Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో అత్యంత మధురమైన, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. అయితే ఈ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో ముంబైకి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా గర్భిణీ స్త్రీల కోసం ఒక అద్భుతమైన ఇంటి చిట్కాను పంచుకున్నారు.
బాలీవుడ్ నటి కరిష్మా తన్నా పాడ్ కాస్ట్ లో శ్వేతా షా మాట్లాడుతూ..రోజూ ఒక అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లుకుని తినడం వల్ల గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది అని సూచించారు. తన గర్భధారణ సమయంలో శ్వేత చెప్పిన ఇలాంటి ఎన్నో పోషకాహార చిట్కాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని కరిష్మా తన్నా కూడా సమయంలో చెప్పింది.

ఈ చిట్కా వల్ల కలిగే లాభాలు ఏంటి?
అరటిపండు, యాలకుల కలయిక కేవలం రుచిని పెంచడమే కాకుండా, గర్భిణీలకు సంపూర్ణ పోషణను అందిస్తుంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు, గర్భం దాల్చిన మొదటి నెలల్లో వేధించే వికారం, మార్నింగ్ సిక్ నెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అలాగే గర్భిణీలలో తరచుగా కనిపించే కండరాలు పట్టేయడం వంటి సమస్యలను పొటాషియం అడ్డుకుంటుంది. ఇక,గర్భవతులను వేధించే గ్యాస్, ఛాతీలో మంట, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి.
ఆందోళనను జయించండిలా..
గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల మనసులో ఎన్నో భయాలు, ఆందోళనలు రేకెత్తుతాయి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందా?, తల్లిగా నా బాధ్యతలు సరిగ్గా నెరవేర్చగలనా?, డెలివరీ ఎలా అవుతుంది? ఇలాంటి ప్రశ్నలతో పాటు ఆర్థిక, కుటుంబ ఒత్తిళ్ల వల్ల గర్భిణీలు ఆందోళన చెందడం సహజం.
మొదటిసారి తల్లి అవుతున్నవారిలో ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడేందుకు కూడా ఈ అరటిపండు-యాలకుల చిట్కా సహాయపడుతుందని శ్వేతా షా అంటున్నారు.
నిపుణుల సలహా
అయితే కేవలం అరటిపండు, యాలకులు తిన్నంత మాత్రానే ఆందోళన పూర్తిగా మాయమవుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటుగా మాత్రమే చూడాలి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
