Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఐస్ క్యూబ్స్ తో ముఖంలో మెరుపులు..!మొటిమలు-మచ్చలు మాయం...!?

సాధారణంగా సున్నా డిగ్రీల సెల్సెస్ వద్ద నీరు ఘనీభవించి మంచు ముక్కలా తయారవుతుందని మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో చదువుకున్నాం. అదే ఫార్ములాను ఉపయోగించి డీప్ ఫ్రిజ్‌లో ఐస్ క్యూబ్ ఫ్రేమ్ బాక్స్‌లో నాలుగుపలకలుగా తయారుచేసుకునేవిధంగా అందులో నీరుపోసి ఉంచితే అది గడ్డకట్టి ఐస్ ముక్కలు తయారవుతాయి. వాటితోనే అనేక రకాల వైద్య విధానంలోనూ ఉపయోగిస్తున్నారు. అలా వైద్య విధానాల్లోనే కాకుండా. శరీర సంరక్షణ, దెబ్బలు తగినప్పుడు, శరీరం బెణికినప్పుడు, గొంతులో గరగర, కాలిన గాయాలకు మరియు చర్మ సంరక్షణకు కూడా ఈ ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐస్ ఫేస్ మసాజ్ ఇంట్లో ఎలా చేసుకోవాలోమరి ఆ చిట్కాలేంటో చూద్దాం....
ముందుగా మీ ముఖానికి నప్పే ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ కోసం కృత్రిమపద్దతులు, రసాయనాలతో తయారు చేసినటు వంటివి కాకుండా సహజంగా ఇంట్లో దొరికేటటువంటి వస్తువులు, పండ్ల రసాల, శెనగపిండి, పెరుగు, రోజ్ వాటర్, నిమ్మరసం వంటి వాటితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. వీటిలో ఏదేని ఒక వస్తువుతో ముఖం, మెడకు ప్యాక్ వేసుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ తీసుకొని ముఖం, మెడ మీద బాగా మర్ధన చేయాలి. ఐస్ క్యూబ్ తో ముఖం మీద మసాజ్ చేసేటప్పుడు మొదట నుదుటి బాగం నుండి మొదలు పెట్టి, కళ్ళు వరకూ సున్నితంగా మసాజ్ లేదా మర్దన చేయాలి. అలా చేయడం వల్ల ముందుగా వేసుకొన్న ఫేస్ ప్యాక్ ఐస్ ముక్కల తేమతో మొత్తబడి ముఖం అంతా సులభంగా మర్ధన చేయడానికి సహాయపడుతుంది.
మరొక్క చిట్కాల ఏంటంటే ఎసెన్సియల్ ఆయిల్స్, శరీరానికి, చర్మ సంరక్షణకోసం ఉపయోగించేటటువంటి నూనెలు(రోస్ మెరీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, మరియు రోజ్ వాటర్ ఇవన్నీ ఒక బౌల్ లోనికి తీసుకొని బాగా మిక్స్ చేసి అందులో ఐస్ ముక్కను ముంచి ముఖం అంతా మసాజ్ చేయాలి. ఆయిల్ ప్లస్ ఐస్ క్యూబ్ తో మాయిశ్చరైజ్ లా ఉపయోగపడుతుంది. ఇది మాయిశ్చరైజర్ గానే కాకుండా ముఖం చర్మాన్ని సున్నితంగా, నునుపుగా మార్చడానికి బాగా సహాయపడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు కనుక చేసినట్లైతే కాంతివంతమైన చర్మంతో మీలో మార్పును గమనించవచ్చు. ఒక వేళ ఎసెన్సియల్ ఆయిల్స్ ఇంట్లో లేనట్లైతే మరేదైనా ఫేస్ ప్యాక్ వేసుకొని ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవచ్చు.
గుర్తుంచుకోవల్సినవి: 1. ఐస్ ముక్కలతో ఐదు నిమిషాల మాత్రమే మసాజ్ చేసుకోవాలి. తర్వత చల్లటి నీటితో ముఖం, మెడ శుభ్రం చేసుకోవాలి. లేదంటే ముఖం ఎరుపు రంగులోకి మారిపోతుంది. మంట పుడుతుంది.
2. ఐస్ క్యూబ్స్ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి చర్మం మంటపుట్టడం, ఎరుపు రంగులోనికి మారడం జరుగుతుంది. అటువంటప్పుడు 30-45లోపు మాత్రమే మసాజ్ చేసుకోవాలి. లేదంటే అలర్జీ అయ్యే ప్రమాదం ఉంది.
3. ఐస్ క్యూబ్స్ డైరెక్ట్ గా ఉపయోగించడం ఇబ్బందికరమైతే, ఐస్ బ్యాగ్ లేదా ఒక కటాన్ క్లాత్ లో ఐస్ క్యూబ్ ను పెట్టి మసాజ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది.
4. ఐస్ క్యూబ్స్ చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఐస్ క్యూబ్ మసాజ్ చేయడం వల్ల చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. ముఖంలో, కళ్ళ క్రింద ముడుతలను పోగొడుతుంది. చర్మంలో నున్న రంధ్రాలను పూడ్చివేస్తుంది. ఐస్ క్యూబ్స్ మొటిమలు, మచ్చలను పోగట్టడమే కాకుండా ఎండ వేడిమి నుండి రక్షణ కల్పిస్తుంది. బయట నుండి ఇంటికి రాంగానే ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకొంటే ఎంతో హాయిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
