Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
రోజ్ స్టీమ్ ప్యాక్ తో ప్రకాశవంతమైన మోము...!

గులాబీ రేకులను ఓ పాత్రలో మరిగించాలి. నీటి నుంచి పొగలు వస్తున్నప్పుడు ముఖానికి బాగా ఆవిరి పట్టించాలి. అలా పదినిమిషాలు ఉన్న తర్వాత మెత్తని టవల్ తో తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ రోజ్ స్టీమ్ తో చర్మం శుభ్రపడుతుంది. నల్లమచ్చలు క్రమంగా తొలగిపోయి ముఖం ప్రకాశవంతం అవుతుంది.
అలాగే తాజాగా ఉన్న రోజాపువ్వల రేకులు ఐదు, రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టి , ఆరంజ్ పౌడర్ ఒక టీస్పూన్, ఎగ్ వైట్, రోజ్ వాటర్ తగినంత కలుపుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. గులాబి రేకులు నీటిలో మరగనిచ్చి ఆవిరి పట్టి, ముఖానికి, మెడకు పట్టించి ఈ పేస్ట్ మాస్క్ లా వేసికొని అరగంట తర్వాత క్లీన్ చేసినట్లైతే ముఖం తాజా ఉంటుంది.
గులబిరేకులు ఐదు, ఒక టీస్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల పెసరపిండి, చిటికెడు పసుపు, నీళ్లు వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకొని తర్వాత ఈ పేస్ట్ ను అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా, సున్నితంగా తయారవుతుంది.
ముఖం నిగనిగలాడాలంటే ‘ఓట్ మీల్ చాక్లెట్ ఫేస్ మాస్క్’ను వేసుకోచ్చు. రెండు టీ స్పూన్ల చొప్పున కోక్ పౌడర్, తేనె, ఒక్కో టీస్పూన్ చొప్పున ఓట్ మీల్ పౌడర్, పాలమీగడ కలిపి అరగంట సేపు పక్కనుంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి ముఖానికి మాస్క్ వేసి మర్దనా చేయాలి. పదినిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ముఖంలో తేడా మీకు ఇట్టే అర్థఅవుతుంది.
జిడ్డు చర్మాన్ని కాంతివంతం చేసి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేందుకు ‘లెమన్ హనీ ఫేస్ ప్యాక్’ ట్రై చెయ్యవచ్చు. నిమ్మరసం, ఓట్ మీల్ పౌడర్, తేనె, పెరుగులను సమపాళ్లలో తీసుకుని ఓ గిన్నెలో వేసి చక్కగా మిశ్రమంలా చేసుకోవాలి. తర్వాత దాన్ని ముఖానికి మాస్క్లా వేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది.



Click it and Unblock the Notifications
