Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
కొబ్బరిపాలతో కోమలమైన చర్మం సౌందర్యం...!
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు. అయితే పని ఒత్తిడి, అలసట, సమయాభావం వంటి కారణాలతో తగిన పోషణ తీసుకోలేకపోతుంటారు. తరచూ సౌందర్యశాలకు వెళ్లి మెరుగులు దిద్దుకోవాలంటే కష్టమైన విషయమే. అలాంటప్పుడు ఇంట్లోనే ఉంటూ అందుబాటులో ఉండే కొబ్బరి పాలతో మేని మెరుపునకు ప్రయత్నించవచ్చు. కొబ్బరి ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. దాని నుంచి తీసిన పాలు ఔషధ గుణాల మిళితం వాటిని ఆహాంరంలోనే కాదు...అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకూ వాడితే..ప్రకాశవంతమైన చర్మం సొంతమవుతుంది.

మేని కాంతిమంతంగా: దుమ్ము, ధూళి దాంతో పాటే కాలుష్యం ప్రభావంతో చర్మం కళ కోల్సోతుంది. నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది. ఈ సమస్యకు పరిష్కారం ప్రయత్నించాలంటే మాత్రం కొబ్బరి పాలను ఉపయోగించాల్సిందే అంటారు నిపుణులు కాసిని గులాబీ రేకలు, చెంచా తేనె, అరకప్పు కొబ్బరి పాలను బకెట్ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. దాని వల్ల శరీరానికి తగిన తేమ అంది మేని కాంతిమంతంగా తయారవుతుంది.
క్లెన్సర్ తో మెరిసేదిలా: అసలే చెమట, దానికి తోడు చర్మం పై పేరుకొన్న మురికి కొందరిని వేధిస్తుంది. దాంతో మొటిమలు, ఇతర చర్మ సంబంధ సమస్యలు సరేసరి. అలాంటప్పుడు ఇంటికి వచ్చాక కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పది నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే మోముపై పేరుకొన్న మురికి తొలగి తాజాగా ఉంటుంది.
మృతకణాలు వదిలి మృదువుగా: శరీరం పై మృతకణాలు పెరిగితే చర్మం బరకగా కనిపిస్తుంది. కాంతి తగ్గుతుంది. ఇలాంటప్పుడు కప్పు కొబ్బరి పాలల్లో, రెంచా చొప్పున బాదం, తులసి పొడులు, రెండు చుక్కల తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిసాల తర్వాత కాసిన్ని నీటితో తడిపి నలుగులా రుద్దాలి. తర్వాత గోరువెచ్చెని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే మృత కణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.
శిరోజాల వృద్దికి: అందంగా తేలియాడే కురులు సొంతం కావాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే వివిధ కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. ఇలాంటి సమస్యలెదురైనప్పుడు కొబ్బరి పాలతో చికిత్స ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె కలిపి తలంతా రాసుకోవాలి. ఆ మిశ్రమంలో సహజంగా ఉండే పొటాషియం, పోలేట్ తో పాటూ ఇతర ఖనిజాలు కురులకు అంది ఆరోగ్యంగా మారతాయి. అలాగే హెన్నా చేసుకొనేప్పుడు కొబ్బరి పాలు కలిపితే జుట్టు మెరుస్తుంది. ఒత్తుగా మారుతుంది.
పాదాల అందానికి : ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసే శరీరబాగం పాదాలు. వీటిని శుభ్రంగా ఉంచడంతో పాటూ అందంగా కనిపించేలా చేయడంలో కొబ్బరి పాలు లఎంతో మేలుచేస్తాయి. చిక్కని కొబ్బరి పాలల్లో కొన్ని తేనెచుక్కలు, రెండు టేబుల్ స్పూన్ల బియ్యపురవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్ధన చేయాలి. తర్వాత చన్నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే మృదువైన పాదాలు మీ సొంతమవుతాయి.



Click it and Unblock the Notifications