైన తేనె కలుపుకోవాలి. ఈ రెండిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన ఈ పదార్థాన్ని గోరు వెచ్చగా అయ్యేంత వరకూ పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. వేడిగా వేసుకొంటే చర్మానికి హాని కలుగుతుంది. దీన్ని ముఖానికే కాదు, స్నానం చేయడానికి పది నిమిషాల ముందు శరీరానికి కూడా బాగా పట్టించి తర్వాత స్నానం చేయవచ్చు. అలా చేయడం వల్ల చాక్లెట్ మాస్క్ చర్మ గ్రంధులపైనా బాగా పనిచేసి చర్మాన్ని ప్రకావంతంగా మెరిసేలా చేస్తుంది.
చాక్లెట్ ను ముఖానికి లేదా శరీరానికి పట్టించిన అరగంట తర్వాత షవర్ బాత్ చేసుకోవాలి. చాక్లెట్ తడిసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చేతులతో ముఖం, శరీర భాగాన్ని బాగా మర్ధన చేయాలి. ఆ తర్వాత పూర్తిగా స్నానం చేస్తే మీ చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. చాక్లెట్ ఫేషియల్ తో సున్నితమైనటువంటి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. చాక్లెట్ ఫేషియల్ తో యూత్ గా కనబడవచ్చు.
మీరు కూడా మీ చర్మం, శరీరం సహజ సిద్దంగా మార్చుకోవాలి. శరీర ఛాయలలో మార్పు కోరుకొనే వారు ఈ హోం మేడ్ చాక్లెట్ రిసిపిని ప్రయత్నించవచ్చు.



Click it and Unblock the Notifications
