Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
లేలేత గులాబి లాంటి పెదాల కోసం....

1. రాత్రి పడుకోబోయే ముందు పెదాలకు ఆల్మడ్ ఆయిల్ ను పెదాలకు రాసుకొని పడుకోవాలి. తెల్లవారి నిద్రలేవగానే పత్తితో పెదాలను తుడిచి బ్రెష్ చేసుకోవాలి.
2. ముఖం కడుకొన్నాక తేమమీదనే మెత్తగా ఉండే టవల్ తో పెదాలపై రుద్దినట్లైతే డెడ్ సెల్స్ తొలగిపోతాయి.
3. పెదాలు గరుకుగా ఉండి చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటే రోజుకు మూడు లేదా నాలుగుసార్లు పగిలిన పెదాలపై తేనె పూయండి. ఇలా నాలుగు-ఐదు రోజులపాటు చేస్తే పెదాలు గులాబీ రేకుల్లా సుతిమెత్తగా తయారవుతాయి.
4. నిమ్మరసం మరియు పాల మీగడను రెండింటి తీసుకొని పెదాలకు రాసి, ఒక గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పెదాలు గులాబీ రేకుల్లా సుతిమెత్తగా తయారవుతాయి.
5. కొందిరికి పెదాలపై పొక్కులు లేస్తుంటాయి. దాంతో గరుకుగా తయారవుతాయి. పొక్కులనుంచి ఉపశమనం పొందాలంటే మరో చిట్కా మీ కోసం. గోరింటాకు (మెహందీ) వేర్లు, బాదం నూనె 60 మిల్లీ గ్రాములు, 15గ్రాముల మైనం(వ్యాక్స్)ను తీసుకోవాలి. గోరింటాకు వేర్లను బాగా దంచుకొని. దంచుకున్న వేర్లను బాదం నూనెలో పది రోజుల వరకు నానబెట్టాలి. పది రోజుల తర్వాత నూనెను వడగట్టండి. మైనంను వేడి నీటిపైవుంచి కరగబెట్టుకోండి. ఈ మూడింటిని మిశ్రమంలా కలుపుకుని మీ పెదాలకు పూయండి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులపాటు చేస్తే పెదాలు గులాబీరేకుల్లో సుతిమెత్తగా తయారవుతాయి.
6. కాఫీలు..టీలు...సిగరేట్లు లాంటివి ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే..వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల పెదాలు బ్లాక్ గా మారుతాయి.



Click it and Unblock the Notifications
