Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
నిగనిగలాడే చర్మం కోరకు...!

1. మేనికి మెరుపునిచ్చే ఈ గంధం ఎన్న జబ్బులకు కూడా ఉపశమనంగా వాడతారు. ఇలాంటి
ఒక స్పూను గంధంలో ఒక స్పూన్ పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
2. మంచిగంధం మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మంలో నుంచి పోయిన తేమను తిరిగి తీసుకురాగలగిన శక్తి చందనానికి కలదు.
3. జిడ్డు చర్మం వారికి గంధం బాగా ఉపయోగపడుతుంది. గంధంలో పెరుగు కలుపుకుని రాసుకుని ఓ పదిహేను నిమిషాల తర్వాత కడిగితే జిడ్డు తొలగిపోతుంది.
4. చందనాన్ని ముల్తానీ మట్టి, పన్నీరు కలిపి, పేస్ట్‌లా చేసి, ముఖం, మెడ మీద రాసుకుంటే ఈ లేపనం చర్మాన్ని స్నిగ్ధం చేస్తుంది. పాలిపోయిన చర్మానికి కూడా చందనం మేలు చేస్తుంది.
5. ప్రతి రోజూ గంధం వాడితే ముడతలు కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి.
6. ముఖంపై కనిపించే బ్లాక్ హెడ్స్ పోవడానికి కూడా గంధం సాయపడుతుంది. నలుగు పిండిలో రెండు స్పూన్ల గంధంపొడి కలిపి స్నానం చేస్తే ఒళ్లంతా చక్కని పరిమళం వస్తుంది.
7. గంధం మేలైన స్క్రబ్ గానూ ఉపయోగపడుతుంది. చర్మం జీవం లేకుండా, వాడిపోయినట్లుగా కనిపిస్తే, లేదా చర్మంలోని మృతకణాలు సౌందర్యానికి బాధకాలుగా నిలిస్తే, స్నానం చేసే ముందు, కాస్త బరకగా వుండే చందనం పొడిని ముఖం, మెడ, చేతులూ, కాళ్లకు రాసుకోవాలి. దాంతో చర్మం మీదుండే మృతకణాల పొర తొలగిపోతుంది. చర్మానికి కొత్త కాంతి వస్తుంది.
8. ఫేస్ క్లెన్జర్ గానూ, ఎండకు కమిలిన చర్మం మీదా చందనం తన చల్లని ప్రభావాన్ని చూపుతుంది. చందనం గల సబ్బులూ, చందనం పేస్ట్‌తో రోజూ చర్మాన్ని శుభ్రపరచుకుంటే, కొద్ది రోజుల్లోనే చర్మం వికసించి, సహజకాంతితో మెరుస్తుంటుంది.



Click it and Unblock the Notifications
