Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
చర్మ సోయగానికి ఇంటి చిట్కాలు...

1. నిమ్మరసం: చాలా తేలిక అయిన చిట్కా ఇది. టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత ముఖం కడుక్కుంటే మిలమిల మెరుస్తుంటుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
2. పెరుగు: ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. అందుకనే పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.
3. పాలు: ముఖం మీద మురికిని తొలగించడానికి పాలు బాగా ఉపకరిస్తాయి. రాత్రి పడుకోవడానికి ముందు పాలతో ముఖం మీద ఉన్న మురికిని తొలగించి అనంతరం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. పాలు చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడంలో బాగా ఉపకరిస్తుంది. చర్మంలోపలిదాకా వెళ్ళి మురికిని తొగించడమే కాకుండా ర్మం మెరిసేలా చేస్తుంది.
4. టమోటో రసం: టమోటో రసాన్ని స్నానాకి ముందు ముఖం అంతా పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం న్నానం చేస్తే మంచిది.
5. ఓట్ మీల్: ఓట్ మీల్, బాదం పప్పులను పొడిచేసి దానిలో పాలు, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరమంతా పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తే మంచిది.
6.శాండిల్ ఉడ్: శాండిల్ ఉడ్ పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
