Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మగవారి చందాన్ని తీర్చిదిద్దండిలా...!?

మగవారిలో చర్మం సంరక్షణ: సాధారణంగా మహిళల చర్మం కన్నా మగవారి చర్మం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. దానికి అనుగుణంగా వారి చర్మ రంధ్రాలు పెద్దవిగా ఉండడంతో, ఎక్కువగా దద్దుర్లు లాంటి సమస్యలకు అవి దారి తీస్తాయి. తగిన ఫేస్ వాష్ తో రోజులో ప్రతి మూడు, నాలుగు గంటలకొకసారి ముఖం కడుక్కుంటూ ఉండడం చాలా ముఖ్యం. తేమగా ఉంచే పదార్థాలను ముఖానికి రాయవచ్చు.
పొడి చర్మం చర్మం కలిగిన వారు మాయిశ్చరైజర్ లు కలిగిన ఫేస్ వాష్ లను ఉపయోగిస్తే బాగా ఉపయోగం ఉంటుంది. స్నానం చేయడానికి ఉపయోగించే సబ్బును ముఖం కడుక్కోవడానికి వాడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే దాని వల్ల చర్మం పొడిబారే సమస్య ఉంది. మగవారు ఎక్కువగా బయట తిరగాల్సి వస్తుంది. ఎండలో తిరగాల్సి వచ్చిన వారు సన్ బ్లాక్ జెల్, లేదా లోషన్ ను తప్పనిషరిగా ఉపయోగించాలి. ఏడాది పొడవునా దీనిని వాడవలసిందే. అది చర్మ అవసరాలకు తగ్గట్టుగా సరైన సన్ బ్లాక్ ఫార్ములాను ఎంచుకోవాలి. ఎస్ పి ఎఫ్ 30 లేదా 40 చాలా బాగా సరిపోతుంది.
చర్మం మీద రంగు మచ్చలు ఏర్పడడానికి కారణం ఎండ సరిపడకపోవడం గానీ, వారసత్వంగా వచ్చిన స్వభావం గానీ కావచ్చు. పైపూతల సాయంతోనూ, సాధనాల సాయంతోనూ లేదా ప్రక్రియలతోనూ వాటికి చికిత్స చేయాల్సి ఉంటుంది. హర్మోన్ లు ఎక్కువగా ఉండటం వల్ల కూడా జిడ్డు చర్మం, అతిగా చెమలలు కారడం, చర్మం మీద గుంతలు పడడం జరగవచ్చు. దీనికి రసాయనిక పూతలు వేసి కడిగివేయడం, చర్మాన్ని రుద్ది మృతకణాలు మొదలైన వాటిని తొలగించడం, కలోన్ ఇండక్షన్ థెరఫీ, గుంతలు పూడ్చడానికి లేజర్ ట్రీట్ మెంట్ల వంటి చికిత్సలు చేయవచ్చు.
మేని ఛాయ, మేని కాంతి అంతటా సమానంగా ఉండకపోవడడానికి కారణం చర్మ ఆరోగ్యం పట్ల సరైన శ్రధ్ధతో వ్యవహరించకపోవడం గానీ, విటమిన్ లోపాలు గానీ కావచ్చు. దీనికి కూడా ఇంటిలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ రసాయనిక పూతలతో మలినాలను తొలగించడం, చర్మం పాలిషింగ్, జల చికిత్సల్లాంటివి సరిపోతాయి.



Click it and Unblock the Notifications