Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
స్కిన్ అలర్జీ...సహజ పద్దతులతో చర్మ సంరక్షణ...!

నీళ్ళు: చర్మం సంరక్షణకు నీళ్ళు బాగా పనిచేస్తాయి. చర్మం ఎప్పుడూ తేమగా ఉండేటట్లు చేయడానికి నీళ్ళు ఎక్కువగా తాగాలి. నీళ్ళు సహజమైనటువంటి చర్మం సౌందర్యాన్నిస్తుంది. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ఒంట్లో ఉండే మలినాలు బయటికు పంపించి, చర్మాన్ని కాంతివంతంగా, ముడుతలు లేకుండా కాపాడుతుంది.
నూనెను మర్దన చేయడం: కొబ్బరినూనె చర్మం సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి శరీరానికి మర్ధన చేసి అరగంట తర్వాత స్నానం చేసినట్లైతే చర్మం నునుపుదేలుతుంది. స్కిన్ అలర్జీ ఉన్నవారు, ఏ చర్మ తత్వం ఉన్నవారైనా సరే కాటన్ ఫాబ్రిక్స్ ను వేసుకోవడం మంచిది.
నిమ్మరసం: చర్మం అలర్జీకి నిమ్మరసం కూడా దివ్వ ఔషదం. ఎలాగంటే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో , కాటన్ బాల్స్ ను ముంచి అల్లర్జీ ఉన్నచోట పూతాలా పూసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే మరొక చిట్కా నిమ్మరసంలో కొబ్బరినూనె ను మిక్స్ చేసి అలర్జీ ఉన్న చర్మానికి పూతలా రాసి ఒక రాత్రంతా అలాగే వదిలేస్తే అలర్జీ నుండి ఉపశమనం పొందవచ్చు.
వేపాకు పేస్ట్: వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ ఔషదం. ముఖ్యంగా చర్మానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ అలర్జీనుండి విముక్తినిస్తుంది. వేపాకులను ఆరు నుండి ఎనిమిది గంటలపాటు నీటిలో నానబెట్టి తర్వాత పేస్ట్ చేసుకొని, శరీరం మొత్తం పూతలా రాసి అరగంట నుండి ముప్పావు గంట సేపు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే చర్మంకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు.
గసగసాలు: మిక్సీలో గసగసాలను వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాసినట్లైతే, చర్మం సమస్యలు నివారిస్తుంది.
స్నానం: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల ఎటువంటి చర్మసమస్యలు ధరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా స్నానానికి ఎక్కువగా వేడినీళ్లు కాకుండా, చల్లనీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. చల్ల నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా అవుతుంది దాంతో శరీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. పైన పేర్కొన్న చిట్కాన్నీ ఇంట్లో సహజపద్దతుల్లో చేసుకొంటే ఎటువంటి సమస్యలుండవు. తర్వాత కూడా స్కిన్ అలర్జీ తగ్గకుండా ఉంటే ప్రత్యేక స్కిన్ స్పెషలిస్ట్ ను సంప్రదించండి..



Click it and Unblock the Notifications