Latest Updates
-
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
బ్లాక్ హెడ్స్... వైట్ హెడ్స్ తొలగించే టమోటో స్ర్కబ్...

1. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు ఒక టమాటాను గుజ్జులా చేసి వడకట్టాలి. దీనికి కొద్దిగా కీరదోస రసం కలిపి దూదితో ముఖమంతా రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి.
ఎండ, అతి వేడి వల్ల చర్మం ఎర్రగా మారి కమిలిపోతుంది. టమాటా గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులు, పాదాలకు పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. టమాటా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక పెరుగు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించి మృదువుగా మారుస్తుంది.
2. టమాటాల్లోని ఆమ్లాలు యాక్నె సమస్యను చాలామటుకు నివారిస్తాయి. అదెలాగంటే.. యాక్నెను నివారించేందుకు వాడే క్రీంలలో ఎక్కువగా ఎ, సి విటమిన్లు ఉంటాయి. టమాటాల్లోనూ ఈ పోషకాలతోపాటు కె విటమిన్ కూడా లభిస్తుంది. యాక్నె సమస్య చాలా తక్కువగా ఉన్నట్లయితే..టమాటా ముక్కను తీసుకుని ముఖమంతా రాసుకుని కాసేపు వదిలేయండి. టమాటా గుజ్జును పూతలా వేసుకోవాలి. తరచూ చేస్తుంటే.. క్రమంగా మార్పు వస్తుంది.
3. తాజా టమాటా రసం ఓ టేబుల్ స్పూను తీసుకుని నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖమంతా రాసుకోవాలి. సవ్యదిశలో మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లనినీటితో కడిగేసుకోవాలి. చర్మంపై పేరుకున్న అధికజిడ్డు, మురికి వదులుతుంది.
4. టమాటారసం చిక్కని మిశ్రమం అయ్యేదాకా తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత కడిగేయాలి. ఎండ కారణంగా నల్లగా మారి జీవం కోల్పోయిన చర్మానికి మెరుపునందించే పూత ఇది. అలాగే కీరదోస, తేనె టమాటా గుజ్జు కలిపి రాసుకున్నా కూడా తేడా కనిపిస్తుంది.
5. చర్మంలో తెరుచుకున్న గ్రంథులు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఎక్కువగా వేధిస్తుంటే... టమాటాను స్త్లెసులా కోసి.. ముఖమంతా రుద్దాలి. ఇందులోని పొటాషియం, విటమిన్ సి సుగుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి.
6. టమాటాతో ఇంట్లోనే క్లెన్సర్ ను తయారు చేసుకోవచ్చు. టమాటాగుజ్జుకు సమపాళ్లలో పాలు కలపాలి. దీన్ని సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ప్రతిరోజు ముఖం, మెడకు రాసుకుని మునివేళ్లతో మర్దన చేయాలి. పదినిమిషాలయ్యాక చల్లనినీటితో కడిగేసుకుంటే.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
7. ఎండ కారణంగా కమిలి ఎర్రగా మారిన చర్మానికి రెండు చెంచాల టమాటాగుజ్జులో నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ కలిపి చర్మమంతా రాసుకోవాలి. అరగంటాగి కడిగేసుకుంటే తేడా ఉంటుంది.



Click it and Unblock the Notifications
